లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేయ నుంది. దుబాయ్‌లో 42-అంతస్తుల ఆకాశహర్మ్యం విశేషాలు, విలాసవంతమైన సౌకర్యాలను తాజాగా ఆవిష్కరించింది. ఇటీవల ప్రకటించిన రెసిడెన్షియల్ తన ప్రారంభ వెంచర్‌కు సంబంధించిన ప్రణాళికలను వెల్లడించింది. కనీవినీఎరుగని ఫీచర్లు, సౌకర్యాలతో వీటిని తీర్చిదిద్దుతున్నట్టు ప్రకటించింది.
ఇదీ చదవండి: మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్‌లో వీడియో వైరల్
దుబాయ్ ఆధారిత రియల్ ఎస్టేట్ డెవలపర్ బింఘట్టి భాగస్వామ్యంతో, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి కొత్త అర్థంతో ఫ్రెంచ్ "ఆర్ట్ డి వివ్రే"ని అందించడం లక్ష్యంగా ఈ రెసిడెన్షియల్ టవర్స్‌ను రూపొందించి నట్టు అధికారిక ఇన్‌స్టాలో వెల్లడించింది. రిసార్ట్‌లో ఉన్న ఫీలింగ్ కలిగేలా బెస్పోక్ లేఅవుట్‌తో ప్రత్యేకంగా రూపొందించింది. ప్రతీ హౌస్‌లో.. హై-ఎండ్ ఫినిషింగ్స్, అధునాతన సౌకర్యాలతో నభూతో నభిష్యతి అన్నట్టు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు)
రూఫ్‌టాప్ పూల్ ,కార్ లిప్ట్
ఫ్లోర్-టు-సీలింగ్ విండోలు, అందమైన పెద్ద బాల్కనీల ద్వారా దుబాయ్ స్కైలైన్ భవనాలను వీక్షించ వచ్చు. ప్రైవేట్ పూల్, జాకుజీ స్పా, ఫిట్‌నెస్ క్లబ్, చెఫ్ టేబుల్, ప్రైవేట్ వాలెట్, ప్రైవేట్ మెంబర్స్ క్లబ్, రెండు గ్యారేజ్-టు-పెంట్‌హౌస్ కార్ లిఫ్ట్‌లు వంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయని తెలిపింది. అంతేనా సన్‌బాత్ కోసం ఎయిర్ బీచ్ కూడా ఉందనీ, మాన్‌హట్టన్ ఆఫ్ దుబాయ్‌గా కాస్మోపాలిటైన్ ప్రాంతం నడిబొడ్డున ఉందని కంపెనీ పేర్కొంది.
కాగా దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ టవర్స్‌లో ప్రతి అపార్ట్‌మెంట్ ఒక విలక్షణమైన లేఅవుట్‌తో రూపొందిస్తోంది. బుగట్టి బ్రాండ్‌కి పర్యాయపదంగా ఉండేలా రివేరా మాన్షన్స్ పేరుతో 171 అపార్ట్‌మెంట్లు , 11 విలాసవంతమైన స్కై మాన్షన్ పెంట్‌హౌస్‌లు ఉంటాయి .
Comments
Please login to add a commentAdd a comment