next elections
-
రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతమైనట్టేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగిన ఈ యాత్ర విజయవంతమైనట్టేనా? నూటా పాతికేళ్ల పై చిలుకు సుదీర్ఘ చరిత్రలోఎన్నడూ లేనంత నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్న కాంగ్రెస్‌కు కాస్తయినా కొత్త ఊపిరులూదేనా...? వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆశించిన మేరకు ఓట్లను ‘జోడి’ంచేనా...? కాంగ్రెస్. గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఎంతో ఘనచరిత్ర ఉన్న పార్టీ. మహా మహా నాయకులెందరినో దేశానికి అందించిన పార్టీ. సుదీర్ఘకాలం పాటు దేశాన్ని ఏలిన జన సమ్మోహన పార్టీ. దేశాన్ని ఒక్కతాటిపై నడిపిన పార్టీ. కానీ కొన్నేళ్లుగా సొంత నేతలనే ఒక్కతాటిపై నడపలేక ఆపసోపాలు పడుతోంది. ఏదో చెయ్యాలి. మళ్లీ ఎలాగైనా పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలి. ఈ తపన, మథనం నుంచి పుట్టిన ‘భారత్ జోడో యాత్ర’ పార్టీని మళ్లీ పట్టాలెక్కిస్తుందా? లేదా లెక్క తప్పుతుందా? వేచి చూడాల్సిందే! దేశ ప్రజలను ఈ యాత్ర ద్వారా రాహుల్‌గాంధీ ఏ మేరకు ప్రభావితం చేయగలిగారన్నది కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చే సీట్ల సంఖ్య ద్వారానే తేలుతుంది. చకచకా.. చలాకీగా... రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌కు చివరి ఆశాకిరణం. జోడో యాత్ర. రాహుల్‌గాంధీకి చివరి ఆశాకిరణం. ఈ యాత్రపై కాంగ్రెస్ గంపెడాశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్‌గాంధీ చలాకీగా నడుస్తూ, జనంతో మమేకమవుతూ చివరి మజిలీకి చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర అనబడే 3,570 కిలోమీటర్ల రాహుల్ పాదయాత్ర జనవరి 30న జమ్మూ కశ్మీర్లో ముగుస్తుంది. దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ రాజకీయ ప్రస్థానం మిగతా రాజకీయ నాయకులకు విభిన్నంగా ఉంటుంది. పట్టాభిషేకమే తరువాయి అనే యువరాజు హోదాలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయనలో సహజసిద్ధమైన చొరవ, దూకుడు ఒకింత తక్కువేనని చెప్పుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా చాలాకాలం పాటు అమ్మచాటు బిడ్డలానే కొనసాగడం, నాయకత్వం వహించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా వెనక్కు తగ్గడం ఆయన రాజకీయ శైలికి అద్దం పడుతుంది. ఇవాళ్టికీ కాంగ్రెస్‌కు అన్నీ ఆయనే. అయినప్పటికీ, ప్రతిపక్షాలకు మాత్రం ‘పప్పూ’గా మిగిలిపోయారు. ప్రతిపక్షాల అక్కసు ఎలా ఉన్నా, తనేమిటో నిరూపించుకోవడాదనికి జోడో యాత్ర రాహుల్‌కు మంచి అవకాశాన్నిచ్చింది. దాన్ని ఆయన హుందాగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. జనం నుంచి యాత్రకు మంచి స్పందనే వచ్చింది. చాలామంది ప్రముఖులు, మేధావులు రాహుల్‌తో కదం కలిపి సంఘీభావం తెలిపారు. ఆయన ఆత్మవిశ్వాసాన్ని ఓ మెట్టు పైకి లేపారు. అయితే కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఈ యాత్ర ఒక్కటే దోహదపడుతుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఆదరణ ఓటుగా మారుతుందా అన్నది మరో చిక్కు ప్రశ్న. వరుస ఓటములే నేపథ్యం... ప్రస్తుతం కేవలం మూడంటే మూడే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకోవడం కష్టమే! మహా అయితే లోక్‌సభలో తమ సీట్ల సంఖ్యను కొద్దో గొప్పో పెంచుకోగలదు. అంతే. నిజానికి కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అదే గొప్ప విజయంగా భావించవచ్చు. 2014 ఎన్నికల్లో కేవలం 44 సీట్లతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ ఆ తర్వాత సంస్థాగత మార్పులపై కసరత్తు చేసి 2017లో యువరాజు రాహుల్‌గాంధీని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టింది. అప్పటిదాకా అధ్యక్షురాలిగా కొనసాగిన తల్లి సోనియాగాంధీ నుంచి పార్టీ రాజదండం అందుకున్న రాహుల్ ఊహించినంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆయనలో చొరవ, దూకుడు, సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉండే కలుపుగోలుతనం లోపించాయనేది ఈ సమయంలోనే స్పష్టమైంది. పద్మవ్యూహంలాంటి రాజకీయ రణాంగణంలో మెతగ్గా, హుందాగా ఉంటే నడవదు. యుద్ధాన్ని ముందుండి నడిపించే సైన్యాధిపతిలా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి ఊహకందని వ్యూహాలతో ముందుకురకాలి. ఆలోచిద్దాం, చేద్దాంలతో పని నడవదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలు రాహుల్‌గాంధీ పనితీరుకు అగ్నిపరీక్ష పెట్టాయి. కానీ ఈసారి కూడా కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా కుదేలైంది. అధ్యక్ష పదవి సోనియా నుంచి రాహుల్‌కు మారినా కాంగ్రెస్ పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేసి కొన్నాళ్లపాటు నిస్తేజంగా ఉండిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ పెద్దలంతా కూడా సుదీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయారు. గత మేలో ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిరంలో మేధోమథనం చేసి భారత్ జోడో యాత్రకు రూపకల్పన చేశారు. ఆదరణ ఓటుగా మారేనా? ‘జోడో యాత్ర’ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో ఆగుతూ.. కదులుతూ... సాగుతోంది. వివాదాలకూ, వివాదాస్పద వ్యాఖ్యలకూ దూరంగా ఉంటూ, మనసులోని మాటను జనాలతో పంచుకుంటూ రాహుల్ యాత్రను కొనసాగిస్తున్నారు. సామాజిక సమస్యలు, మత సామరస్యం, ఆర్థిక అసమానతలు, రాజకీయ పెత్తందారీ పోకడల వంటి అంశాలే అజెండాగా ప్రజలతో మమేకమై చిట్టిపొట్టి విలేకరుల సమావేశాల్లో తన గళం వినిపిస్తూ వచ్చారు. ప్రధాన మీడియా చానళ్లు, పత్రికలకు సాధ్యమైనంత దూరంగా ఉన్నారు. యాత్ర సాగుతున్న తీరు, అభిమానుల ఆత్మీయ స్పర్శ, విలేకరుల సమావేశాలను తన హాండ్లర్ ద్వారా యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడాన్ని యాత్ర తొలి రోజు నుంచి ఏనాడూ మిస్ కాలేదు. ప్రతిపక్షాలు రుద్దిన ‘పప్పూ’ ట్యాగ్ నుంచి బయట పడటానికి ఇది బాగా దోహదపడింది. యాత్ర మొదలైన సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ఈ యూట్యూబ్ చానల్‌కు లక్షల్లో కొత్త వీక్షకులు జతగూడారు. ప్రధాని మోదీ పనితీరు, బీజేపీ అధికార దర్పం పట్ల అసంతృప్తిగా ఉన్నవాళ్లను రాహుల్ తన కొత్త వ్యవహార శైలితో ఆకర్షించగలిగారు. గత జనవరితో పోలిస్తే ఆయనకు స్వల్పంగా జనాదరణ పెరిగిందని పలు చానళ్ల సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ ఆదరణ వచ్చే జనవరికి పెరుగుతుందో, తరుగుతుందో చూడాలి. ఈ యాత్ర కాంగ్రెస్‌లో కచ్చితంగా కొత్త ఆశలు రేపిందనడంలో సందేహం లేదు. అయితే ఇదొక్కటే చాలదు. అటు లోక్‌సభలోనూ, ఇటు ప్రజల్లోనూ నిర్మాణాత్మక విమర్శలు, చేతలతో ప్రజల విశ్వాసం చూరగొనడానికి కాంగ్రెస్ ప్రయత్నించాలి. సొంతింట్లోనే చిచ్చు రాజేసే క్యాంపు రాజకీయాలకు స్వస్తి పలకాలి. అధికారం లేనిచోట ఒక్కతాటిపై నిలిచే ప్రయత్నం చేయాలి. తాను మారిన మనిషినని ఈ పాదయాత్ర ద్వారా రాహుల్‌గాంధీ నిరూపించుకున్నట్టే యాత్ర ద్వారా చేకూరిన లబ్ధిని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోగలగాలి. లేదంటే రాహుల్ భారత్ జోడో యాత్ర ఓటు జోడో యాత్రగా మారకుండా సుదీర్ఘ ‘ఈవినింగ్ వాక్’గానే మిగిలిపోతుంది! -
2024లో రిషి గెలుపు కష్టమే!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఈ మేరకు వివరాలను ది ఇండిపెండెంట్ వెల్లడించింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్‌డేటా పోలింగ్‌లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. రిషి కేబినెట్లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన స్థానంలో ఈ సారి సంగారెడ్డి కార్యక్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. క్యాడర్ వద్దంటే.. తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. మళ్లీ 2028 ఎన్నికట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు. సొంత పార్టీ లో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన నోరెత్తడం లేదు. నెలరోజులకుపైగా గాంధీభవన్‌కు కూడా రావడం లేదు. దీంతో ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్లలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపించే జగ్గారెడ్డి ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన ఆయన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లారు. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. -
Andhra Pradesh: టార్గెట్ 175
నిత్యం ప్రజల్లోనే ఉందాం.. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రత్యర్థులం మనమే. రానున్న రోజుల్లో రకరకాల కుట్రలు, కుయుక్తులు పన్ని ఎల్లో మీడియా సాయంతో మనపై మరింత దుష్ప్రచారం చేస్తారు. ఎందుకంటే ప్రజల వద్దకు వెళ్లి చెప్పుకొనేందుకు విపక్షాలు చేసిందేమీ లేదు. దేవుడి దయవల్ల ప్రతి కుటుంబానికీ మనం మేలు చేశాం. మనకున్న ఈ ప్రతిష్టను దెబ్బతీయడానికి విపక్షాలు చాలా కుయుక్తులు పన్నుతాయి. వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మనం నిత్యం ప్రజల్లో ఉండాలి. జనంతో మమేకమై నిరంతరం చేదోడు వాదోడుగా నిలిస్తే విపక్షాలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరు. ప్రజలు మనవైపే నిలుస్తారు. అప్పుడు విజయం మనదే అవుతుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో జయభేరి మోగించాం. వచ్చే ఎన్నికల్లో 175 చోట్లా విజయభేరి మోగిద్దాం. ఇదీ మన లక్ష్యం..’ అని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టం కానే కాదని స్పష్టం చేశారు. ‘అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికీ మంచి చేస్తూ చరిత్రలో చెరగని ముద్ర వేశాం. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి ఆశీస్సులు పొంది చేదోడువాదోడుగా నిలిస్తే 175 స్థానాల్లో విజయభేరి మోగించగలుగుతాం’ అని పేర్కొన్నారు. అందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై వర్క్‌షాప్‌ను సీఎం ప్రారంభించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ వర్క్‌షాప్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత మెరుగ్గా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిరంతరాయంగా దాదాపు 8 నెలలపాటు జరుగుతుంది. ఒక్కో సచివాలయం పరిధిలోని గ్రామాల్లో పర్యటించేందుకు రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. నెలకు 20 రోజుల చొప్పున పది సచివాలయాల్లో నిర్వహించాలి. గడప గడపకూ కార్యక్రమాన్ని ఏ రకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అనే అంశాలపై మనం నిరంతరం చర్చించుకోవాలి. ఇందుకోసం ప్రతి నెలా వర్క్‌షాప్ నిర్వహిస్తాం. ఆ నెల రోజుల్లో కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనపై చర్చిస్తాం. మరింత మెరుగ్గా నిర్వహణపై వర్క్‌షాప్‌లో దృష్టి సారిద్దాం. ప్రజాప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి చర్చిస్తాం. వర్క్‌షాప్‌లకు హాజరైనవారు వీటిని తెలుసుకోవడం వల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది. వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి.. గడపగడపకూ కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన విజ్ఞాపనలు, వాటి పరిష్కారం అత్యంత ముఖ్యమైన అంశం. ఈ ప్రక్రియ సజావుగా, సమర్థంగా సాగడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. అసాధ్యం, కష్టం కాదు.. అన్నిచోట్లా గెలుపు అన్నది అసాధ్యం కాదు. అది మన లక్ష్యం. అది కష్టం కాదు. ఎందుకంటే మనకు ఓటు వేసిన వారితోపాటు ఓటు వేయని వారికి కూడా కులం, మతం, వర్గం, ఏ పార్టీ అనేది చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం. ప్రతి ఇంటికీ మంచి చేశాం. చరిత్రలో చెరగని ముద్ర వేశాం. చరిత్రలో చెరగని ముద్ర గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా మీరు ప్రతి ఇంటికీ వెళ్లి వారికి చేకూరిన మేలును వివరిస్తున్నారు. ఆయా కుటుంబాలకు ఏయే పథకాలు అందాయో చెబుతున్నారు. చేసిన మంచికి సంబందించి ప్రతి అక్కచెల్లెమ్మకు లేఖలు అందచేస్తున్నారు. ప్రతి ఇంటికీ మేలు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులుగా మనకు అంతకన్నా ఏం కావాలి? చరిత్రలో మనం ఒక ముద్ర వేశాం. సంతృప్త స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం. కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతున్నాం. దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాం. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్.. పగటిపూటే వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా మన హయాంలోనే అందుతోంది. అధికారంలోకి వచ్చాక ఇందుకోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడలేదు. సాగుకు విద్యుత్ లోటు రానివ్వకుండా అడుగులు మందుకు వేస్తున్నాం. ఇవాళ ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధంతోపాటు రకరకాల కారణాల వల్ల బొగ్గు రేటు ఎన్నడూ లేని విధంగా పెరిగింది. బొగ్గు కొనుగోలుకు రోజూ రూ.40 కోట్ల మేర అదనంగా భారం పడినా వెనుకాడకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఊరూరా కళ్లకు కట్టినట్లు అభివృద్ధి.. వివక్ష, పక్షపాతం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందించాం. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు చేరాయి. ప్రతి సచివాలయం పరిధిలో కచ్చితంగా 2–3 రోజులు గడప గడపకూ నిర్వహించాలి. రోజూ ఉదయం నుంచి సాయంత్రం 6–7 గంటల వరకూ చేపట్టాలి. ప్రతి ఇంటికి మంచి చేశామని తలెత్తుకొని చెప్పే పరిస్థితి మనకు ఉంది. ప్రతి గ్రామంలోనూ మనం చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌లు, నాడు–నేడుతో పాఠశాలల అభివృద్ధి–ఇంగ్లీషు మీడియం చదువులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. గతంలో ఇవేవీ లేవు. మరి ఇప్పుడు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పది మంది ప్రభుత్వ సిబ్బంది పనిచేసే పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదు. ఇది అభివృద్ధి కాదా? మిస్డ్ కాల్.. నాణ్యతగా గ్రామంలో ప్రతి కుటుంబాన్ని కలిసిన తర్వాత వారితో మిస్డ్‌కాల్ చేయించడం చాలా ముఖ్యం. కార్యక్రమాన్ని నాణ్యతతో చేపట్టడం కీలకం. అర్హత ఉన్నవారు ఎవరికీ సంక్షేమ పథకాలు అందలేని పరిస్థితి ఉండకూడదు. అర్హత ఉండి ఎవరికైనా పొరపాటున సంక్షేమ పథకాలు దక్కకపోతే వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. పరిశీలన అనంతరం మంజూరు పత్రాలిచ్చి జూలై, డిసెంబర్లో వారికి సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నాం. ప్రతి ఇంటికీ మంచి చేశాం కాబట్టే... ఇప్పుడు మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతు తీసుకోవడమే. కుప్పం మున్సిపాల్టీని గెలుస్తామని ఎవరైనా అనుకున్నామా? ఎంపీటీసీలు, జడ్పీటీసీలను క్లీన్ స్వీప్ చేస్తామని అనుకున్నామా? ఇంతకు ముందెప్పుడూ అది జరగలేదు. కానీ ఈసారి జరిగింది. ఎందుకు జరిగిందంటే.. ప్రతి ఇంటికీ మంచి చేశాం కాబట్టే. ఇదే రీతిలో 175కు 175 శాసనసభ స్థానాలను సాధించగలుగుతాం. ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలి. -
ఓటేయని వాళ్లనూ గెలుచుకోవాలి
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలంతా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో పనిచేయాలనీ, గత ఎన్నికల్లో పార్టీకి ఓటు వేయని ప్రజల మనసులను కూడా గెలుచుకుని, వచ్చే ఎన్నికల్లో వారంతా బీజేపీకే ఓటు వేసేలా చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఓటు వేయని వారిపై లేదా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలబడిన వారిపై ద్వేష భావం వద్దనీ, అందరినీ కలుపుకుని పోతూ, అందరి మన్ననలూ పొందుతూ తర్వాతి ఎన్నికల్లో కూడా గెలుపు ఖాయం చేసుకునేలా ప్రవర్తించాలని తమ ఎంపీలకు మోదీ మార్గ నిర్దేశం చేశారు. అన్ని చోట్లా ప్రజలతోపాటే క్యూల్లో నిలబడాలనీ, జనంతో కలిసిపోయి మనుషులందరితో మర్యాదగా మాట్లాడాలని చెప్పారు. 380 మందికి పైగా బీజేపీ ఎంపీలకు శిక్షణనివ్వడం కోసం బీజేపీ శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముగింపు సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాలం నుంచి ఇప్పుడు ప్రధానిగా రెండోసారి గెలిచేంత వరకు, దాదాపు రెండు దశాబ్దాలుగా తాను ఎప్పుడూ అధికారంలోనే ఎలా ఉంటున్నదీ మోదీ వివరించారు. ఎంపీలు కూడా వ్యక్తిగతంగా, వృత్తిలోనూ ఎంతో నిబద్ధతతో ఉండాలనీ, నియోజకవర్గంలోని ప్రజలను ఎప్పుడూ కలుస్తూ, వారి మధ్యనే ఎక్కువ కాలం గడపాలని ఆయన సూచించారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించవద్దనీ, రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలకు, నియోజకవర్గానికి మంచి జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో ఏయే పోలింగ్ బూత్‌ల్లో ఓట్లు సరిగ్గా పడలేదో గుర్తించి, ఆ బూత్‌ల పరిధిలోని ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారిపై ద్వేషం పెంచుకోవడానికి బదులు మంచి చేస్తూ వారి ఆశీర్వాదం పొందాలంటూ ఎంపీలకు మోదీ పలు కిటుకులు చెప్పారు. కాగా, మోదీ ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు కచ్చితంగా చేరేలా చేసేందుకు ఎంపీలను ఉపయోగించుకోవాలని మంత్రులకు బీజేపీ సూచించింది. ఎంపీలతో ప్రతి నెలా మంత్రులు సమావేశమై పథకాల గురించి వారికి చెబుతుండాలనీ, ఈ భేటీలకు అన్ని పార్టీల ఎంపీలనూ ఆహ్వానించాలని తెలిపింది. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం
-
టీడీపీ, బీజేపీలకు పతనం తప్పదు
కొత్తపల్లె : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికలలో పతనం తప్పదని సీపీఎం మండల కార్యదర్శి స్వాములు, సంజీవరాయుడు హెచ్చరించారు. మంగళవారం కొత్తపల్లెలో అఖిలభారత 22వ మహాసభల పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ పట్టణంలో జరిగే అఖిలభారత 22వ మహాసభలను విజయవంతం చేసేందుకు మండలంలోని సీపీఎం కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. 5 రోజులపాటు సాగే ఈ మహాసభలలో ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాన్, దాసు, యేసన్న, స్వామిదాసు, వెంకటరమణ, యేసుకుమార్, దేవకుమార్, శేషన్న తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
చెన్నారావుపేట(నర్సంపేట) : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని బాపునగర్ గ్రామానికి చెందిన భాస్కర్, రాజేందర్, రాజు, హరిలాల్, మొగిలితో పాటు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటలు చెప్పడం కంటే చేసి మాట్లాడటమే తన తత్వం అన్నారు. ప్రజల కోసమే పనిచేస్తున్నానని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని చెప్పారు. ఎంపీపీ జక్క అశోక్, జెడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, మాజీ సర్పంచ్ రాంచంద్రు, లింగం, రవి, మంగీలాల్, హతిరాం, బాలు, హనుమ, నవీన్, రవి, శ్రీను గోపాల్ ఉన్నారు. -
వచ్చే ఎన్నికల్లో ‘అయోధ్యే’ ప్రధానాంశం?!
అవలోకనం జనాన్ని ఆకట్టుకునే రీతిలో ఎన్నికల ప్రచారాన్ని రూపొందించడానికి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలనూ, మార్కెటింగ్ సంస్థలనూ నియమించుకోవడమనే సంప్రదాయానికి మన దేశంలో శ్రీకారం చుట్టినవారు రాజీవ్‌గాంధీ. సార్వత్రిక ఎన్నికల సమయంలో రూపొందించుకునే నినాదాలు జనాన్ని ఆకర్షించగలిగితే పార్టీలు విజయం సాధించగలుగుతాయి. లేనిపక్షంలో పేలవమైన ఫలితాలు వస్తాయి. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు త్వరలో ఇవ్వబోయే తీర్పు ఎలాంటిదైనా వచ్చే ఎన్నికల్లో అదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ అంశంపై హోరాహోరీ పోరు ఉంటుంది? ఇప్పటినుంచి రానున్న నెలల్లో పార్టీలు, కూటములు ఏం చేయాలో, ఎటుండాలో ఖరారు చేసుకుంటాయి. అందరినీ ఆకట్టుకునేలా సందేశాలను రూపొందించి ప్రజలకు అందించేందుకు అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలనూ, మార్కె టింగ్ నిపుణులను ఆశ్రయిస్తాయి. ఈ పని కోసం 2014లో బీజేపీ ఓగిల్వీ అండ్ మాథెర్ (ఓ అండ్ ఎం) సంస్థను నియమించుకోగా కాంగ్రెస్ డెంట్సూ సంస్థకు అప్పగించింది. నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీకి అప్పగించడం 1985లోనే మొదలైంది. ఆ ఏడాది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రచార బాధ్యతల కోసం రెడీఫ్యూజన్ సంస్థను నియమించుకు న్నారు. ఈసారి కూడా రాజకీయ నాయకులు సూటూ బూటుల్లో వచ్చే నిపుణు లతో సమావేశమవుతారు. ఆ నిపుణులు ఆకట్టుకునే సందేశాలతో పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు ఇస్తారు. ‘యే దిల్ మాంగే మోర్’, ‘యే అందర్ కి బాత్ హై’, ‘అచ్ఛేదిన్ ఆనేవాలే హై’ లాంటి ఆకర్షణీయ నినాదాలను రూపొంది స్తారు. 2014 అనుభవాలతో ఈసారీ సామాజిక మాధ్యమాల్లోనూ, టెక్నాలజీ లోనూ భారీ పెట్టుబడులు పెడతారు. ఈ ఎన్నికల్లో చాలా మంది దండిగా డబ్బు గడిస్తారు. 2014 ఎన్నికల ప్రచారంలో రూ. 714 కోట్లు ఖర్చు చేశామని బీజేపీ ఎన్నికల సంఘానికి తెలిపింది. తాము రూ. 516 కోట్లు వ్యయం చేశామని కాంగ్రెస్ లెక్క లిచ్చింది. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ రూ. 51 కోట్లు ఖర్చు చేసినట్టు నివేదిక సమర్పించింది. 2019 ఎన్నికల నాటికల్లా ఈ ఖర్చు రెట్టింపు నుంచి మూడురెట్లు పెరుగుతుందని భావించవచ్చు. అభ్యర్థులు చేసే ఖర్చు, పార్టీల తర ఫున వేర్వేరు కంపెనీలు చేసే ఖర్చు దీనికి అదనం. ఇదంతా మన దేశంలో సాధార ణమే. ప్రధాన అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 15 కోట్ల వరకూ సులభంగా ఖర్చుచే స్తారు. పార్టీ టిక్కెట్ రావడానికి వీరు చేసే ఖర్చు అదనం. మొత్తంగా 2019 ఎన్నికల్లోగా రూ. 25,000 కోట్ల వరకూ చేతులు మారుతుంది. ఇది మరీ అతి శయోక్తని మీరనుకుంటే నిరుడు జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రూ. 5,500 కోట్లు ఖర్చయిందని ‘ఎకనామిక్ టైమ్స్’ ప్రచురించిన అంచనాను గమనిం చండి. వార్తాపత్రికలు, టీవీ చానెళ్లు రాజకీయ ప్రకటనల రూపంలో అదనపు ఆదా యాన్ని సంపాదించుకుంటాయి. ఇందులో చాలా భాగం వార్తా కథనాల రూపంలో ఉంటాయి. చాలా లావాదేవీలుంటాయి. నీరవ్ మోదీ కుంభకోణం చూపినట్టు అవినీతి రహిత నేతతో అవినీతి ప్రారంభం కాదు. అక్కడే ముగియదు కూడా. ఏ కూటమివైపు మొగ్గితే గరిష్ట ప్రయోజనం ఉంటుందో ఎలాంటి భావోద్వేగాలకూ తావు లేకుండా రాజకీయ పార్టీలు మదింపు వేసుకుంటాయి. అవసరాన్నిబట్టి కొత్త కూటములకు సిద్ధపడతాయి. కొందరు నేతలు తొందరపడకుండా వేచిచూసే ధోరణి అవలంబించి, చివరిలో మరింత రాబట్టుకోవచ్చునన్న అంచనాలతో ఉంటారు. 2019కి ముందు మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాహుల్‌కి ఎంత దూరంగా ఉండాలో, లేదా ఎంత దగ్గరగా ఉండాలో ఈ నాలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలూ నిర్ధారించు కోవడానికి ఇవి దోహదపడతాయి. బీజేపీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించగలు గుతున్నదో, అందుకు దోహదపడుతున్న కారణాలేమిటో దాని ప్రత్యర్థులు తెలుసు కున్నారు. అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలకు పదును పెట్టుకుం టారు. ఉత్తర ప్రదేశ్‌లో ఈమధ్య జరిగిన రెండు ఉప ఎన్నికల కోసం మాయావతి, అఖిలేష్ యాదవ్లమధ్య కుదిరిన ఒప్పందాల వంటివి మనం చాలా చూస్తాం. వచ్చే ఎన్ని కలు ఏ అంశం ప్రాతిపదికన జరగనున్నాయన్న మొదటి ప్రశ్న దగ్గరకు మళ్లీ వెళ్దాం. మొత్తం ఆ ఎన్నికల తీరుతెన్నుల్ని ఎవరు నిర్దేశించగలుగుతారన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది. 2014లో ప్రతిపక్షానికి చెందిన నాయకుడు ఆ ఎన్నికలను నిర్దేశించారు తప్ప అధికార పక్షం కాదు. బీజేపీ తన సారథికి ఉందంటున్న శక్తి సామర్థ్యాలను ముందుంచి బరిలోకి దిగితే కాంగ్రెస్ పార్టీ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంజాయిషీ ఇచ్చుకోక తప్పని స్థితిలో పడింది. 2009లో బీజేపీ తన ప్రచార సారథి ఎల్కే అద్వానీని పటిష్టమైన నాయకుడిగా చూపేందుకు ఫ్రాంక్ సిమోస్, టాగ్ అండ్ ఉటోపియా అనే రెండు ఏజెన్సీలను ఉపయోగించుకుంది. ‘దృఢమైన నేత–నిర్ణయాత్మక ప్రభుత్వం’ అనేది అప్పటి నినాదం. మన్మోహన్ సింగ్ నిర్ణయరాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న నేతగా చూపడం ఆ ప్రచారం వెన కున్న ఉద్దేశం. ఆ ఏడాది కాంగ్రెస్ జే వాల్టర్ థాంప్సన్(జే డబ్ల్యూ టీ) అనే ఏజెన్సీ సాయం తీసుకుంది. ఆ సంస్థ ‘ఆమ్ ఆద్మీ’ నినాదానికి రూపకల్పన చేసింది. అయితే దాన్ని అనంతరకాలంలో అరవింద్ కేజ్రీ వాల్ సొంతం చేసుకున్నారను కోండి. 2004లో వాజపేయి గ్రే వరల్డ్‌వైడ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా షైనింగ్’ నినాదాన్ని స్వీకరించి బరిలోకి దూకారు. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ ఓడిపోయింది. అలా ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటో ఇప్పటికీ ఎవరికీ పూర్తి అవగాహనకు రాలేదు. 2019లో జరిగే ఎన్నికలు అనుకూలాంశ (పాజిటివ్) ప్రచారంతో ఉండవు. నా ఉద్దేశం ప్రకారం అటు పాలకపక్షం నుంచి గానీ, ప్రతిపక్షం నుంచిగానీ ‘అచ్ఛేదిన్’ మాదిరి నినాదంతో ప్రచారం ఉండదు. మన ఆర్థిక వ్యవస్థ అంత ప్రత్యేకత చూపే స్థాయిలో ఏమీ పనిచేయలేదు. పౌరు లుగా మన బతుకులు 2014కూ, ఇప్పటికీ గమనించే స్థాయిలో ఏం మారలేదు. కొద్దిరోజుల క్రితం నేను ఒక బీజేపీ నేతతో మాట్లాడాను. 2019నాటికి అయోధ్య అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతామని ఆయన చెప్పారు. ఇప్పటికైతే బీజేపీ దాని జోలికి పోలేదు. కానీ ఇదంతా మారొచ్చు. సుప్రీంకోర్టు అయోధ్య కేసును విచారిస్తోంది. త్వరలో ఆ కేసులో తీర్పు వెలువడొచ్చు. దీన్లో తమను కూడా కక్షిదారులుగా చేర్చాలంటూ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు కొద్ది రోజులక్రితం కోరితే సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంప్రదింపుల ద్వారా దీనికి పరిష్కారం వెదకాలన్న ప్రతిపాదనను కూడా అది ఒప్పుకోలేదు. ‘భూ వివాదంలో మధ్యేవాద పంధా ఎలా సాధ్యమ’ని ప్రశ్నించింది. అదెలాంటి తీర్పయినా ఆ అంశం వచ్చే ఎన్నికల్లో ప్రధానమవుతుంది. అయితే ఆ ప్రచారం ద్వారా జనంలోకెళ్లే సందేశం ఏమిటన్నది ఊహించడానికే నాకు వణుకొస్తోంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
గులాబీ పార్టీలో ... జోష్ !
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గడిచిన రెండేళ్లలో ఆయా సందర్భాల్లో ఈ అంశం కార్యకర్తల్లో ప్రచారం జరిగినా, ఈ సారి మరింత స్పష్టంగా ఆయన పోటీ చేయడం ఖాయమని విశ్వసిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ ఆ మేరకు రెండు రోజుల కిందటే స్వయంగా ప్రకటన చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్ ఆయనను అభినందించడానికి ప్రగతి భవన్‌కు తరలివెళ్లారు. జిల్లా నేతలు సైతం మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ను ఆదివారం కలిశారు. ఈ సదర్భంగా కూడా జిల్లా నేతలు నల్లగొండకు ఆహ్వానించారని పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్ నల్లగొండ లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేయడం వల్ల పార్టీకి బహుళ ప్రయోజనాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు పాల్గొంటున్నారు. ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో అయిదు చోట్ల విజయం సాధించింది. అయితే, సూర్యాపేట మినహా మిగిలిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు భువనగిరి లోక్‌సభా స్థానం పరిధిలోనివే కావడం గమనార్హం. నల్లగొండ లోక్‌సభ సీటు పరిధిని నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జుసాగర్, హుజూర్నగర్, కోదాడల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, దేవరకొండలో కాంగ్రెస్ పొత్తుతో సీపీఐ బయట పడింది. సూర్యాటపేలో మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. ప్రధానంగా ఈ నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోనే ఉన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే నల్లగొండలో కాంగ్రెస్‌ను పూర్తిగా దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ నాయకత్వం కొత్త ఎత్తు వేస్తోందంటున్నారు. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే వ్యూహం రచించారని అంటున్నారు. దీనివల్ల నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం తేలికవుతుందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. కేవలం ఏడు సెగ్మెంట్లలో మాత్రమే కాకుండా సీఎం కేసీఆర్ పోటీస్తే ఆప్రభావం నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటుందని వీరు విశ్లేషిస్తున్నారు. పార్టీ కేడర్‌లో ఊపు తెచ్చేందుకు ఆయా సందర్భాల్లో కేసీఆర్ ఆయా నియోజకవర్గాలను మార్చి మార్చి పోటీ చేసి ఫలితాలు రాబట్టారు. ఆయన గతంలో కరీంనగర్, మహబూబ్‌నగర్, గత సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. ఈ మారు నల్లగొండ ఎంపీ సీటు నుంచి అదే తరహాలో పోటీ చేయడానికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. ఆదివారం ప్రగతి భవన్లో ఆయనను కలిసిన జిల్లా నేతలు మరో మారు ఆయనను ఆహ్వానించారని అంటున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలున్న జిల్లాలో గురిచూసి దెబ్బకోట్టేందుకు ఇదే సరైన ఉపాయమన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు మరి కొద్ది నెలలే మిగిలి ఉన్నందున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇప్పటికే మంత్రి కేటీఆర్ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పర్యటించి వెళ్లగా, మంగళవారం కోదాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొత్తానికి అధికార పార్టీ కేడర్‌లో జోష్ నింపే పనిలో నాయకత్వం ఉన్నట్లు విదితమవుతోంది. -
హస్తంతోనే స్నేహం
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ స్నేహ హస్తం చాపితే తమకు ఎలాంటి అభ్యతరం లేదని బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ నాయకుడు ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. అయితే పొత్తుకు ముందు కాంగ్రెస్ తమ వైఖరేంటో స్పష్టం చేస్తే అప్పుడు తమ నిర్ణయమేంటో వెల్లడిస్తామని స్పష్టంచేశారు. దాదర్‌లోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం సాయంత్రం బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొద్ది సేపు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ, బీజేపీ, శివసేనతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ప్రకాశ్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి.. భీమా కోరేగావ్ దాడుల ఘటనలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న మిలింద్ ఏక్బోటేను ఎన్సీపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. శివసేన స్నేహ హస్తం చూపితే పొత్తుపెట్టుకుంటారా...? అని విలేకరులడిగిన మరో ప్రశ్నకు ప్రకాశ్ సమాధానమిస్తూ శివసేన ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రభుత్వంలోంచి బయటపడాలని, ఆ తరువాత పొత్తు విషయంపై మేం ఆలోచిస్తామని అన్నారు. ఏక్బోటే బీజేపీతో ఉన్నారని, అతన్ని ఎన్సీపీ రక్షించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారణ పూర్తయ్యేంత వరకు ఏక్బోటేను అరెస్టు చేయరని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటున్నారని, దీన్నిబట్టి ఏక్బోటేను ముఖ్యమంత్రి కూడా వెనుకేసుకొస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. నకిలీ కులధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందని, కానీ, వీరందరిని ఉన్న ఫలంగా ఉద్యోగంలోంచి తొలగిస్తే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఉద్యోగుల కొరత వల్ల కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగవన్నారు. ఫలితంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, దీంతో వీరందరికి పదోన్నతులు కల్పించకుండా ప్రస్తుతం కొనసాగుతున్న చోటే విధులు నిర్వహించేలా ఉద్యోగంలో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
సీట్ల కోసం సిగపట్లు..
అభివృద్ధి మంత్రంతో నెగ్గుకురాలేమని ఓ పక్క చంద్రబాబు వ్యూహాలు రచిస్తుంటే.. జిల్లా టీడీపీ నేతలు సిగపట్లతో బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర కాలం ఉండగానే.. ఆ సీటు నాదంటే నాదంటూ కుమ్ములాటలు మొదలెట్టారు. కొన్నిచోట్ల ప్రస్తుత ప్రజాప్రతినిధులపైకి స్థానిక నాయకులు కాలు దువ్వుతుండగా.. మరికొన్నిచోట్ల జంప్ జిలానీలు ఆశావహులకు ఎసరు పెట్టేలా ఉన్నారు. సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం సిటింగ్ ఎమ్మెల్యేలకు ఆశావహులు ఒకపక్క చెమటలు పట్టిస్తుంటే.. వైఎస్సార్సీపీ నుంచి వలస వచ్చిన శాసనసభ్యులు తొలి నుంచీ టీడీపీని నమ్ముకున్న నేతల ఆశలకు గండి కొడుతున్నారు. వెరసి ఎన్నికల వేడి రాజుకోకముందే అధికార పార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. నేను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ ప్రజాప్రతినిధులే కాదు.. ఆ పార్టీ నేతలు సైతం గురిపెట్టి బరిలోకి దిగుతుండడంతో సిటింగ్‌లకు ప్రాణ సంకటంగా మారింది. ఈసారి సీటు దక్కుతుందో లేదోనన్న సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పుణ్యమాని అరకు, పాడేరు స్థానాలపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ల ఆశలకు గండిపడే పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న ఎన్నికల్లోనైనా గెలవకపోతానా? అని పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆశలు పెట్టుకోగా.. ఈసారి తనకు చాన్స్ దక్కుతుందన్న ఆశతో సీనియర్ నాయకుడు పాంగి రాజారావు ఇంతకాలం ఉన్నారు. గతేడాది టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రాకతో వీరి ఆశలకు గండిపడినట్టయింది. అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని నమ్మించి మోసగించినా పార్టీనే అంటిపెట్టుకున్న మాజీ మంత్రి మణికుమారి, త్రిసభ్య కమిటీ సభ్యులైన బొర్రా నాగరాజు, ఎంవివిఎస్ ప్రసాద్‌లు రానున్న ఎన్నికల్లో పాడేరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాకతో వీరి ఆశలకు ఇక్కడ గండి పడింది. ఈ రెండు చోట్ల పైకి గుంభనంగా ఉన్నప్పటికీ లోలోన మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పార్టీ ఆశావాహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి చేరికను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బాహాటంగానే వ్యతిరేకించారు. గత నాలుగేళ్లుగా నామినేటెడ్ పదవులు దక్కక.. రానున్న ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న ఆశ లేక ఏజెన్సీ టీడీపీలో అసంతృప్తి నివురుగప్పిన నిçప్పులా రాజుకుంటోంది. ఏ క్షణంలోనైనా వీరు తమ అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైదానంలో అసమ్మతి సెగలు మైదాన ప్రాంతంలోనూ ఇదే రీతిలో అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. అనకాపల్లితోపాటు యలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలకు పలువురు ఎసరుపెట్టేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి నియోజక వర్గంపై ఒకరు కాదు.. ఇద్దరు కాదు నెలకొకరు సీటు నాదంటే నాదంటూ తెరపైకి వస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భూ కబ్జా కేసులో ఇరుక్కోవడంతో ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో ఈ స్థానం నుంచి పోటీ చేయబోతున్నామంటూ.. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు నర్మగర్భంగా ప్రకటించారు. అబ్బే అదేం లేదు ఈసారి నేనే పోటీ చేస్తా, నా సీటు ఎవరికీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పీలా చెప్పుకొచ్చారు. తాజాగా గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలికి టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన బంధువు పరుచూరి భాస్కరరావు తన మనసులోని మాటను బయటపెట్టారు. అనకాపల్లి నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని, పార్టీ అధిష్టానం కూడా తన సేవలను గుర్తించి టికెట్ ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీంతో అనకాపల్లి అసెంబ్లీపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పోటీ పడుతున్నట్టయ్యింది. యలమంచిలి నుంచి రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈ స్థానంపై ఇరువురు కన్నేశారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు ఆడారి ఆనంద్‌తో పాటు జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని భర్త లాలం భాస్కర్ ఈ సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు. విశాఖ డెయిరీ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఆడారి తులసీరావు లేదా ఆయన కుమార్తె పాల్గొనేవారు. కానీ కొన్ని నెలలుగా ఆనంద్ చురుగ్గా పాల్గొంటున్నారు. భాస్కర్ కూడా ఈ నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో పంచకర్ల కొత్త నియోజకవర్గం వెతుక్కోవల్సిన పరిస్థితి నెలకొంది. చోడవరంపై గంటా కన్ను చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు ఈసారి ఎసరు పెట్టేలా ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజుకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రతిసారి నియోజకవర్గం మారే గంటా ఈసారి సిటీలో ఏదో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది వర్కవుట్ కాకపోతే గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన చోడవరాన్ని ఎంచుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఈ స్థానం నుంచి టీడీపీ తరపున తాను బరిలోకి దిగబోతున్నట్టు గంటా తనయుడు రవితేజ ఆమధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చిన విషయం విదితమే. ఈ తండ్రీ కొడుకులిద్దరూ చోడవరంలో ఎమ్మెల్యే రాజు సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఏడాదిన్నర ముందుగానే అధికార టీడీపీలో నెలకొన్న సీట్ల సిగపట్లు ఆ పార్టీకి తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
‘గులాబీ’ తోటలో ‘బీసీ’ జాతర
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏడాది ముందు నుంచే అధికార టీఆర్ఎస్ కార్యాచరణకు నడుం బిగిస్తోంది. జనహిత తరహాలో భారీ జనసభలకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కులాలు, వర్గాల వారీగా ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన నివాసం ప్రగతి భవన్లో జనహిత సమావేశాలు నిర్వహించారు. రైతులు, జర్నలిస్టులు, పాడి రైతులు, చేనేతలు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు.. ఇలా వరుసగా వివిధ వర్గాలను సమావేశపరిచి వారితో ముఖాముఖి మాట్లాడారు. పలు సందర్భాల్లో అందరితో కలిసి భోజనం చేశారు. క్షేత్రస్థాయిలో వారి సమస్యలను అడిగి తెలుసుకోవటంతోపాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రచారం చేసే దిశగా ఈ సభలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సమావేశాలకు ఎంపిక చేసిన గ్రామాలు, జిల్లాల నుంచే కొద్ది మందిని ప్రత్యేకంగా ఆహ్వానించిన టీఆర్ఎస్ శ్రేణులు.. ఇకపై భారీ జనసభల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే సీఎం.. పార్టీ ముఖ్య నేతలను ఈ దిశగా కార్యాచరణకు పురమాయించినట్లు సమాచారం. ప్రధానంగా కులాల వారీగా జనాన్ని మోహరించాలని, వివిధ పథకాలతో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కులాలను సమీకరించి రాష్ట్రమందరి దృష్టిని ఆకర్షించేల ఈ సభలను ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. వచ్చేనెల నుంచే ఈ జన సభలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మార్చి నుంచి వరుసగా కులాల వారీగా నెలకో భారీ బహిరంగ సభ నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా గొల్ల, కుర్మలు, ముదిరాజ్, గంగపుత్ర కుల సభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలకు ముందే కులాల వారీగా వీలైనన్ని తాయిలాలు ప్రకటించటంతోపాటు ప్రభుత్వం తరఫున ఇప్పటికే హామీ ఇచ్చిన కార్యక్రమాలను కూడా ప్రారంభించి తీరాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. జనాభా ఎక్కువున్న కులాలకు పెద్దపీట జనసభల్లో భాగంగానే కొన్ని ముఖ్యమైన కుల సంఘాలకు హైదరాబాద్‌లో స్థలాలు కేటాయించనున్నారు. బీసీ ఓట్లను ఆకర్షించే దిశగా ఎక్కువ జనాభా ఉన్న కులాలకు ప్రాధాన్యమిచ్చేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాలో ముదిరాజ్, గొల్ల, కుర్మలు, గౌడ, చేనేత కులాలది అగ్రస్థానం. ముదిరాజ్, గొల్ల, కుర్మల్లో దాదాపు 50 లక్షల మంది ఓటర్లున్నట్లు టీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. ముందుగా ఈ మూడు కులాలపై దృష్టి సారించింది. ఇప్పటికే 7 లక్షల మంది గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేస్తోంది. ముదిరాజ్, గంగపుత్రులకు మేలు చేసేలా ప్రతీ ఏడాది ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. చేనేతలకు రుణమాఫీతోపాటు ఉచితంగా నూలు, రసాయనాలను అందిస్తోంది. వాస్తవానికి బీసీ కులాలను ఆకర్షించే ప్రయత్నాలను బడ్జెట్ నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించింది. ఇప్పుడు ఈ వర్గాలన్నింటినీ ఆకట్టుకొని, ఓటు బ్యాంకుగా తమవైపు మలుచుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నాలుగైదు లక్షల మందితో గొల్ల కుర్మ సభ జనసభలకు భారీగా జనాన్ని తరలించేలా టీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. ముందుగా నాలుగైదు లక్షల మందితో గొల్ల, కుర్మ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మార్చిలో హైదరాబాద్‌లో ఈ సభ పెట్టాలని నిర్ణయించింది. ముందుగా జిల్లాల వారీగా సన్నాహక సభలు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు భారీగా జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటోంది. వీటిని గొల్ల, కుర్మ సంఘాలతోపాటు టీఆర్ఎస్ శ్రేణులన్నీ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సీఎం ఇప్పటికే పార్టీ ముఖ్యులకు సూచనలు చేసినట్లు తెలిసింది. అన్ని బహిరంగ సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. ఇందులో భాగంగానే గొల్ల, కుర్మలకు వేర్వేరుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదెకరాల చొప్పున స్థలం కేటాయించనున్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో గొల్ల భవన్, కుర్మ భవన్, వేర్వేరుగా హాస్టళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలోనే సీఎం వీటికి శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ తర్వాత ముదిరాజ్, గంగపుత్ర సభ, గౌడ సభలకు ప్రణాళిక రూపొందించుకున్నారు. -
చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవ్
వచ్చే ఎన్నికల్లో జనసునామీలో కొట్టుకుపోవడం ఖాయం : వైఎస్ జగన్ ► కాంట్రాక్టర్ల కోసం పోలవరం వ్యయం పెంచుతున్నారు ► సబ్ కాంట్రాక్టర్లకు పనులిచ్చి లంచాలు పంచుకుంటున్నారు ► పరిహారం కోసం ప్రశ్నించిన రైతులను మాత్రం జైల్లో పెడుతున్నారు ► ఒకే ప్రాజెక్టు కింద రకరకాల పరిహారాలివ్వడం ఎక్కడైనా ఉందా? ► పట్టిసీమలో ఇచ్చినట్లే ప్రతి రైతుకూ రూ.19 లక్షలు ఇవ్వాలి ► ఇప్పుడు 18 ఏళ్లు నిండిన వారికి కూడా ప్యాకేజీ వర్తింపచేయాలి ► గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు ► ఒక్క ఆస్పత్రిలోనూ మందులు లేవు.. వైద్యులూలేరు ► 4 నెలల్లోనే 14 మంది పెద్దలు, 15 మంది పిల్లల కన్నుమూత ► జీడీపీలో నాలుగో స్థానంలో ఉన్నామని చంద్రబాబు గొప్పలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘పేదల ఉసురుపోసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జన సునామీలో కొట్టుకుపోవడం ఖాయం. పైనుంచి దేవుడు కూడా మొట్టికాయలు వేస్తున్నాడు. భగవంతుడు కరుణిస్తే మరో ఏడాదిలోనే ఎన్నికలు రావచ్చు. ఇవాళ కాకపోయినా మరో రెండేళ్లకు ఎన్నికలు రావడం అనివార్యం. అప్పుడు చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవ్’’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, సిమ్మెంట్, ఇనుము, ఇసుక రేట్లు తగ్గుతున్నా... కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యయాన్ని ఏటేటా పెంచుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు ప్రాజెక్టుకోసం భూములిచ్చిన గిరిజనులు పరిహారం అడిగితే జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరెక్కడా ఉండబోడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో రెండవ రోజు పర్యటనలో భాగంగా గురువారం వీఆర్ పురం మండలం రేఖపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. కాంట్రాక్టర్ మేలుకే ‘పోలవరం’ వ్యయం పెంపు 2013లో రూ.16 వేల కోట్లు ఉన్న వ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచడం కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసమే. చంద్రబాబు తనకు నచ్చిన సబ్‌కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ’నాకింత నీకింత’ అని లంచాలు పంచుకుంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌కు పోలవరం సబ్‌కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. మరోవైపు పరిహారం కోసం ప్రశ్నించిన రైతులను జైల్లో పెట్టిస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరెక్కడా ఉండడేమో. ముంపు ప్రాంతంలో మూడేళ్లుగా ప్రజలు పడుతున్న అగచాట్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ముంపు మండలాల్లో వీఆర్వో దగ్గరనుంచి ఎమ్మార్వో వరకూ అందరూ టెంపరరీ, ఇన్చార్జ్ ఉద్యోగులే. ఆఖరుకు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా ఓ ఏవోను పెట్టారు. దీన్ని చూస్తుంటేనే ఈ ప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వానికి ప్రేమ ఏమిటో అర్థమవుతోంది. ఒక్కో చోట ఒక్కో ప్యాకేజా? పోలవరం రావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ప్రాజెక్టుకోసం భూములిచ్చి త్యాగం చేసిన గిరిపుత్రులకు న్యాయం చేయాలని అడగడం ధర్మమే కదా! గిరిజనుల అవస్థల గురించి చెప్తే అభివృద్ధి నిరోధకులని అభాండాలు వేసేస్తున్నారు. పోలవరంలో భాగమైన పట్టిసీమకు భూములిచ్చిన రైతులకు రూ.19 లక్షలిచ్చారు. పశ్చిమ గోదావరిలో రూ. 10.50 లక్షలు ఇచ్చిన ప్రభుత్వమే తూర్పు గోదావరిలో రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తోంది. ఒకే ప్రాజెక్టు కింద ఒక్కో చోట ఒక్కో రకమైన పరిహారం ఇవ్వడం ఎక్కడైనా ఉందా? పట్టిసీమలో ఇచ్చినట్లే ప్రతి రైతుకూ అదే రూ.19 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ప్రాజెక్టు రావాలన్న తపనతో 2007-2009 సమయంలో మొదట భూములిచ్చిన రైతులకు అప్పట్లో కేవలం రూ.1.5 లక్షలిచ్చారు. ఆ మొత్తంతో ఇప్పుడు పదిసెంట్ల భూమి కూడా రాదు, అందుకే వారి త్యాగాన్ని గుర్తించి ఎకరాకు కనీసం మరో రూ.ఐదారు లక్షలైనా ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా. అలాగే నోటిఫికేషన్ ఇచ్చేనాటికి 18 సంవత్సరాలు నిండిన వారికే ప్యాకేజీ ఇస్తామనడం సరికాదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పటికీ ఇవ్వనందున... ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా పరిహారమివ్వాల్సిందే. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొండపోడు భూములను సాగు చేసుకునేందుకు పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూములను కూడా లాగేసుకుని పరిహారం ఇవ్వబోమనడం అన్యాయం. రైతులకు ఏ పరిహారమైతే ఇస్తున్నారో డి-ఫామ్ పట్టాలున్న రైతులకు కూడా అదే పరిహారం ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా. స్వచ్ఛభారత్‌కు అంబాసిడర్లా బాబు ప్రగల్భాలు రాష్ట్రంలో ఎక్కడా బహిరంగ మల, మూత్ర విసర్జన లేనేలేదని, అంత గొప్పగా మరుగుదొడ్లు కట్టించానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ నిన్న రంపచోడవరంలో గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాల పిలిస్తే అక్కడకు వెళ్లా. దాదాపు 750 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్లు చెబుతున్న కష్టాలు వింటుంటే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అర్హుడా? అనిపించింది. పిల్లలకు మరుగుదొడ్లు లేక చెంబు పట్టుకొని కొండెక్కాల్సి వస్తుంది. పడుకోవడానికి మంచాలు లేవు. వర్షం పడితే నీరు కారుతోంది. శ్లాబులు పడుతున్నారుు. ఇదే మం డలంలోని చింతూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇదే దుస్థితి. కానీ చంద్రబాబేమో స్వచ్ఛ భారత్‌కు తానే అంబాసి డార్లా చెప్పుకుంటున్నారు. రెండేళ్లుగా జీతాలు రావడంలేదని లెక్చరర్లు మొత్తుకుంటున్నా పట్టించుకునేవారు లేరు. వైద్యులు లేరు.. మందులు లేవు.. మన్యం ప్రాంతంలో ఒక్క ఆస్పత్రిలోనూ మందులు లేవు.. ఇక వైద్యమెలా చేస్తారు? మారేడుమల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడ్రోజులుగా ఒక్క వైద్యుడూ లేరు. నేను వెళ్లేటప్పటికి ఒక డాక్టర్ పరుగెత్తుకుంటూ వచ్చారు. ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఇద్దరమే ఉన్నామని చెప్పారు. గైనిక్, పీజీ డాక్టర్ లేరని తెలిపారు. విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో నాలుగు నెలల్లోనే దాదాపుగా 14 మంది చనిపోయారు. కానీ ఇవాల్టికీ వారెందుకు చనిపోయారో కారణం తెలీదు. రాజవొమ్మంగి మండలంలో రెండు నెలల్లో 15 మంది నెల, రెండు నెలల పిల్లలు చనిపోయారు. అంగన్వాడీ కేంద్రాల్లో తగినంత పౌష్టికాహారం పెట్టకపోవడంతో... పౌష్టికాహారం, రక్తహీనతతో మరణించారని చెబుతున్నారు. వైఎస్ హయాంలో కేవలం 20 నిమిషాల్లో వచ్చే 108 వాహనాలు ఇప్పుడు కదలడంలేదు. ఐటీడీఏ పరిధిలో పది వాహనాలుండగా పనిచేస్తున్నది కేవలం మూడు. ఇదీ చంద్రబాబు పాలన. కానీ ఆయన ఇవ్వాళ పొద్దున్నే టీవీలో కనిపించి దేశంలోనే జీడీపీలో నాలుగో స్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. తానేం అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మేస్తారని ఆయన నమ్మకం. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ఈయనా ముఖ్యమంత్రేనా? జబ్బేంటో తెలియకుండానే చచ్చిపోయారు చింతూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాళ్ల వాపులు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్లాం. వైద్యం చేసిన డాక్టర్లు ఇంటికి తీసుకుపొమ్మన్నారు. తీరా ఇంటికొచ్చిన కొద్ది రోజులకే చచ్చిపోయారు. మా వాళ్లు చచ్చిపోరుు రోజులు గడిచినా జబ్బేంటో తెలీదు. ప్రభుత్వం కనీసం మా కుటుంబాలను పరామర్శించి, ఆదుకోలేదు..’’ అంటూ తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతంలో కాళ్ల వాపుతో మృతి చెందిన వారి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బోరుమన్నారుు. గత రెండు నెలల కాలంలో తూర్పు మన్యంలో అంతుచిక్కని వ్యాధి సోకి కాళ్ల వాపుతో 14 మంది చనిపోయారు. బుధవారం జిల్లాకు వచ్చిన జగన్ గురువారం కూడా మన్యప్రాంతంలో పర్యటించారు. చింతూరులో ఐదుగురు, వీఆర్‌పురంలో ఎనిమిది మంది, కూనవరంలో ఒకరు కాళ్ల వాపు వ్యాధితో మృతి చెందడంపై ఆరా తీశారు. చింతూరు మండలం మావిళ్లగూడెంలో మృతి చెందిన ముచ్చిక లక్ష్మయ్య, ముచ్చిక సీతారామయ్యల కుటుంబాలను నర్శింహాపురంలో పరామర్శించారు. ‘ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా? ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నారు? మంత్రులు గానీ అధికారులు గానీ వచ్చి అడిగారా?’ అని అడిగి తెలుసుకున్నారు. అసలు తమ భర్తలు ఎలా చచ్చిపోయారో తమకు తెలియదని లక్ష్మయ్య భార్య దూలమ్మ, సీతారామయ్య భార్య కమలమ్మ విలపించారు. మమ్మల్నెవరూ పట్టించుకోలేదు, ఏ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జబ్బుతో చనిపోయారో కూడా తెలియని దారుణమైన పాలనలో మనం ఉన్నామని, జనం చచ్చిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జగన్ మండిపడ్డారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. -
చిన్న పార్టీలకు మమత స్నేహ హస్తం