Residential buildings
-
‘ఈవీ’ ఇళ్లు..!
సాక్షి, హైదరాబాద్: ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ (రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సరీ్వస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిరీ్ణత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్ఎల్ ఇండియా స్ట్రాటర్జిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యువేషన్ అడ్వైజరీ హెడ్ ఏ శంకర్ తెలిపారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు. ఆఫీస్ స్పేస్‌లలో కూడా.. ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సరీ్వస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవటమే అసలైన సవాలు. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేటర్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సరీ్వస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
భవనంలో మంటలు.. ఏడుగురు మృతి
ముంబై: ముంబైలోని ఓ నివాస భవనంలో శుక్రవారం వేకువజామున చెలరేగిన మంటల్లో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. మరో 68 మంది గాయపడ్డారు. గోరెగావ్ వెస్ట్‌లోని ఏడంతస్తుల నివాస భవనంలో తెల్లవారు జామున 3 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకుని ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి అగ్ని కీలలు భవనాన్నంతటినీ చుట్టుముట్టాయి. పార్కింగ్ ప్లేస్‌లోని దుకాణాలు, ద్విచక్ర వాహనాలతోపాటు, భారీగా నిల్వ ఉంచిన పాత దుస్తులు తగులబడిపోయాయి. వివిధ అంతస్తులతోపాటు టెర్రస్‌పై చిక్కుకున్న సుమారు 30 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల్లో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఊపిరాడకనే చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 68 మందిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
దుబాయ్‌లో బుగాట్టి అదరిపోయే రెసిడెన్షియల్ టవర్స్
-
బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేయ నుంది. దుబాయ్‌లో 42-అంతస్తుల ఆకాశహర్మ్యం విశేషాలు, విలాసవంతమైన సౌకర్యాలను తాజాగా ఆవిష్కరించింది. ఇటీవల ప్రకటించిన రెసిడెన్షియల్ తన ప్రారంభ వెంచర్‌కు సంబంధించిన ప్రణాళికలను వెల్లడించింది. కనీవినీఎరుగని ఫీచర్లు, సౌకర్యాలతో వీటిని తీర్చిదిద్దుతున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్ దుబాయ్ ఆధారిత రియల్ ఎస్టేట్ డెవలపర్ బింఘట్టి భాగస్వామ్యంతో, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి కొత్త అర్థంతో ఫ్రెంచ్ "ఆర్ట్ డి వివ్రే"ని అందించడం లక్ష్యంగా ఈ రెసిడెన్షియల్ టవర్స్‌ను రూపొందించి నట్టు అధికారిక ఇన్‌స్టాలో వెల్లడించింది. రిసార్ట్‌లో ఉన్న ఫీలింగ్ కలిగేలా బెస్పోక్ లేఅవుట్‌తో ప్రత్యేకంగా రూపొందించింది. ప్రతీ హౌస్‌లో.. హై-ఎండ్ ఫినిషింగ్స్, అధునాతన సౌకర్యాలతో నభూతో నభిష్యతి అన్నట్టు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) రూఫ్‌టాప్ పూల్ ,కార్ లిప్ట్ ఫ్లోర్-టు-సీలింగ్ విండోలు, అందమైన పెద్ద బాల్కనీల ద్వారా దుబాయ్ స్కైలైన్ భవనాలను వీక్షించ వచ్చు. ప్రైవేట్ పూల్, జాకుజీ స్పా, ఫిట్నెస్ క్లబ్, చెఫ్ టేబుల్, ప్రైవేట్ వాలెట్, ప్రైవేట్ మెంబర్స్ క్లబ్, రెండు గ్యారేజ్-టు-పెంట్‌హౌస్ కార్ లిఫ్ట్‌లు వంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయని తెలిపింది. అంతేనా సన్‌బాత్ కోసం ఎయిర్ బీచ్ కూడా ఉందనీ, మాన్‌హట్టన్ ఆఫ్ దుబాయ్‌గా కాస్మోపాలిటైన్ ప్రాంతం నడిబొడ్డున ఉందని కంపెనీ పేర్కొంది. కాగా దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ టవర్స్‌లో ప్రతి అపార్ట్మెంట్ ఒక విలక్షణమైన లేఅవుట్‌తో రూపొందిస్తోంది. బుగట్టి బ్రాండ్‌కి పర్యాయపదంగా ఉండేలా రివేరా మాన్షన్స్ పేరుతో 171 అపార్ట్మెంట్లు , 11 విలాసవంతమైన స్కై మాన్షన్ పెంట్‌హౌస్‌లు ఉంటాయి . View this post on Instagram A post shared by BUGATTI Newsroom (@bugatti_newsroom) -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు: 22 మంది దుర్మరణం
కీవ్: రష్యా దాడుల్లో శుక్రవారం 22 మంది ఉక్రేనియన్లు దుర్మరణం పాలయ్యారు. ఉమాన్‌లో 9 అంతస్తుల నివాస భవనంపై క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులతో పాటు 20 మంది చనిపోయారు. ఇప్పటిదాకా యుద్ధ చాయలు కనిపించని ఈ నగరంపై రష్యా తొలిసారి లాంగ్రేంజ్ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు 2 నెలల తర్వాత రాజధాని కీవ్‌లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన 21 క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. నీప్రో నగరంలోని నివాస ప్రాంతాలపై రష్యా బలగాల దాడిలో రెండేళ్ల చిన్నారి, ఆమె తల్లి చనిపోగా మరో నలుగురు గాయపడినట్లు గవర్నర్ చెప్పారు. ఈ దాడులతో ఉద్దేశపూర్వకంగా బెదిరించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అంటుండగా తమ దీర్ఘ శ్రేణి క్షిపణులు లక్ష్యాలను ఛేదించినట్లు రష్యా చెబుతోంది. రష్యా ఆక్రమిత డొనెట్స్క్పై ఉక్రెయిన్ బలగాల రాకెట్ దాడిలో ఏడుగురు పౌరులు దుర్మరణం చెందినట్లు నగర మేయర్ చెప్పారు. -
రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి
ఓ నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా సుమారు 16 మంది మృతి చెందారు. దుబాయ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. దుబాయ్లోనిన దీరా బుర్జ్ మురార్ ప్రాంతంలో రెసిడెన్షియల్ భవనంలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భవనం నాల్గో అంతస్థులో మొదలైన మంటలు క్షణాల్లో ఇతర అపార్ట్మెంట్లకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో కేరళ, తమిళనాడుకి చెందిన వారు ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అల్ రాస్‌లో శనివారం మధ్యాహ్నాం 12.35 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని తరలింపు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. దాదాపు 10 మంది పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనలో బాధితులను గుర్తించడంలో సహకరించిన కేరళకు చెందిన సామాజిక కార్యకర్త నసీర్ వాటనపల్లి మాట్లాడుతూ.. భవనంలో కేరళకు చెందిన ఇద్దరు దంపతులు, తమిళనాడుకు చెందిన ఇద్దరు పురుషులు, పాకిస్తాన్ కజిన్స్, నైజీరియన్ మహిళతో సహా 16 మంది మృతి చెందినట్లు తెలిపారు. కాగా, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపి మృతదేహాలను భారత్‌కు పంపేందుకు సహకరిస్తామని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. (చదవండి: ఆశాకిరణం ఆఫ్రికా! నైజర్ మహిళ జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మ) -
రష్యా క్షిపణుల వాన
కీవ్: ఉక్రెయిన్‌పైకి గురువారం రష్యా మరోసారి క్షిపణుల వాన కురిపించింది. దీంతో ఉదయం నుంచి 7 గంటలపాటు దేశమంతటా ముందు జాగ్రత్తగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. దేశంలోని 10 ప్రాంతాల్లోని నివాస భవనాలపై రష్యా జరిపిన దాడుల్లో కనీసం ఆరుగురు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. గత మూడు వారాల్లో రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనన్నారు. ‘ఆక్రమణదారులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మాత్రమే వాళ్లు చేయగలరు’అని ఆయన ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
లారీలో ‘హోమ్’ డెలివరీ.. ఏమిటీ కంటైనర్ హోమ్?
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాత ఆరోగ్యకరమైన జీవితంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎక్కడా రిస్క్ తీసుకోవట్లేదు. సేంద్రియ ఆహార ఉత్పత్తులు తింటూ పచ్చని ప్రకృతి ఒడిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. కనీసం ఇంటి చుట్టూ నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. ఫలితంగా ఫామ్‌హౌస్‌లకు, ఫామ్ ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఫామ్‌హౌస్‌లు కొనుగోలు చేయలేనివారు ఫామ్ ప్లాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఫామ్ ప్లాట్లలో నివాస భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే కంటైనర్ హోమ్స్ (మాడ్యులర్ హోమ్స్)కు గిరాకీ పెరిగింది. ఇల్లులా ఏర్పాటు చేయడానికి అవసరమైనవన్నీ ఫ్యాక్టరీలో తయారు చేసి, లారీలో తీసికొచ్చి బిగించేస్తున్నారు. శామీర్‌పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్ వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో కంటైనర్ హోమ్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలలో ఈ తరహావి ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా చాలామంది ఫామ్ ప్లాట్లలో కంటైనర్ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి పచ్చని వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు. ఏమిటీ కంటైనర్ హోమ్? ►కంటైనర్ హోమ్స్‌ను గ్యాల్వనైజింగ్ స్టీల్ షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్ బోర్డ్ వేస్తారు. దానిపైన పాలీ వినైల్ ఫ్లోర్ (పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్ బోర్డ్ మీద టైల్స్ కూడా వేసుకోవచ్చు. ►ఇంటి బీమ్‌లు, ఫౌండేషన్ స్ట్రక్చర్లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్ పూత ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్ ప్యానల్స్లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ఫినిష్డ్ వ్యాల్యుమెట్రిక్ కన్స్ట్రక్షన్ (పీపీవీసీ)లతో రూపొందిస్తారు. ►తలుపులు, కిటికీలు ఇంపాక్ట్ రెసిస్టెంట్ గ్లాస్‌లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్ వుడ్ కాంపోజిట్, సిమెంట్ బోర్డ్‌లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్ ఇన్సులేషన్‌తో వాల్ ప్యానెల్ క్లాడింగ్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వేడి ఇంటి లోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల తక్కువ ఉష్ణోగత ఉంటుంది. ►నిర్మాణ సామగ్రి తయారీలో బహుళ జాతి కంపెనీలైన సెయింట్ గోబైన్, గైప్రోక్ల నైపుణ్య కార్మికులు ఈ కంటైనర్ హోమ్స్‌ను తయారు చేయడంలో సిద్ధహస్తులు. స్ట్రక్చరల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు. విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్ హోమ్స్ ధరలు ఉంటాయి. మన అభిరుచుల మేరకు హాల్, కిచెన్, బెడ్రూమ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏ వసతులనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు.. ఈ కంటైనర్ హోమ్స్‌కు స్ట్రక్చరల్ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. ఈ కంటైనర్ హోమ్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. వీటిని మెటల్‌తోనే తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తాయి. ఎక్కువ నష్టం ఉండదు. కరోనా టైంలో కట్టించా.. నా పేరు కిశోర్, డిజైనర్‌గా ఉద్యోగం చేస్తున్నా. కరోనా రెండో దశలో మా కుటుంబ సభ్యులకు వైరస్ వచ్చింది. ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జనావాసాలకు దూరంగా ఇల్లు ఉంటే బెటర్ అనిపించింది. దీంతో విశాఖపట్నంలోని కోడూరులో ఉన్న ఫామ్ప్లాట్లో రెడీమేడ్ ఇల్లు కట్టించుకోవాలనుకున్నా. తక్కువ ఖర్చుతో, త్వరగా పూర్తయ్యే ఇల్లయితే బాగుంటుందని పరిశోధన చేసిన తర్వాత 1,200 చ.అ. 2 బీహెచ్‌కే మాడ్యులర్ హోమ్ కట్టించుకున్నా. 4 నెలల్లో నిర్మాణం పూర్తయింది. రూ.20 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు కరోనా బెడద తొలగడంతో సొంతింటికి వచ్చేశాం. కానీ ప్రతి వీకెండ్‌కు అందరం అక్కడికి వెళ్లి పచ్చని వాతావరణంలో గడిపి వస్తున్నాం. హోటల్ రూమ్‌కు బదులు చిన్న ఇంట్లో.. నా పేరు చైతన్య. విజయవాడలో వ్యాపారిని. నాకు పటాన్‌చెరులోని ముత్తంగిలో 1,600 గజాల స్థలం ఉంది. పని మీద హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఒకట్రెండు రోజులో సిటీలో ఉండాల్సి వస్తుంది. లాడ్జిలో లేదా తెలిసిన వాళ్ల ఇళ్లల్లో ఉండే బదులు నా సొంత స్థలంలో చిన్నపాటి ఇల్లు కట్టించుకుంటే అయిపోతుంది కదా అనిపించింది. అలా 1,100 చ.అ మాడ్యులర్ హోమ్ కట్టించుకున్నా. చ.అ.కు రూ. 1,300 చొప్పున రూ.14.30 లక్షలు అయింది. ఇంటీరియర్, ఇతరత్రా వ్యయాలు కలిపి మొత్తం రూ.16 లక్షలు ఖర్చయింది. సిటీకి వచ్చినప్పుడల్లా ఇందులోనే ఉంటున్నా. స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారేమోనన్న భయం కూడా పోయింది. ఫామ్‌హౌస్‌లలో డిమాండ్ ఉంది కరోనా తర్వాతి నుంచి కంటైనర్ హోమ్స్‌కు డిమాండ్ ఏర్పడింది. చాలా మంది ఫామ్ ప్లాట్లను కొనుగోలు చేశారు. వాటిల్లో ఈ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫ్యామిలీకి అవసరమైన వసతులన్నీ ఈ కంటైనర్ హోమ్స్‌లో ఉంటుండటంతో వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నారు. – భరత్ తేజ్, ఎండీ, అర్బన్ శాస్త్ర స్మార్ట్ బిల్డ్ -
మాట తప్పిన రష్యా.. జనావాసాలపై క్షిపణి దాడి
ఉక్రెయిన్‌పై రష్యా బలగాల మిస్సైల్స్ దాడి కొనసాగుతోంది. ఉక్రెయన్ రాజధాని నగరంలో కీవ్‌లోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో సుమారు ఐదు ఫ్లోర్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అపార్ట్మెంట్ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపాయి. బాధితుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటి నుంచి ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలే తమ టార్గెట్ అంటూ చెప్పుకొస్తున్న రష్యా.. జనావాసాల మీద కూడా బాంబులతో విరుచుకుపడుతోంది. రాజధాని నగరం కీవ్‌లోని ఓ భారీ భవనంపై రష్యా సైన్యం క్షిపణి ప్రయోగించిందని కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో తెలిపారు. రాత్రి పూట రష్యా దళాలు.. దాడులకు దిగడంతో కీవ్‌లో భయనక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కీవ్‌లోకి ప్రవేశించడానికి రష్యా సైన్యం అన్ని దిశలను నుంచి దాడులు చేస్తూ వస్తోందన్నారు. దెబ్బతిన్న అపార్ట్మెంట్ ఫొటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విటర్లో పోస్ట్ చేశారు. శాంతియుతమైన కీవ్ నగరం.. రష్యా బలగాలు క్షిపణుల దాడులతో అట్టుడుకుతోందని అన్నారు. రష్యా ప్రయోగించిన మిస్సైల్ ఒకటి కీవ్‌లోని అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టిందని తెలిపారు. అంతర్జాతీయ సమాజం రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధించాలని ఆయన కోరారు. Kyiv, our splendid, peaceful city, survived another night under attacks by Russian ground forces, missiles. One of them has hit a residential apartment in Kyiv. I demand the world: fully isolate Russia, expel ambassadors, oil embargo, ruin its economy. Stop Russian war criminals! pic.twitter.com/c3ia46Ctjq — Dmytro Kuleba (@DmytroKuleba) February 26, 2022 WATCH: Video shows the moment a high-rise building in Kyiv is hit by a missile pic.twitter.com/adrd6LSfIL — BNO News (@BNONews) February 26, 2022 Russia attacks and kills civilians in Ukraine. Our army continues to defend our territory and every civilian. 🇺🇦 resists and strives for peace. The world must stop Russian war criminals.#StandWithUkraine! 📍Kyiv, Residential Area, building near Maternity Hospital and Schools. pic.twitter.com/JGNUQUGulX — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) February 26, 2022 -
ఇళ్ల ధరలు పెరిగిన ఏకైక నగరం ఏదో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇళ్ల ధరల పెరుగుదల విషయంలో 2020 అక్టోబరు-డిసెంబరు కాలంలో టాప్-150 గ్లోబల్ అర్బన్ సిటీస్ జాబితాలో భారతీయ నగరాలు వెనుకంజలో ఉన్నాయి.నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ క్యూ 4 2020’ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో గృహాల ధరలు 2020 లో సగటున 5.6శాతం పెరిగాయి. ఇది 2019 లో 3.2శాతం మాత్రమే. ముఖ్యంగా 2020 క్యూ 4 లో ఇళ్ల ధరలు పుంజుకున్న ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ కావడం విశేషం. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. జాబితాలో చోటు సంపాదించుకున్న ఎనిమిది భారతీయ నగరాల్లో హైదరాబాద్ మాత్రమే 0.2 శాతం వార్షిక వృద్ధి సాధించి 122 ర్యాంకును దక్కించుకుంది. 150వ ర్యాంకు సాధించిన చెన్నైలో గృహాల ధరలు 9 శాతం తగ్గాయి. బెంగళూరులో 0.8 శాతం, అహ్మదాబాద్ 3.1, ముంబై 3.2, ఢిల్లీ 3.9, కోల్‌కత 4.3, పుణేలో 5.3 శాతం తగ్గాయి. తొలి ర్యాంకు కైవసం చేసుకున్న టర్కీలోని అంకారాలో ఇళ్ల ధరలు 30.2 శాతం అధికమయ్యాయి. 2019తో పోలిస్తే అంతర్జాతీయంగా గతేడాది 150 నగరాల్లో గృహాల ధరల సగటు వృద్ధి 5.6 శాతం నమోదైంది. 2019లో ఈ వృద్ధి 3.2 శాతంగా ఉంది. 2020లో 81 శాతం నగరాల్లో ధరలు పెరిగాయి. -
నివాస భవనాలకూ ఈసీబీసీ
సాక్షి, హైదరాబాద్: నివాస భవనాలకు ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) నిబంధన అమల్లోకి వచ్చింది. గతేడాది జూన్‌లో వాణిజ్య భవనాలకు ఈసీబీసీ కోడ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నివాస విభాగంలో ఈసీబీసీ కోడ్‌తో 2030 నాటికి 125 బిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేసింది. నివాస, వాణిజ్య భవనాలు రెండు విభాగాల్లో కలిపి 2030 నాటికి సుమారు 1,000 బిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి ఆదా అవుతుంది. -
ముంబైలో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ నివాస సముదాయంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దాదర్ ప్రాంతంలో ఉన్న క్రిస్టల్ టవర్ అనే 17 అంతస్తుల భవనంలో ఉదయం 8.32 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో నలుగురు మరణించగా, 16 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారికి ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 12వ అంతస్తులో చెలరేగిన మంటలు మిగతా అంతస్తులకు దావానలంలా వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ బ్రిగేడ్ కంట్రోల్ రూమ్‌కు సందేశం అందింది. సమాచారం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. లిఫ్టులు, మెట్లదారి నుంచి ప్రజలను కాపాడటం సురక్షితం కాదని భావించిన అధికారులు నిచ్చెనల సాయంతో వారిని కిందకు దించారు. ఇంకా కొంత మంది భవనంలోనే ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. మొత్తం 10 ఫైరింజన్లు, 4వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు ఆర్పామని చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఆపదలో ఆదుకున్న చిన్నారి చిట్కాలు సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడున్న వారంతా భయంతో వణికిపోతారు.అదే అగ్ని ప్రమాదాల్లాంటివయితే చావు భయంతో తోపుళ్లు, తొక్కిసలాటలతో పరిస్థితి భయానకంగా మారుతుంది.అయితే, ముంబైలోని క్రిస్టల్ టవర్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల అమ్మాయి ఎంతో ధైర్యంగా వ్యవహరించి ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడింది. జెన్ సదావర్తే అనే ఆ బాలిక అగ్ని ప్రమాదం కారణంగా వెలువడిన పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వారికి చిన్న చిట్కాతో ఉపశమనం కలిగించింది.పొగకు ఫ్లాట్లలోని జనమంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతోంటే జెన్ వాళ్లకి ధైర్యం చెప్పింది. తడి గుడ్డను ముక్కుకు కట్టుకుంటే పొగలోని కార్బన్‌డయాక్సెడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు.అని చెప్పింది. అంతే కాకుండా అందుబాటులో ఉన్న పాత బట్టల్ని తీసుకొచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా(జేబురుమాళ్ల సైజులో)చింపింది. వాటిని తడిపి అందరికీ ఇచ్చి ముక్కుకు కట్టుకోమని చెప్పింది. అంతా అలా చేసి కార్బన్ డయాక్సైడ్ బారి నుంచి బయటపడ్డారు. అలాగే, లిఫ్టులో కిందకి దిగకూడదంటూ వారిని వారించింది. తన దగ్గరున్న ఎయిర్ ప్యూరిఫయర్‌ను కూడా అందరికీ ఇచ్చింది.అలాగే అందరూ ఒకేసారి మెట్ల మీదుగా తోసుకుంటూ కిందకి వెళితే జరిగే ప్రమాదాన్ని కూడా వారికి అర్థమయ్యేలా చెప్పింది. ఇవన్నీ విపత్తు నిర్వహణకు సంబంధించి తన స్కూల్లో చేసిన ప్రాజెక్టు వల్ల నేర్చుకున్నానని తరువాత మీడియాకు తెలిపింది. -
రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఐదుగురి మృతి
హిమాచల్ ప్రదేశ్: రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరికొంత మంది బిల్డింగ్‌లో చిక్కుకుపోయారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండీ ప్రాంతంలోని నెర్ చౌక్‌లో జరిగింది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎల్పీజీ సిలిండర్ అకస్మాత్తుగా పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండీ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ మంత్రులకు నివాస భవనాలు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా నియమితులైన నలుగురికి హైదరాబాద్‌లో నివాస భవనాలను కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు క్యాంపు కార్యాలయం, నివాసానికి బంజారాహిల్స్ రోడ్డు నం. 12లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్న ఎంబీ 30 నంబర్ భవనాన్ని కేటాయించారు. మంత్రులు పరిటాల సునీతకు ఎంబీ 25 నంబర్ నివాస భవనం, కె. అచ్చెన్నాయుడుకు ఎంబీ 28 నంబరు నివాస భవనం.. పైడికొండల మాణిక్యాలరావుకు ఎంబీ 27 నంబరు నివాస భవనాలను కేటాయించారు.