సాక్షి, తుని: అలుపెరుగని మోముతో ప్రజల సమస్యలు తెలసుకుంటూ, వారికి భరోసా ఇవ్వడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. తమ కోసం.. తమ ప్రాంతానికి వచ్చిన రాజన్న బిడ్డకు స్థానిక ప్రజలు పూలతో స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. సోమవారం పలుసార్లు వర్షం అంతరాయం కలిగించినా మొక్కవోని దీక్షతో జననేత ముందుకు కదిలారు. జోరువానలోనూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. ప్రజలు కూగా వర్షాన్ని లెక్కచేయకుండా జననేత వెంట అడుగులు వేశారు.
స్కాలర్‌షిప్‌లు రావడంలేదు
నేటి ప్రజాసంకల్పయాత్రలో డి.పోలవరం పాఠశాల విద్యార్థులు జననేతను కలిసి వారి సమస్యలు విన్నవించుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉందని, స్కాలర్‌షిప్‌లు రావడంలేదని రాజన్న బిడ్డకు చెప్పుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా వారి సమస్యలు వివరించారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. జననేత ఇచ్చిన హామీలతో భవిష్యత్‌పై కొండంత ధైర్యం వచ్చిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment