ప్రపంచంలోనే తొలి కమర్షియల్‌ స్పేస్‌ స్టేషన్‌..అచ్చం లగ్జరీయస్‌ హోటల్‌..! | The World's First Commercial Space Station | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలి కమర్షియల్‌ స్పేస్‌ స్టేషన్‌..అచ్చం లగ్జరీయస్‌ హోటల్‌..!

Published Sun, Oct 13 2024 1:28 PM | Last Updated on Sun, Oct 13 2024 2:08 PM

The World's First Commercial Space Station

మాములుగా అంతరిక్ష కేంద్రాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అవి వారి పరిశోధనకు అనుగుణంగా ఉంటాయి. అలా కాకుండా భూమ్మీద ఉండే అత్యంత విలాసవంతమైన హోటల్‌ మాదిరిగా ఉంటే..ఆ ఊహా అబ్బా అనిపిస్తోంది కదూ. అలాంటి ఆలోచనకే అంకురార్పణ చేసింది అమెరికా కొత్త స్టార్టప్‌ స్పేస్‌ టెక్‌ కంపెనీ వాస్ట్‌. 

ఈ కంపెనీ స్పేస్‌ ట్రావెల్‌ కొత్త శకానికి నాంది పలికింది. సాంప్రదాయ అంతరిక్ష కేంద్రాలకు స్వస్తి చెప్పి అత్యంత ఆధునాత లగ్జరియస్‌ హోటల్‌లా తీర్చిదిద్దనుంది. ఆగస్ట్‌ 2025లో ప్రయోగించనున్న స్పేస్‌ ఎక్స్‌ పాల్కన్‌ 9 రాకెట్‌లో హెవెన్‌ -1 అనే పేరుతో దీన్ని ఆవిష్కరించనుంది. అద్భుతమైన ఇంటీరియర్‌ డిజైన్‌తో వ్యోమగాములకు రిసార్ట్‌ లాంటి వాతావరణాన్ని అందించనుంది. పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ హెవెన్‌-1ని చెక్కతో అందంగా తీర్చిదిద్దిన ద్వారాలు, తెల్లటి గోడలు, హై ఎండ్‌ హోటల్‌కు సరిపోయే సౌకర్యాలతో అత్యంత ఆధునాతనంగా తీర్చిదిద్దారు.

అంతేగాదు ఇందులో అత్యాధునిక జిమ్‌ కూడా ఉంటుందట. సందర్శకులు సున్నా గురుత్వాకర్షణలో చూసేలా వీలు కల్పిస్తోంది. ఇది అచ్చం భూమిపై ఉన్న హోటల్‌ మాదిరి అనుభూతిని అందిస్తుంది. అంతేగాదు ఈ హేవెన్‌ 1కి సంబంధించిన తుది డిజైన్‌ను స్పేస్‌ కంపెనీ వెస్ట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీన్ని పీటర్‌ రస్సెల్‌ క్లార్ట్‌, వ్యోమగామి ఆండ్రూ ఫ్యూస్టెల్‌  రూపొందిస్తున్నారు. ఇందులో వ్యోమగాములు హాయిగా గదుల్లో ఉండేలా సౌకర్యం ఉటుంది. 

అలాగే మెరుగైన నిద్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెడ్‌ వంటివి కూడా ఉంటాయి. అంతేగాదు గుండె, ఎముకల ఆరోగ్యం కోసం ఆన్‌బోర్డ్‌ ఫిట్‌నెస్‌ సిస్టమ్ వంటి ఆధునాత సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ రాకెట్‌ను 2025లో ప్రారంభించనుండగా, అందులోని ఈ హెవెన్‌1 చెల్లింపు కస్టమర్లు మాత్రం 2026 నుంచి మొదలవుతారని వెల్లడించారు పరిశోధకులు. చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే తొలి కమర్షియల్‌ స్పేస్‌ స్టేషన్‌. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. 

(చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్‌ డాటర్స్‌..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement