
న్యూఢిల్లీ: లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం బయట స్వాత్రంత్య దినోత్సవాలప్పుడు జరిగిన హింసాత్మక ఘటనకు తాను చింతిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత ప్రధాని మోదీతో చెప్పారు. వారిద్దరు మంగళవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణపై ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని పాకిస్తానీ సంఘాలు, కశ్మీర్, సిక్కు వేర్పాటువాద బృందాల సభ్యులు హైకమిషన్ ఎదుట ర్యాలీ చేశాయి. దీంతో భారత అనుకూల బృందాలూ ర్యాలీ చేపట్టడంతో గొడవలు జరిగి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై తాను చింతిస్తున్నట్లు జాన్సన్ మోదీతో అన్నారు. భారత హై కమిషన్, ఆ కార్యాలయ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని బోరిస్ జాన్సన్ హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment