ప్రధానికి బదులు.. పోర్న్ స్టార్‌కు ఆహ్వానం!
ప్రధానికి బదులు.. పోర్న్ స్టార్‌కు ఆహ్వానం!
Published Fri, Jan 27 2017 6:25 PM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM
కొత్త అధ్యక్షుడి పాలనలోకి వచ్చిన శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం చేసింది. త్వరలోనే తమ దేశంలో పర్యటించబోతున్న బ్రిటిష్ ప్రధాని థెరెసా మే పేరుకు బదులు ఒక పోర్న్ స్టార్ పేరును అధికారిక షెడ్యూలులో ప్రచురించింది. అది కూడా ఒకసారి కాదు.. ఏకంగా మూడుసార్లు ఆ పేరును మార్చేసింది. డోనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న అధికారుల్లో ఒకరు ఆ షెడ్యూలుకు సంబంధించిన పత్రంలో థెరెసా మే పేరు రాసేటపుడు అందులోని 'హెచ్' అనే అక్షరాన్ని వదిలేశారు. దాంతో అది కాస్తా టెరెసా మే అయిపోయింది. అదే పేరుతో ఒక పోర్న్ స్టార్ ఉన్నారు. వాసత్వానికి థెరెసా మే తన అధికారిక పర్యటనలో భాగంగా ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడంతో పాటు సంయుక్త విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది.
వైట్ హౌస్ నుంచి ప్రతిరోజూ వచ్చే కార్యక్రమాల వివరాలలో భాగంగా ప్రెస్ సెక్రటరీ ఈ పర్యటన వివరాలను కూడా వెల్లడించారు. అందులో థెరెసా మే పేరులోని హెచ్ అక్షరాన్ని వదిలేయడంతో ఘోరమైన తప్పు జరిగిపోయింది. అది కూడా మూడుసార్లు జరిగింది. టెరెసా మే గతంలో మోడల్‌గా పనిచేసి, ప్రస్తుతం పోర్న్ సినిమా స్టార్‌గా ఉన్నారు. గత వేసవి కాలంలో బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత నాటి ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా చేయడంతో బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి ఎవరు అవుతారన్న చర్చ జరిగినప్పుడు కూడా థెరెసా మే తోపాటు టెరెసా మే పేరు కూడా ట్విట్టర్‌లో మార్మోగిపోయింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో పర్యటిస్తున్న మొట్టమొదటి విదేశీ నేత థెరెసా మే.
Advertisement
Advertisement