లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఈ మేరకు వివరాలను ది ఇండిపెండెంట్ వెల్లడించింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్‌క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్‌డేటా పోలింగ్‌లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
రిషి కేబినెట్‌లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment