బంద్‌కు వ్యాపార వర్గాల మద్దతు
బంద్‌కు వ్యాపార వర్గాల మద్దతు
Published Mon, Aug 1 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
నెహ్రూనగర్ : ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీలకతీతంగా మంగళవారం నిర్వహించే బంద్‌కు వ్యాపార వర్గాలు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. బంద్‌కు మద్దతు తెలుపుతూ సోమవారం అన్ని వ్యాపార వర్గాల ఆసోసియేషన్ నాయకులతో జిన్నాటవర్ సెంటర్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు నోరు మెదపకపోవడం సబబు కాదన్నారు. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ షారాబు క్రిష్ణమూర్తి, కార్యదర్శి జి.రాంబాబు, వాసవి క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అడ్డగిరి సాంబశివరావు, కానూళ్ళ ప్రవీణ్‌కుమార్ కిరణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పువ్వాడ నాగ వెంకటనారాయణ, నగర రైస్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement