కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలో గల ఒక బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఈ పేలుడు శబ్దం చాలా మైళ్ల దూరం వరకూ వినిపించింది. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది.
సమీపప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)గా గుర్తించినట్లు దక్షిణ కన్నడ పోలీసు సూపరింటెండెంట్ సీబీ రిషియంత్ తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి, పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment