తెలుగుమ్మాయి అయినప్పటికీ నటిగా తమిళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెన్నైలో పుట్టి పెరిగినా ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగు సినిమా రాంబంటు చిత్రంలో ఓ సీన్‌లో కనిపించింది. ఆ తర్వాత 2010లో తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాలలో నటించింది. కెరీర్ ప్రారంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతి సరసన రమ్మీ, పన్నైరం చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవలే పెద్ద హీరోలు తనను పట్టించకోవడం లేదంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా? మరెవరో కాదండీ ఇటీవలే ఫర్హానా చిత్రంలో నటించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.
(ఇది చదవండి: ఇక చాలు ఆపండి, రష్మికను నేనేమీ అనలేదు: ఐశ్వర్య రాజేశ్)
టాలీవుడ్‌లో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ సినిమాల్లోనూ నటించింది. నటిగా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాని, సాయి ధరమ్ తేజ్‌లతో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఫర్హానా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం జూలై 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మె హాస్య నటి శ్రీలక్ష్మికి మేనకోడలు.
అయితే ఆమె తండ్రి రాజేష్ 38 ఏళ్ల వయసులో చనిపోయాడు. మద్యానికి బానిసై చనిపోవడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె తండ్రి రాజేష్ ఒకప్పుడు తెలుగులో గొప్ప నటుడు. ఆ తర్వాత ఐశ్వర్య పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించలేం. చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.
తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు రాజేశ్ భార్య ఉన్న ఆస్తులన్నీ అమ్మేసింది. చెన్నైలోని టీనగర్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌ను విక్రయించింది. ఆ తర్వాత అద్దె ఇంట్లో ఉన్న ఐశ్వర్య కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. ఓ ప్రమాదంలో ఐశ్వర్య ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించే బాధ్యతను తానే తీసుకుంది. ఓ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షోలో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2011లో మనాడ మైలాడ అనే రియాల్టీ షోలో విజేతగా నిలిచిన ఆమెకు ఆవగలం వీరిగళంలో ప్రియురాలి పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టకత్తి సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించింది.
(ఇది చదవండి: ఈ వారం కొత్త సినిమాల సందడి.. ఓటీటీలోనే ఎక్కువ!)
తాజాగా ఈ హీరోయిన్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. తాను ఫస్ట్ బర్త్ డే జరుపుకుంటున్న ఫోటోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. గతంలో తన అన్న, అమ్మతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆమె జీవితంలో కష్టాలను చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. చిన్నతనంలోనే తండ్రి, అన్నయ్యలను కోల్పోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment