బంద్‌కు బాబు మద్దతు ఇవ్వాలి
బంద్‌కు బాబు మద్దతు ఇవ్వాలి
Published Mon, Aug 1 2016 9:47 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్
గుంటూరు వెస్ట్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు రాష్ట్ర బంద్‌కు మద్దతు ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తేల్చి చెప్పిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించి హోదాను సాధించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఖరి ఇందుకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఒకపక్క ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అన్యాయం అంటూనే బంద్ అవసరం లేదని, ఉద్యమాలు చేయవద్దని, అఖిల పక్ష సమావేశాలు సైతం అనవసరమని చంద్రబాబు ప్రకటించడం అవకాశవాదం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. ఈనెల 2వ తేదీన జరిగే బంద్‌లో పెద్దఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మధు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement