
సాక్షి, హైదరాబాద్: నివాస భవనాలకు ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) నిబంధన అమల్లోకి వచ్చింది. గతేడాది జూన్‌లో వాణిజ్య భవనాలకు ఈసీబీసీ కోడ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నివాస విభాగంలో ఈసీబీసీ కోడ్‌తో 2030 నాటికి 125 బిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేసింది. నివాస, వాణిజ్య భవనాలు రెండు విభాగాల్లో కలిపి 2030 నాటికి సుమారు 1,000 బిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి ఆదా అవుతుంది.