ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్టికల్ 370 అంశంపై పాకిస్తాన్ జోక్యం చేసుకుంది. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే విధమైన ఆలోచనతో ఉన్నాయని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మట్లాడుతూ.. ‘‘జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కూటమి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఎన్నికల అంశంగా మార్చారు. ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణ కోసం జమ్ము కశ్మీర్‌లో పాకిస్తాన్ , నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఒకే అభిప్రాయంతో ఉన్నాయి’’ అని అన్నారు. ఎన్నికల జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిపై పాక్ జోక్యం చేసుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దుమారం రేపుతున్నాయి. ఇక.. ఇప్పటి వరకు పాక్ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు.
Pakistan’s Defence Minister @KhawajaMAsif on Hamid Mir’s Capital Talk on Geo News says, “Pakistan and @JKNC_ - @INCIndia alliance are on the same page in Jammu & Kashmir to restore Article 370 and 35A”.
Will @RahulGandhi & @OmarAbdullah react. pic.twitter.com/x9dYev2PHM— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) September 19, 2024
ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తాము అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్ పూర్తిగా మౌనంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ప్రస్తావన లేకపోవటం గమనార్హం. కానీ, ముందు నుంచి జమ్ము కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని హామీ ఇస్తూ వస్తోంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ హామీ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు మెహబూబా ముఫ్తీ పీడీపీ తన మేనిఫెస్టోలలో పెట్టింది.
పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు బీజేపీ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారి వైపే ఉంటుందని ఆరోపణలు చేసింది. ‘‘ఉగ్రవాద రాజ్యమైన పాకిస్తాన్, కశ్మీర్ విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరిని సమర్థిస్తుంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎల్లప్పుడూ భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన వారి వైపు కనిపిస్తారు’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్‌లో విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment