'ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేను' | i can not say which party i will join right now, says jayaprada | Sakshi
Sakshi News home page

'ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేను'

Published Mon, Feb 1 2016 9:04 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

'ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేను' - Sakshi

'ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేను'

హైదరాబాద్: తాను ఏ రాజకీయ పార్టీలో చేరేదీ ఇప్పుడే చెప్పలేనని అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. నగరంలోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ఏర్పాటైన 'లావిష్ డిజైనర్ ఎక్స్‌పో'ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోడ్రన్ దుస్తులు కూడా ధరిస్తున్నా.. చీరలోనే తను మరింత అందంగా, ప్రత్యేకంగా కనపడతానని అందరూ ప్రశంసిస్తుంటారని అన్నారు.

ప్రస్తుతం తెలుగుతో పాటు పలు భాషల్లో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. ఇప్పుటికిప్పుడే ఏ పార్టీలో చేరేదీ చెప్పలేనని.. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కూడా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement