24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
కశ్మీర్లో 16, జమ్మూలో 8 సీట్లు
బరిలో 219 మంది అభ్యర్థులు
వారిలో 90 మంది స్వతంత్రులే!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
శ్రీనగర్/జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో 8 స్థానాలు జమ్మూలో, 16 కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 23 లక్షల పై చిలుకు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు.
జమ్మూ కశ్మీర్‌లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం. పైగా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. దాంతో ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనని ఆసక్తి నెలకొంది. ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు, సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు. సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న రెండు, మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి.
పారీ్టలన్నింటికీ ప్రతిష్టాత్మకమే
ప్రధాన ప్రాంతీయ పారీ్టలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వేర్పాటువాద జమాతే ఇస్లామీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ, డీపీఏపీ కూడా బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్‌సీ పొత్తు పెట్టుకున్నా మూడుచోట్ల స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. మరో చోట ఎన్‌సీ రెబెల్ బరిలో ఉన్నారు. కశ్మీర్‌పై కాషాయ జెండా ఎగరేయజూస్తున్న బీజేపీనీ రెబెల్స్ బెడద పీడిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుంచి 43కు పెరిగాయి. ముస్లిం ప్రాబల్య కశ్మీర్‌లో ఒక్క సీటే పెరిగింది.
బరిలో ప్రముఖులు: మొహమ్మద్ యూసుఫ్ తరిగమీ (సీపీఎం) కుల్గాం నుంచి వరుసగా ఐదో విజయంపై కన్నేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్‌దూరు నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత సకీనా (దమ్హాల్ హాజిపురా), పీడీపీ నేతలు సర్తాజ్ మద్నీ (దేవ్‌సర్), అబ్దుల్ రెహా్మన్ వీరి (షంగుస్–అనంత్‌నాగ్), మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా (శ్రీగుఫ్వారా–బిజ్‌బెహరా), వహీద్ పరా (పుల్వామా) తదితర ప్రముఖులు తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ప్రధాన సమస్యలు ఇవే...
→ నిరుద్యోగం, అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి జమ్మూ కశ్మీర్ ప్రజలు ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు.
→ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభిస్తేనే సమస్యలు తీరి తమ ప్రయోజనాలు నెరవేరతాయని వారు భావిస్తున్నారు. దాంతో దాదాపుగా పారీ్టలన్నీ దీన్నే ప్రధాన హామీగా చేసుకున్నాయి.
→ ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని కూడా ఎన్‌సీ వంటి పార్టీలు చెబుతున్నాయి. విద్య, వివాహాలు, పన్నులు, సంపద, అడవుల వంటి పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తామంటున్నాయి.
→ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీరీలు భారీ సంఖ్యలో ఓటువేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment