
పోస్టర్ విడుదల చేస్తున్న సీపీఎం నాయకులు
కొత్తపల్లె : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికలలో పతనం తప్పదని సీపీఎం మండల కార్యదర్శి స్వాములు, సంజీవరాయుడు హెచ్చరించారు. మంగళవారం కొత్తపల్లెలో అఖిలభారత 22వ మహాసభల పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ పట్టణంలో జరిగే అఖిలభారత 22వ మహాసభలను విజయవంతం చేసేందుకు మండలంలోని సీపీఎం కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
5 రోజులపాటు సాగే ఈ మహాసభలలో ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాన్, దాసు, యేసన్న, స్వామిదాసు, వెంకటరమణ, యేసుకుమార్, దేవకుమార్, శేషన్న తదితరులు పాల్గొన్నారు.