దేశరాజధాని ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, ఒక చిన్నారి సహా 26 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
మంటలు చెలరేగినప్పుడు భవనంలో 60 మంది ఉన్నారని, వీరిలో కొందరు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, 26 మందిని ప్రమాదం బారి నుంచి కాపాడారు. అలాగే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో తొక్కిసలాట జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని కిటికీ పక్కన నిచ్చెనను ఏర్పాటు చేసి, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ఒక్కొక్కరిగా రక్షించారు. ప్రమాదం జరిగిన షకర్పూర్ ప్రాంతంలో వీధులు చాలా ఇరుకుగా ఉండడంతో మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: హమాస్ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా?
Comments
Please login to add a commentAdd a comment