ఇప్పటివరకు చాలామంది సన్ గ్లాసెస్ ఉపయోగించి ఉంటారు. అయితే ఇప్పుడు లెన్స్‌కార్ట్ కంపెనీ లాంచ్ చేసిన సన్ గ్లాస్ ఓ స్మార్ట్ గ్లాస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది సాధారణ సన్ గ్లాస్ మాదిరిగా పనిచేస్తూనే.. బ్లూటూత్ కూడా కలిగి ఉంటుంది. ఇంతకీ దీని ధర ఎంత? ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
లెన్స్‌కార్ట్ కంపెనీ లాంచ్ చేసిన ఫోనిక్ స్మార్ట్ గ్లాసెస్ చూడటానికి సాధారణ గ్లాసెస్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులోని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా హెడ్‌ఫోన్‌ల అవసరం లేకుండానే ఆడియో వినొచ్చు.. కాల్స్ కూడా చేయొచ్చు.
ఇదీ చదవండి: 70 ఏళ్ల నాటి కారు: ధర రూ. 458 కోట్లు
లెన్స్‌కార్ట్ ఫోనిక్ స్మార్ట్ గ్లాస్.. సింగిల్ ఛార్జితో ఏడు గంటలు పనిచేస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ సదుపాయం ఉండటం వల్ల.. మెసేజస్ పంపడం, రిమైండర్‌లను సెట్ చేసుకోవడం లేదా మ్యూజిక్ కంట్రోల్ చేయడం వంటి వాటిని సులభం చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 4000. ఇది షైనీ బ్లూ, మ్యాట్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment