ఈవ్ టీజర్లకు సింహస్వప్నం | she teams compleate one year special story | Sakshi
Sakshi News home page

ఈవ్ టీజర్లకు సింహస్వప్నం

Published Tue, Dec 15 2015 3:15 AM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

ఈవ్ టీజర్లకు సింహస్వప్నం - Sakshi

ఈవ్ టీజర్లకు సింహస్వప్నం

- వారిలో మార్పు తీసుకొస్తున్న పోలీసులు
-  సైబరాబాద్‌లో ఏడాది పూర్తి చేసుకున్న ‘షీ టీమ్స్’
     ఏడాది గణాంకాలివి...
 - దొరికిన ఈవ్‌టీజర్లు , మైనర్లు 118
-  మేజర్లు 707 (50 నుంచి 60 ఏళ్ల మధ్యవారు 16, 60పైబడినవారు 4)
-  మొత్తం 660 కేసులు, పెట్టీ కేసులు..550, ఎఫ్‌ఐఆర్ కేసులు...110
     ఇలా ఫిర్యాదు చేయొచ్చు...
-   డయల్ 100, ఫేస్‌బుక్ షీటీమ్ సైబరాబాద్, వాట్సాప్ 9490617444  

 
 సాక్షి, హైదరాబాద్: ‘షీ టీమ్స్’... మిహ ళలకు రక్షణ కవచం... ఈవ్ టీజర్లకు సింహస్వప్నం.. వారి భరతం పట్టే  సైన్యం. ఈవ్ టీజింగ్‌కు గురైన వారు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ఒకప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. కుటుం బం పరువుపోతుందేమోనని కొందరు, ఠాణా చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని మరికొందరు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేసేవారు. మహిళల రక్షణ కోసం గతేడాది ప్రారంభించిన షీ-టీమ్స్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షీ టీమ్స్ నీడలా తమను వెంటాడుతుండటంతో పోకిరీలు మహిళలను టీజింగ్ చేసేందుకు భయపడుతున్నారు. బాధితులకు షీమ్స్ అండగా ఉండటంతో ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు.

మరోవైపు తమకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వారికి షీటీమ్స్ వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ చేసి మళ్లీ అలాంటి ఉదంతానికి పాల్పడకుండా వారిలో మార్పు తీసుకొస్తోంది.  ఆదివారంతో ఏడాది పూర్తి చేసుకున్న సైబరాబాద్ షీ టీమ్స్‌కు ప్రజలు హ్యాట్సాఫ్ అంటున్నారు. షీ టీమ్ పట్టుకున్న ఆకతాయిలకు ఇచ్చే కౌన్సెలింగ్‌ను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యక్షంగా మీడియాకు చూపించారు.

 గతేడాది శ్రీకారం...
 ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ షీ టీమ్స్‌కు గతేడాది శ్రీకారం చుట్టారు. కార్యాలయాలు, కళాశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాప్‌లుతో పాటు బహిరంగప్రదేశాల్లో మహిళలను, విద్యార్థులను వేధించే వారి భరతం పట్టేందుకు షీ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. తమిళనాడులో ఉన్న ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్, ఏపీ యాంటీ ర్యాగింగ్  మార్గదర్శకాలను అనుసరించి నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఏడాదిళక్ష 660 కేసులు నమోదు చేశారు.

 మఫ్టీలో పట్టేస్తారు...
 ఈవ్‌టీజర్లను పట్టుకోవడంతో పాటు వ్యవహరించాల్సిన తీరుపై షీ టీమ్ సభ్యులు ప్రత్యేక తర్ఫీదు నిచ్చారు.  వీరు బస్‌స్టాపులు, బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లలో అమ్మాయిలను వేధిస్తున్న వారిని కనిపెడతారు. రహస్య కెమెరాలతో ఆకతాయిల ఆగడాలను షూట్ చేసి పట్టేస్తారు. దాదాపు 60 టీమ్‌లు బహిరంగ ప్రదేశాల్లో పని చేస్తున్నాయి.

 ఈవ్‌టీజింగ్ వ్యతిరేక కమిటీలు...
 ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో షీటీమ్ సభ్యులు ఈవ్‌టీజింగ్ వ్యతిరేక ప్రచారం చేపట్టారు. ఇందువల్ల తలెత్తే పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.  ప్రతి కళాశాలలో ఈవ్‌టీజింగ్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటివరకు ఈవ్‌టీజింగ్ వ్యతిరేకంగా 496 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

 హాట్‌స్పాట్‌లపై దృష్టి
 మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, మాదాపూర్, ఐటీ కారిడార్, బాలానగర్, శంషాబాద్ జోన్‌లో 400కు పైగా ఉన్న హాట్‌స్పాట్స్ (ఆకతాయిల వేధింపులపై ఎక్కువ ఫిర్యాదు వచ్చే ప్రాంతాలు)పై  షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. అక్కడ పోలీసులు ఉదయం సాయంత్రం వేళల్లో పెట్రోలింగ్ పెంచారు. మరో పక్క ఫోన్‌లో వేధింపులకు గురవుతున్న మహిళలు పోలీసుల భరోసాతో నేరుగా ఠాణాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.  

 ‘ఈయర్’తో ఈవ్‌టీజర్లలో మార్పు...
 ఈయర్ (ఎగ్జామిన్, అక్సెప్ట్, రిజెక్ట్) పద్ధతితో ఈవ్‌టీజర్ల పరివర్తనలో మార్పు తీసుకొస్తున్నారు.  షీ టీమ్ సభ్యులు, కౌన్సెలర్లు (మానసిక నిపుణులు) ఈవ్‌టీజర్ల వ్యక్తిత్వాన్ని తెలుసుకునేందుకు వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పాటు స్నేహితులకు సంబంధించిన విషయాలపై ప్రశ్నావళి ఇచ్చి పూర్తి చేయమంటారు. దీని ఆధారంగానే అతడిని ఎగ్జామిన్ చేస్తున్నారు కౌన్సెలర్లు. అతడు ఈవ్ టీజింగ్ చేశానని ఒప్పుకోకపోతే షీ టీమ్ బృందాలు షూట్ చేసిన వీడియో ను వారి తల్లిదండ్రుల సమక్షంలోనే చూ పిస్తున్నారు.

  ఆ దృశ్యాలను చూసిన త ర్వాత సారీ సార్   తప్పైపోయిందని నిం దితుడు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. మరోమారు ఈవ్‌టీజింగ్  చేయమని వారితో పోలీసులు   ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. దీంతో ఆకతాయిల్లో మా ర్పు వస్తోందని అధికారులు భావిస్తు న్నారు.
 
 ఆకతాయిలు భయపడుతున్నారు
 విద్యార్థినులు, యువతులు, మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టడంలో మా కృషి ఫలించింది.  ఏడాదిలో మేం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించినా...కొంతమాత్రమే సాధించామని అనుకుంటున్నాం. అమ్మాయిల్ని వేధిస్తే పోలీసులు పట్టుకుంటారన్న భయాన్ని పోకిరీల్లో కలిగించాం. బాధిత మహిళలు 100కు డయల్ చేయాలి. సైబరాబాద్‌లో మహిళలకు ఎక్కడా, ఎలాంటి వేధింపులు లేకుండా చేయాలన్నదే మా తదుపరి లక్ష్యం’.    - సీవీ ఆనంద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement