
సాక్షి, జగ్గంపేట(తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేతకు తోడుగా ప్రజలు విశేషంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. రాజన్న తనయుడి పాదయాత్రలో భాగంగా పార్టీలోకి వలుసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ప్రముఖ విద్యావేత్త బుర్రా అనుబాబు సోమవారం జననేత సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అనుబాబుతోపాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు భారీ ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరారు.