ఓ నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా సుమారు 16 మంది మృతి చెందారు. దుబాయ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. దుబాయ్‌లోనిన దీరా బుర్జ్ మురార్ ప్రాంతంలో రెసిడెన్షియల్ భవనంలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భవనం నాల్గో అంతస్థులో మొదలైన మంటలు క్షణాల్లో ఇతర అపార్ట్‌మెంట్‌లకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో కేరళ, తమిళనాడుకి చెందిన వారు ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అల్ రాస్‌లో శనివారం మధ్యాహ్నాం 12.35 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు.
అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని తరలింపు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. దాదాపు 10 మంది పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనలో బాధితులను గుర్తించడంలో సహకరించిన కేరళకు చెందిన సామాజిక కార్యకర్త నసీర్ వాటనపల్లి మాట్లాడుతూ..
భవనంలో కేరళకు చెందిన ఇద్దరు దంపతులు, తమిళనాడుకు చెందిన ఇద్దరు పురుషులు, పాకిస్తాన్ కజిన్స్, నైజీరియన్ మహిళతో సహా 16 మంది మృతి చెందినట్లు తెలిపారు. కాగా, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపి మృతదేహాలను భారత్‌కు పంపేందుకు సహకరిస్తామని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
(చదవండి: ఆశాకిరణం ఆఫ్రికా! నైజర్ మహిళ జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మ)
Comments
Please login to add a commentAdd a comment