Lenskart
-
కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!
Peyush Bansal Success Story లెన్స్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, పియూష్ బన్సల్ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నారు.ఢిల్లీలోని నీతి బాగ్‌లో 18 కోట్ల రూపాయలతో ఇంటిని కొనుగోలు చేశారు. నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద డీల్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ ప్రకారం 2023, మే 19 దీనికి సంబంధించిన సేల్ డీడ్ ఒప్పందం కుదిరింది. ఈ లావాదేవీకి బన్సల్ రూ. 1.08 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు కూడా తెలుస్తోంది.ఇది 939.4 చదరపు మీటర్లు లేదా 10,111.7 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాను బన్సాల్ సురీందర్ సింగ్ అత్వాల్ నుండి కొనుగోలు చేశారు. రియాల్టీ షో షార్క్ ట్యాంక్ షా ఇండియా న్యాయమూర్తుల ప్యానెల్లో కూడా ఉన్నారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన కీలక ఒప్పందాల్లో ఇది లేటెస్ట్ అని తెలుస్తోంది. అలాగే మార్చిలో, ఢిల్లీలోని టోనీ గోల్ఫ్ లింక్స్‌లో భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధా రోహత్గీ పేరు మీద 2,160 చదరపు గజాల బంగ్లాను రూ.160 కోట్లకు కొనుగోలు చేశారు. ఆగస్టులో, ఇంటర్డెంటల్ బ్రష్‌లను తయారు చేసే గ్లోబల్ డెంట్ ఎయిడ్స్ డైరెక్టర్ రేణు ఖుల్లర్ ఢిల్లీలోని ఖరీదైన లొకాల్టీ నిజాముద్దీన్ ఈస్ట్‌లో 873 చదరపు గజాల విస్తీర్ణంలో 61.70 కోట్ల రూపాయలకు బంగ్లాను కొనుగోలు చేశారు. ఎవరీ పియూష్ బన్సల్ వ్యాపంలో బిల్ గేట్స్ అంతటి వాడిని కావాలనే పియూష్ కల. అలా తమ డ్రీమ్ ప్రాజెక్ట్ మార్కెట్ స్టడీ చేసిన వినూత్నంగా వ్యాపారాన్ని మొదలు పెట్టి, పట్టుదల, కృషితో తన కంపెనీని అంచెలంచెలుగా తీర్చిదిద్దుతూ, అభివృద్ది పథంలో నడిపించిన ఘనత పియూష్ బన్సల్ సొంతం. మైక్రోసాఫ్ట్‌లో ప్రోగ్రామ్ మేనేజర్ నుంచి లెన్స్‌కార్ట్ కో-ఫౌండర్‌గా విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచిన వైనం వెనుక చాలా పెద్ద స్ట్రగులే ఉంది. ఈ రంగంలో దేశంలోని ప్రముఖ ఆన్లైన్ రిటైలర్లలో ఒకటిగా నిలిపిన పియూష్ విజయగాథ, ఎలా ఎదిగాడు అనే విషయాలను చూద్దాం. 1985 ఏప్రిల్ 26న ఢిల్లీలో జన్మించారు బన్సల్. కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మైక్రోసాఫ్ట్‌లో MS ఆఫీస్‌లో పనిచేశారు. 2007లో మైక్రోసాఫ్ట్‌ను విడిచి, తన ఇండియాకు తిరిగి వచ్చారు. 2007- 2009 మధ్య కొన్ని పాపులర్ సంస్థలతో పనిచేశారు. లెన్స్‌కార్ట్ ఆవిష్కరణ ఒక వైపు పీజీ చేస్తూనే సొంత వ్యాపారాన్ని మొదలు పెట్దాలన్న పట్టుదలతో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులతో చర్చించి రూ.25 లక్షల ప్రారంభ పెట్టుబడితో జనవరి 2008లో సెర్చ్మైకాంపస్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. గృహ నిర్మాణం, ఇంటర్న్‌షిప్‌లు, పార్ట్‌టైమ్ ఉపాధి , అనేక ఇతర వాటితో సహా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వెబ్సైట్ ద్వారా సమాధానాలిస్తూ పాపులరయ్యారు. ఈ సమయంలో ప్రధాన ఇ-కామర్స్ కంపెనీలు కళ్లద్దాల రంగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని గమనించారు. 2010లో అమిత్ చౌదరి, సుమీత్ కపాహితో కలిసి లెన్స్కార్ట్ని స్థాపించారు. మొదట్లో కాంటాక్ట్ లెన్స్‌లను ప్రిస్క్రిప్షన్పై మాత్రమే విక్రయించారు. ఆ తరువాత 2011 మార్చినుంచి ఆన్లైన్ స్టోర్ ద్వారా సన్ గ్లాసెస్ , ఫ్యాషన్ కళ్లజోళ్లతో అత్యంత వైవిధ్యమైన ఆన్లైన్ మార్కెట్‌ను సృష్టించారు. పియూష్ బన్సల్ నెట్‌వర్త్ పియూష్ నెట్‌వర్త్ 600 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ప్రస్తుతం లెన్స్‌కార్ట్‌లో దాదాపు 4000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా1,000 స్టోర్లతో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. 37,500 కోట్ల రూపాయల విలువనుతో లెన్స్‌కార్ట్ 2019లో యునికార్న్ క్లబ్లో చేరింది. 2020లోమార్చిలో విక్రయాలు రెట్టింపు కావడంతో రాబడి రూ. 486 కోట్ల నుండి రూ. 1,000 కోట్లకు చేరుకుంది.అంతేకాదు ప్రధాన ప్రత్యర్థి అయిన టైటన్ ఐవేర్‌ను అధిగమించింది. 2019లో ఫార్చ్యూన్ ఇండియా బెస్ట్ 40 అండర్ 40 వ్యవస్థాపకుల జాబితాలో కూడా చోటు సంపాదించారు. ఢిల్లీలోని ఆధునిక ఫీచర్లు, ఫర్నిచర్‌తో కోట్ల విలువైన ఒక విలాసవంతమైన ఇంట్లో తన కుటుంబంతో నివసిస్తున్నారు. రూ. 1.70 కోట్ల విలువైన జర్మన్ సెడాన్ BMW 7 సిరీస్ కారు ఇతని సొంతం. ఇది విలాసవంతమైన రైడ్ మాత్రమే కాదు, కేవలం 5.4 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.2011లో నిమిష మిట్టల్‌ని పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. -
రతన్ టాటా శిష్యుడు.. వేల కోట్లకు అధిపతి!
భారత్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ లెన్స్‌కార్ట్‌లో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. కంపెనీకి చెందిన పాత, కొత్త షేర్లను 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4100 కోట్లు)తో సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం లెన్స్‌కార్ట్ విలువ 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33,000 కోట్లు). ఇదీ చదవండి: రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్.. ఎవరిదో తెలుసా? పీయూష్ బన్సల్, అమిత్ చౌదరి, సుమీత్ కపాహి ఈ లెన్స్‌కార్ట్ సంస్థను స్థాపించారు. ఇందులో కేకేఆర్ అండ్ కంపెనీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, టెమాసెక్ హోల్డింగ్స్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. వీరిలో పీయూష్ ప్రముఖ షో షార్క్ ట్యాంక్ ఇండియాలో కనిపించిన తర్వాత సెలబ్రిటీ అయ్యారు. అయితే కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న అమిత్ చౌదరి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఎవరీ అమిత్ చౌదరి? అమిత్ చౌదరి లెన్స్‌కార్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, కంపెనీకి సీవోవో. అనలిటిక్స్ రంగంలో ప్రావీణ్యం ఉన్న అమిత్ చౌదరి కంపెనీని అభివృద్ధి దిశగా ముందుండి నడిపించారు. వ్యాపారంలో వృద్ధిని తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే. లెన్స్‌కార్ట్ ఆఫ్‌లైన్ స్టోర్లను పెంచడంలో కీలకపాత్ర పోషించారు. కోల్‌కతాలో జన్మించిన అమిత్ చౌదరి స్థానిక భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నారు. బీఐటీ మెస్రా నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ పట్టా అందుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను తన మెంటర్‌గా చెబుతుంటారు. 2019లో రతన్ టాటాను కలిసిన ఆయన తాను రతన్ టాటాను ఎంతలా ఆరాధించేది తెలుపుతూ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో పలువురిని బాగా ఆకట్టుకుంది. రతన్ టాటా అమిత్ చౌదరి కోసం 2016లో లెన్స్‌కార్ట్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇది తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు కాదు.. కష్టాల్లో ఉన్న స్టార్టప్ కంపెనీ అండగా నిలిచేందుకు. అలా అప్పట్లో రతన్ టాటా నుంచి సాయం పొందిన ఆయన శిష్యుడు నేడు వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఇదీ చదవండి: సమాచారం ఇవ్వండి.. రూ.20 లక్షలు అందుకోండి! సెబీ నజరానా.. -
హైదరాబాద్‌లో లెన్స్‌కార్ట్ ప్లాంట్?
• ఎయిర్ కనెక్టివిటీ పెరిగితే ఏర్పాటు • కంపెనీ కో–ఫౌండర్ అమిత్ చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కళ్లజోళ్ల వ్యాపారంలో ఉన్న లెన్స్‌కార్ట్ తయారీ కేంద్రాన్ని దక్షిణాదిన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీకి ఇప్పటికే గుర్గావ్లో తయారీ యూనిట్ ఉంది. 2020 నాటికి సిద్ధం కాగల కొత్త ప్లాంటుకై హైదరాబాద్, బెంగళూరు నగరాలు అనువుగా ఉంటాయని సంస్థ భావిస్తోంది. విమాన సర్వీసులు పెరిగితే భాగ్యనగరిలోనే ప్లాంటును నెలకొల్పుతామని లెన్స్‌కార్ట్ సహ వ్యవస్థాపకులు అమిత్ చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. సంస్థ వ్యాపారంలో 60 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే సమకూరుతోందని చెప్పారు. హైదరాబాద్ సహా దేశంలో 10 నగరాల్లో సుమారు రూ.27 కోట్ల వ్యయంతో అసెంబ్లింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొన్నారు. వీటి ద్వారా తక్కువ సమయంలో కస్టమర్లకు ఉత్పత్తుల డెలివరీ సాధ్యమవుతుందని వివరించారు. చిన్న నగరాల్లో స్టోర్లు.. కంపెనీకి దేశవ్యాప్తంగా 250 ఔట్లెట్లు ఉన్నాయి. రెండేళ్లలో వీటి సంఖ్యను 1,000కి చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఎక్కువ ఔట్లెట్లు రానున్నాయని అమిత్ తెలిపారు. ‘ఆన్లైన్ విక్రయాల ద్వారా 40 శాతం వ్యాపారం నమోదు చేస్తున్నాం. 3,000కుపైగా డిజైన్లు అందుబాటులో ఉంచాం. ప్రతి నెలా 40 కొత్త డిజైన్లను ప్రవేశపెడుతున్నాం. కంపెనీ ఉత్పత్తుల ధర రూ.600–5,000 మధ్య ఉంది. విభిన్న డిజైన్లు, అందుబాటు ధర, నాణ్యత కంపెనీ ప్రత్యేకత. వ్యవస్థీకృత రంగంలో టాప్–1తోపాటు పూర్తి స్థాయి తయారీ కంపెనీగా నిలిచాం. రోజుకు 8–10 వేల యూనిట్లు విక్రయిస్తున్నాం’ అని తెలిపారు. లెన్స్‌కార్ట్‌లో పెట్టుబడి చేసిన వారిలో రతన్ టాటా, అజీమ్ ప్రేమ్‌జీ ఉన్నారు. -
ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ నుంచి లెన్స్‌కార్ట్‌కు నిధులు
న్యూఢిల్లీ: రూ.400 కోట్లు సేకరించిన మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే లెన్స్‌కార్ట్ మరోసారి నిధులు సేకరించింది. ఈ సారి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ నుంచి నిధులను రాబట్టింది. అయితే ఎంత మొత్తం అన్నది బయటకు వెల్లడించలేదు. లెన్స్‌కార్ట్ ఆన్లైన్ విభాగంలో కళ్లద్దాల స్టోర్స్‌ను నిర్వహించే ప్రముఖ సంస్థ. ఆఫ్‌లైన్ విభాగంలోనూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. తాజా నిధుల సేకరణ ఆన్లైన్ ఐవేర్ మార్కెట్లో వృద్ధికి సహకరిస్తుందని లెన్స్కార్ట సీఈవో, వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్ ఢిల్లీలో తెలిపారు. రిటైల్ విభాగంలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు ఎంతో అనుభవం ఉందని, ఫ్యాబ్ ఇం డియా తదితర కంపెన్లీలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అనుభవం తమకు ఉపకరిస్తుందన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విభాగంలో మరింత వృద్ధిపై దృష్టి పెడతామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.400కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రూ.500కోట్లకు చేరుకుంటామన్నారు. -
లెన్స్‌కార్ట్‌లోకి...రూ.400 కోట్లు
రతన్ టాటా, ఇన్ఫీ క్రిస్ పెట్టుబడులు న్యూఢిల్లీ: కళ్లజోళ్ల ఆన్లైన్ రిటైల్ కంపెనీ లెన్స్‌కార్ట్ రూ.400 కోట్లు సమీకరించింది. ప్రపంచ బ్యాంక్ విభాగమైన ఐఎఫ్‌సీ, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, ఇన్పోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్, తదితరుల నుంచి ఈ నిధులు సమీకరించామని లెన్స్‌కార్ట్ తెలిపింది. మూడేళ్లలో 400 నగరాలకు విస్తరించడానికి, సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవడానికి, కళ్లజోళ్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నిధులు వినియోగిస్తామని లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకులు, సీఈఓ పియుష్ బన్సాల్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 5,000 లెన్స్‌లు తయారు చేస్తున్నామని, ఈ నిధులతో వచ్చే ఏడాది కల్ల ఈ సంఖ్యను 20,000కు పెంచుతామని పేర్కొన్నారు. ఈ రూ.400 కోట్ల సిరీస్ డి నిధుల్లో ఐఎఫ్‌సీ ప్రధాన ఇన్వెస్టర్ అని, టీపీజీ గ్రోత్, యాడ్వెక్ మేనేజ్మెంట్, ఐడీజీ వెంచర్స్ నుంచి కూడా నిధులు సమీకరించామని తెలిపారు. ఈ లావాదేవీకి అవెండాస్ క్యాపిటల్ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిందని పేర్కొన్నారు. త్వరలో వంద ‘టెక్నాలజీ’ ఉద్యోగాలు... 2010లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటివరకు రూ.317 కోట్ల పెట్టుబడులు రాబ ట్టింది. ఐడీజీ వెంచర్స్, రోనీ స్క్రూవాలకు చెందిన యునిలేజర్ వెంచర్స్, టీపీజీ గ్రోత్, టీఆర్ క్యాపిటల్ సంస్థ నుంచి పెట్టుబడులను సమీకరించింది. టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను పటిష్టం చేయనున్నామని వచ్చే ఏడాది కల్లా టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాల సంఖ్యను వంద నుంచి 200కు పెంచనున్నామని బన్సాల్ వివరించారు. ప్రస్తుతం తమ సంస్థలో మొత్తం 400 మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.