The Independent
-
2024లో రిషి గెలుపు కష్టమే!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో పాటు ఆయన కేబినెట్లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఈ మేరకు వివరాలను ది ఇండిపెండెంట్ వెల్లడించింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్డేటా పోలింగ్లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. రిషి కేబినెట్లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు. -
మూతపడుతున్న ‘ది ఇండిపెండెంట్’
లండన్: పీక్టైమ్లో నాలుగు లక్షలకు పైగా సర్కులేషన్గల ‘ది ఇండిపెండెంట్’ జాతీయ ఆంగ్ల దిన పత్రికను మూసివేసి, డిజిటల్ గ్లోబల్ ఇండిపెండెంట్ పత్రికపైనే దృష్టిని కేంద్రీకరించాలని ఈ పత్రికను ప్రచురిస్తున్న ఈఎస్ఐ మీడియా నిర్ణయించింది. లండన్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి జాతీయ దిన పత్రిక ఇదే. దిన పత్రిక సర్కులేషన్ రోజురోజుకు తగ్గి పోతుండడం, ఆన్లైన్ డిజిటల్ పత్రికకు రోజురోజుకు వీక్షకులు పెరిగిపోతుండడం, రానున్న కాలమంతా డిజిటల్ పత్రికలదే హవా అని గ్రహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మీడియా ప్రకటించింది. చివరి సంచిక మార్చిలో వెలువడుతుందని వెల్లడించింది. ‘ఇండిపెండెంట్ డాట్ కో డాట్ యూకే’ పత్రిక గత మూడేళ్ల నుంచి నాణ్యమైన పత్రికగా డిజిటల్ రంగంలో దూసుకుపోతోందని, గత 12 నెలల్లో 33.3 శాతం వ్యూహర్లు దీనికి పెరిగిపోయారని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు కోట్ల మంది యూజర్లు ఉన్నారని, లాభాలు కూడా ఫర్వలేదని ఈఎస్ఐ మీడియా తెలిపింది. ఈ ఏడాది యాడ్ రెవెన్యూ కూడా 50 శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొంది. వార్తా పత్రికల్లో యాడ్ రెవెన్యూ ఎక్కువగా ఉన్నప్పటికీ రీడర్ అభిష్టానుసారం తాము డిజిటల్ వైపే మొగ్గు చూపిస్తున్నామని, డిజిటల్ పత్రికగా మారినప్పటికీ నాణ్యతాపరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తామని ‘ది ఇండిపెండెంట్’ యజమాని ఎవజెనీ లెబెడెవ్ ప్రకటించారు. నాణ్యతాపరమైన జర్నలిజం కోసమే తన కుటుంబం ఈ పత్రికలో పెట్టుబడులు పెట్టిందని వివరించారు. లండన్ కేంద్రంగా 1986లో ది ఇండిపెండెంట్ పత్రికను స్థాపించారు. ఇండిపెండెంట్ పత్రికను మూసివేసినా, పత్రిక టైటిల్ను మరొకరికి విక్రయించినా ఈఎస్ఐ సంస్థ నుంచే వెలువడుతున్న ‘లండన్ ఈవెనింగ్ స్టాండర్డ్’ ప్రచురణ కొనసాగుతుందని మీడియా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పత్రికలో పనిచేస్తున్న దాదాపు 250 మంది జర్నలిస్టులను ఎలాంటి అన్యాయం జరగదని, ఉద్యోగులను తీసుకునే షరతుపైనే టైటిల్ను విక్రయిస్తామని ఆ వర్గాలు వివరించాయి. -
బ్రిటన్ సైన్యంలో బాలలు
లండన్: బ్రిటన్ సైన్యం చేపడుతున్న నియామకాల్లో దాదాపు పదోవంతు మందిని బాలలనే చేర్చుకుంటున్నారు. ప్రతి పదిమంది సైనికుల్లో ఒకరు నిండా పదహారేళ్ల లోపు వారే ఉంటున్నారు. బ్రిటన్ రక్షణ శాఖ స్వయంగా ఈ వివరాలను వెల్లడించింది. కొత్తగా సైన్యంలో చేరిన వారిలో నాలుగో వంతు మంది పద్దెనిమిదేళ్ల లోపు వారేనని, యుద్ధరంగానికి వెళ్లేందుకు తగిన వయసు లేనివారేనని తెలిపింది. బ్రిటిష్ దినపత్రిక ‘ది ఇండిపెండెంట్’ ఈ అంశంపై కథనాన్ని వెలుగులోకి తేవడంతో బ్రిటన్ సైన్యం తీరుపై విమర్శలు మొదలయ్యాయి. గల్ఫ్యుద్ధం జరిగినప్పుడు 1991లో, కొసావోకు 1999లో 17 ఏళ్ల లోపు వారిని పంపినందుకు విమర్శల పాలైన బ్రిటన్.. 18 ఏళ్ల లోపు వారిని యుద్ధరంగానికి పంపరాదంటూ నిబంధనలను సవరించుకుంది. అయినా, రక్షణ శాఖ పొరపాట్ల కారణంగా అఫ్ఘానిస్థాన్, ఇరాక్లకు 17 ఏళ్ల లోపు వయసున్న ఇరవై మంది సైనికులను పంపింది.