
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
చెన్నారావుపేట(నర్సంపేట) : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని బాపునగర్ గ్రామానికి చెందిన భాస్కర్, రాజేందర్, రాజు, హరిలాల్, మొగిలితో పాటు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటలు చెప్పడం కంటే చేసి మాట్లాడటమే తన తత్వం అన్నారు. ప్రజల కోసమే పనిచేస్తున్నానని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని చెప్పారు. ఎంపీపీ జక్క అశోక్, జెడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, మాజీ సర్పంచ్ రాంచంద్రు, లింగం, రవి, మంగీలాల్, హతిరాం, బాలు, హనుమ, నవీన్, రవి, శ్రీను గోపాల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment