సాగర్‌లో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ప్రారంభం
నాగార్జునసాగర్
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన నాగార్జునసాగర్‌లో శనివారం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాన్ని సీటీఓ మస్తాన్‌వలి ప్రారంభించారు. ముందుగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఇకపై రాష్ట్రంలోకి ప్రవేశించే,సరిహద్దు దాటి బయటకు వెళ్లే సరుకుల లారీలనుంచి పన్ను వసూలు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో డీసీటీఓ విజయసాగర్‌బాబు,ఏసీటీఓ లింగయ్య, రవీందర్‌బాబు, సైదులు పాల్గొన్నారు.