Peyush Bansal Success Story లెన్స్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, పియూష్ బన్సల్ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నారు.ఢిల్లీలోని నీతి బాగ్‌లో 18 కోట్ల రూపాయలతో ఇంటిని కొనుగోలు చేశారు. నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద డీల్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ ప్రకారం 2023, మే 19 దీనికి సంబంధించిన సేల్ డీడ్ ఒప్పందం కుదిరింది.
ఈ లావాదేవీకి బన్సల్ రూ. 1.08 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు కూడా తెలుస్తోంది.ఇది 939.4 చదరపు మీటర్లు లేదా 10,111.7 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాను బన్సాల్ సురీందర్ సింగ్ అత్వాల్ నుండి కొనుగోలు చేశారు. రియాల్టీ షో షార్క్ ట్యాంక్ షా ఇండియా న్యాయమూర్తుల ప్యానెల్‌లో కూడా ఉన్నారు.
ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన కీలక ఒప్పందాల్లో ఇది లేటెస్ట్ అని తెలుస్తోంది. అలాగే మార్చిలో, ఢిల్లీలోని టోనీ గోల్ఫ్ లింక్స్‌లో భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధా రోహత్గీ పేరు మీద 2,160 చదరపు గజాల బంగ్లాను రూ.160 కోట్లకు కొనుగోలు చేశారు. ఆగస్టులో, ఇంటర్‌డెంటల్ బ్రష్‌లను తయారు చేసే గ్లోబల్ డెంట్ ఎయిడ్స్ డైరెక్టర్ రేణు ఖుల్లర్ ఢిల్లీలోని ఖరీదైన లొకాల్టీ నిజాముద్దీన్ ఈస్ట్‌లో 873 చదరపు గజాల విస్తీర్ణంలో 61.70 కోట్ల రూపాయలకు బంగ్లాను కొనుగోలు చేశారు.
ఎవరీ పియూష్ బన్సల్
వ్యాపంలో బిల్ గేట్స్ అంతటి వాడిని కావాలనే పియూష్ కల. అలా తమ డ్రీమ్ ప్రాజెక్ట్ మార్కెట్ స్టడీ చేసిన వినూత్నంగా వ్యాపారాన్ని మొదలు పెట్టి, పట్టుదల, కృషితో తన కంపెనీని అంచెలంచెలుగా తీర్చిదిద్దుతూ, అభివృద్ది పథంలో నడిపించిన ఘనత పియూష్ బన్సల్ సొంతం. మైక్రోసాఫ్ట్‌లో ప్రోగ్రామ్ మేనేజర్ నుంచి లెన్స్‌కార్ట్ కో-ఫౌండర్‌గా విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచిన వైనం వెనుక చాలా పెద్ద స్ట్రగులే ఉంది. ఈ రంగంలో దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌లలో ఒకటిగా నిలిపిన పియూష్ విజయగాథ, ఎలా ఎదిగాడు అనే విషయాలను చూద్దాం.
1985 ఏప్రిల్ 26న ఢిల్లీలో జన్మించారు బన్సల్. కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మైక్రోసాఫ్ట్‌లో MS ఆఫీస్‌లో పనిచేశారు. 2007లో మైక్రోసాఫ్ట్‌ను విడిచి, తన ఇండియాకు తిరిగి వచ్చారు. 2007- 2009 మధ్య కొన్ని పాపులర్ సంస్థలతో పనిచేశారు.
లెన్స్‌కార్ట్ ఆవిష్కరణ
ఒక వైపు పీజీ చేస్తూనే సొంత వ్యాపారాన్ని మొదలు పెట్దాలన్న పట్టుదలతో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులతో చర్చించి రూ.25 లక్షల ప్రారంభ పెట్టుబడితో జనవరి 2008లో సెర్చ్‌మైకాంపస్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. గృహ నిర్మాణం, ఇంటర్న్‌షిప్‌లు, పార్ట్‌టైమ్ ఉపాధి , అనేక ఇతర వాటితో సహా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వెబ్‌సైట్ ద్వారా సమాధానాలిస్తూ పాపులరయ్యారు. ఈ సమయంలో ప్రధాన ఇ-కామర్స్ కంపెనీలు కళ్లద్దాల రంగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని గమనించారు. 2010లో అమిత్ చౌదరి, సుమీత్ కపాహితో కలిసి లెన్స్‌కార్ట్‌ని స్థాపించారు. మొదట్లో కాంటాక్ట్ లెన్స్‌లను ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే విక్రయించారు. ఆ తరువాత 2011 మార్చినుంచి ఆన్‌లైన్ స్టోర్ ద్వారా సన్ గ్లాసెస్ , ఫ్యాషన్ కళ్లజోళ్లతో అత్యంత వైవిధ్యమైన ఆన్‌లైన్ మార్కెట్‌ను సృష్టించారు.
పియూష్ బన్సల్ నెట్‌వర్త్
పియూష్ నెట్‌వర్త్ 600 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ప్రస్తుతం లెన్స్‌కార్ట్‌లో దాదాపు 4000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా1,000 స్టోర్‌లతో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. 37,500 కోట్ల రూపాయల విలువనుతో లెన్స్‌కార్ట్ 2019లో యునికార్న్ క్లబ్‌లో చేరింది. 2020లోమార్చిలో విక్రయాలు రెట్టింపు కావడంతో రాబడి రూ. 486 కోట్ల నుండి రూ. 1,000 కోట్లకు చేరుకుంది.అంతేకాదు ప్రధాన ప్రత్యర్థి అయిన టైటన్ ఐవేర్‌ను అధిగమించింది. 2019లో ఫార్చ్యూన్ ఇండియా బెస్ట్ 40 అండర్ 40 వ్యవస్థాపకుల జాబితాలో కూడా చోటు సంపాదించారు.
ఢిల్లీలోని ఆధునిక ఫీచర్లు, ఫర్నిచర్‌తో కోట్ల విలువైన ఒక విలాసవంతమైన ఇంట్లో తన కుటుంబంతో నివసిస్తున్నారు. రూ. 1.70 కోట్ల విలువైన జర్మన్ సెడాన్
BMW 7 సిరీస్ కారు ఇతని సొంతం. ఇది విలాసవంతమైన రైడ్ మాత్రమే కాదు, కేవలం 5.4 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.2011లో నిమిష మిట్టల్‌ని పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు.
Comments
Please login to add a commentAdd a comment