joining in party
-
జూపల్లి కృష్ణరావును బీజేపీలోకి ఆహ్వానించా : డీకే అరుణ
-
Sakshi Cartoon: సారీ! ఇంత క్రిటికల్ కేసు డీల్ చేయడం నావల్ల కాదు
-
వైఎస్సార్ సీపీలో చేరిన బుర్రా అనుబాబు
-
వైఎస్సార్ సీపీలో చేరిన విద్యావేత్త
సాక్షి, జగ్గంపేట(తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేతకు తోడుగా ప్రజలు విశేషంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. రాజన్న తనయుడి పాదయాత్రలో భాగంగా పార్టీలోకి వలుసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ప్రముఖ విద్యావేత్త బుర్రా అనుబాబు సోమవారం జననేత సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అనుబాబుతోపాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు భారీ ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరారు. -
69 మంది టీఆర్ఎస్ నాయకులు..కాంగ్రెస్‌లోకి..చేరిక
మూసాపేట : మండలంలోని జానంపేట సర్పంచ్ పొన్నకంటి చెన్నమ్మ, ఆమె భర్త వెంకటయ్య శుక్రవారం తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. ఇద్దరు వార్డు సభ్యులతో సహా అచ్చాయపల్లి, తాళ్లగడ్ద, జానంపేటకు చెందిన 69 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి డీకే అరుణ స్వగృహానికి వెళ్ళి దేవరకద్ర నియోజక వర్గ ఇంచార్జి పవన్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తమపై చిన్న చూపు చూస్తూ, తన అనుచర వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని, అందుకే తెలంగాణ ఇచ్చిన జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో చేరానన్నారు. కార్యక్రమంలో సురేందర్‌రెడ్డి, బాల నర్సింహులు,నాగిరెడ్డి, శెట్టిశేఖర్, గోవర్దన్, రాంకుమార్, సమరసింహారెడ్డి. తాజూద్దీన్, జమీర్, రాజెందర్‌రెడ్డి, నర్సింహా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం అడ్డాకుల : టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లినందున రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రానుందని ఆపార్టీ మండల అధ్యక్షుడు, కందూర్ సర్పంచ్ కారెడ్డి నాగిరెడ్డి పేర్కొన్నారు. కందూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నాగిరెడ్డి తెలిపారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
చెన్నారావుపేట(నర్సంపేట) : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని బాపునగర్ గ్రామానికి చెందిన భాస్కర్, రాజేందర్, రాజు, హరిలాల్, మొగిలితో పాటు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటలు చెప్పడం కంటే చేసి మాట్లాడటమే తన తత్వం అన్నారు. ప్రజల కోసమే పనిచేస్తున్నానని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని చెప్పారు. ఎంపీపీ జక్క అశోక్, జెడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, మాజీ సర్పంచ్ రాంచంద్రు, లింగం, రవి, మంగీలాల్, హతిరాం, బాలు, హనుమ, నవీన్, రవి, శ్రీను గోపాల్ ఉన్నారు. -
'ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేను'
హైదరాబాద్: తాను ఏ రాజకీయ పార్టీలో చేరేదీ ఇప్పుడే చెప్పలేనని అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. నగరంలోని తాజ్‌కృష్ణా హోటల్లో ఏర్పాటైన 'లావిష్ డిజైనర్ ఎక్స్పో'ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోడ్రన్ దుస్తులు కూడా ధరిస్తున్నా.. చీరలోనే తను మరింత అందంగా, ప్రత్యేకంగా కనపడతానని అందరూ ప్రశంసిస్తుంటారని అన్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు పలు భాషల్లో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. ఇప్పుటికిప్పుడే ఏ పార్టీలో చేరేదీ చెప్పలేనని.. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కూడా హాజరయ్యారు.