బంద్‌కు మద్దతు తెలపండి | asking support to bandh | Sakshi
Sakshi News home page

బంద్‌కు మద్దతు తెలపండి

Published Sun, Jul 31 2016 8:31 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

asking support to bandh

గుంటూరు: రాష్ట్ర ప్రయోజనాలకోసం  ఈ నెల 2వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ చేపట్టనున్న బంద్‌కు మద్దతు తెలపాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్‌పార్టీ నేతలను కోరారు.

రాజీవ్‌గాంధీ భవన్‌లో శుక్రవారం కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు ముత్యాలరావును కలిశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జెండాలు పక్కన బెట్టి ప్రత్యేక హోదానే ఎజెండాగా అన్ని పార్టీలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తామని కాంగ్రెస్‌పార్టీ నేతలు చెప్పారు. అనంతరం సీపీఐ, సీపీఎం జిల్లా నాయకత్వంతో వైఎస్సార్‌సీపీ నేతలు చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement