sun glasses
-
జేబులో ఐమాక్స్.. యూట్యూబ్, సినిమాలు, వీడియోలు అన్నీ చూడొచ్చు
జేబులో ఐమాక్స్... అంత పెద్ద థియేటర్ మన జేబులో పట్టడమేంటని ఆలోచిస్తున్నారా? నిజమే.. కాకపోతే థియేటర్ కాదు. ఆ స్క్రీన్‌ను తలపించే కళ్లద్దాలు వచ్చేశాయి. ఇంట్లో, కారులో, బయట ఎక్కడంటే అక్కడ కూర్చుని థియేటర్ యాంబియెన్స్‌తో మీ ఫోన్లోని సినిమాలు, వీడియోలు చూసేయొచ్చు. అరచేతిలో అంతపెద్ద స్క్రీన్‌ను చూపించే ఆ కళ్లద్దాల కథేమిటో తెలుసుకుందాం. బ్రిటిష్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఈఈ (ఒకప్పటి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్) ఈ ‘ఎన్రియల్ ఎయిర్’ కళ్లజోడును ఆవిష్కరించింది. చూడటానికి సాధారణ కళ్లద్దాల మాదిరిగానే కనిపించే వీటి వెనకాల ఆర్గానిక్ ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. దీనితో సినిమాలు చూడొచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. అంత బిగ్ స్క్రీన్‌ను ఆవిష్కరించే గ్లాసెస్ కదా.. ఎంత బరువుంటాయో అన్న అనుమానం వద్దు. అవి కేవలం 79గ్రాముల బరువుంటాయి. సాధారణ యూఎస్బీ కేబుల్‌తో గ్లాసెస్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేస్తే చాలు. 20 అడుగుల స్క్రీన్ మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. కళ్లద్దాలకు పక్కనే చెవుల మీదుగా ఉండే ఫ్రేమ్‌లో ఏర్పాటు చేసిన స్పీకర్స్లోంచి ఆడియో వినబడుతుంది. యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు, వెబ్‌ను సర్ఫ్ చేయొచ్చు. ఒకేసారి అనేక స్క్రీన్స్ చూసే అవకాశమూ ఇందులో ఉంది. ఇక రెండోది ఎయిర్ కాస్టింగ్. దీనితో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎదురుగా ఉన్న వర్చువల్ స్క్రీన్కు కనెక్ట్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అప్లికేషన్స్ అంటే గేమ్స్, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియాను ఆపరేట్ చేయొచ్చు. చదవండి: జాబిల్లిపై పచ్చదనం! -
అంతచిన్న కెమెరా.. పర్మిషన్ లేకుండా తీస్తే ఎలా?
Facebook Sunglass: ఫేస్బుక్ కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ కళ్లజోడు విషయంలో ఊహించిందే జరుగుతోంది. కళ్లజోడుపై ఉన్న చిన్న కెమెరా గురించి పలువురు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అవతలి వాళ్లను అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కళ్లజోడు కంపెనీ రే-బాన్‌తో కలిసి ఫేస్బుక్ ‘రే బాన్ స్టోరీస్’ పేరిట స్మార్ట్ కళ్లజోడును మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కళ్లజోడుకు పైభాగంలో చిన్న కెమెరా ఉంటుంది. దీని సాయంతో ఫొటోలు, షార్ట్ వీడియోలు తీయొచ్చని ఫేస్బుక్ ప్రకటించుకుంది కూడా. అయితే ఎదుటివారి అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం ఉన్నందున యూరోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఐర్లాండ్ డాటా ప్రొటెక్షన్ కమిషన్(డీపీసీ) ఎదుట హాజరైన ఫేస్బుక్ ప్రతినిధులు.. కెమెరా పైభాగంలో ఉండే చిన్న ఎల్ఈడీ ఇండికేటర్ లైట్ గురించి వివరించారు. ఒకవేళ ఎదుటివాళ్లు ఫొటోగానీ, వీడియోగానీ తీస్తుంటే.. ఆ లైట్ ఆధారంగా గుర్తించొచ్చని ఫేస్బుక్ వివరణ ఇచ్చుకుంది. కానీ, డీపీసీ ఈ వివరణతో సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. కెమెరా చిన్నదిగా ఉండడం, పైగా ఆ లైట్ వెలుతురూ అంతగా లేకపోవడంపై డీపీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం. ట్రబుల్ మేకర్ ఇటలీ ప్రైవసీ విభాగం ‘ది గరాంటే’.. ఇదివరకే ఈ స్మార్ట్కళ్లజోడు విషయంలో ప్రజల భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ఫేస్బుక్ రీజియన్ బేస్ ఐర్లాండ్‌లో ఉండడం వల్ల.. ఐర్లాండ్ డాటా ప్రొటెక్షన్ కమిషన్ విచారణ నడుస్తోంది. ఇక డీపీసీ తలనొప్పి ఫేస్‌బుక్‌కు కొత్తేం కాదు. ఫేస్బుక్ చాలాకాలం నుంచి తేవాలనుకుంటున్న ఫేషియల్ ట్యాగింగ్ ఫీచర్, డీపీసీ అభ్యంతరాల వల్లే వాయిదా పడుతోంది. అంతేకాదు వాట్సాప్ డాటాను మాతృక సంస్థ ఫేస్బుక్ పంచుకుంటోందన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది కూడా. ఇక ఫేస్బుక్, ఫేస్బుక్ బిజినెస్ వ్యవహరాలకు సంబంధించిన ఫిర్యాదులెన్నో డీపీసీ ముందు పెండింగ్‌లో ఉండగా.. ఈ మధ్యే ‘ట్రాన్సపరెన్సీ ఫెయిల్యూర్’ ఫిర్యాదు ఆధారంగా 267 డాలర్ల పెనాల్టీ సైతం విధించింది. వచ్చే ఏడాది మరొకటి అయితే ఈ ఫిర్యాదులపై ఫేస్బుక్ సానుకూలంగా స్పందించింది. అప్రమత్తత కారణంగా ఇలాంటి అనుమానాలు లేవనెత్తడం సహజమేనని, ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ వివరణలు ఇస్తామని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇక ఫేస్బుక్ ప్రస్తుతం విడుదల చేసిన కళ్లద్దాలు అగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ కాకుండానే మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. వచ్చే ఏడాదిలో ప్రమఖ కళ్లజోడు కంపెనీ లగ్జోట్టికా సహకారంతో ఏఆర్ సంబంధిత కళ్లద్దాల్ని తేనున్నట్లు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇదివరకే ప్రటించాడు కూడా. ఇక ప్రస్తుతం తెచ్చిన రే బాన్ స్టోరీస్ కళ్లజోడులో 5ఎంపీ కెమెరా ఉంది. 299 డాలర్లు(సుమారు 22 వేల రూపాయలు) ప్రారంభ ధర కాగా.. యూకేతో పాటు ఈయూ పరిధిలోని ఐర్లాండ్, ఇటలీలో అమ్ముతున్నారు. చదవండి: ఫోన్ మాట్లాడేందుకు కళ్లజోడు.. ఈ కంపెనీనే! -
Facebook: ఫేస్బుక్ కళ్లద్దాలు.. ఇక ఫొటో, వీడియోలు తీయొచ్చు
టెక్ ఏజ్‌లో కొత్త ఆవిష్కరణలకు మస్త్ స్కోప్ ఉంటుండగా.. కంపెనీలే వాటిని ఎక్కువగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఫేస్బుక్ మొట్టమొదటి స్మార్ట్ కళ్లజోడును రిలీజ్ చేసింది. ‘రే బాన్ స్టోరీస్’ పేరుతో వీటి అమ్మకాలను మొదలుపెట్టగా.. ప్రారంభ ధర 299 డాలర్లు(దాదాపు 22 వేల రూపాయలు)గా ఉంది. రే బాన్ స్టోరీస్ స్మార్ట్ కళ్లజోడు.. మొత్తం 20 రకాల కళ్లజోడులు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్బుక్. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనెడా, ఐర్లాండ్, ఇటలీ, యూకేలో వీటి అమ్మకం మొదలైంది. ఆన్‌లైన్‌తో ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఫేస్బుక్ స్మార్ట్ కళ్లద్దాలను అమ్ముతున్నారు. ఫీచర్స్ స్మార్ట్ కళ్లజోడు.. రే-బాన్ బ్రాండ్‌తో కలిసి తయారు చేయించింది ఫేస్బుక్. 5ఎంపీ కెమెరా ఫొటోల కోసం, 30 సెకన్ల వీడియోల్ని రికార్డు చేసేలా ఫీచర్స్ ఉన్నాయి. క్యాప్చరింగ్ బటన్‌తో పాటు ఫేస్బుక్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్ ద్వారా టచ్ చేయకుండానే ఫొటోలు, వీడియోలు తీయొచ్చు. కాల్స్ మాట్లాడొచ్చు. అయితే దొంగచాటుగా ఫొటోలు తీయడం మాత్రం కుదరదు సుమి. ఎందుకంటే దీంట్లో ఇన్‌బిల్ట్‌గా వచ్చే ఎల్ఈడీ లైట్ సెటప్.. క్యాప్చర్ కొట్టగానే ఫ్లాష్ ఇస్తుంది. వాయిస్ కమాండ్‌ను, ఆడియోను రికార్డు చేసేలా మూడు చిన్న మైక్రోఫోన్లు ఉంటాయి. ఫోన్లోని వీడియోలను సైతం వీక్షించేలా కనెక్ట్చేసుకోవచ్చు. అలాగే వీటి ద్వారా తీసే వీడియోలను(షార్ట్) స్మార్ట్ ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. అయితే, పేరుకే స్మార్ట్ కళ్లజోడు అయినప్పటికీ.. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ సపోర్ట్ లేకపోవడం లోటుగా భావిస్తున్నారు. ఆదాయమంతా అటువైపే.. ఫేషియల్ రికగ్నిషన్ లాంటి ఏఐ టూల్స్‌తో వివాదాల్లో నిలుస్తున్న ఫేస్బుక్.. తాజా ప్రొడక్ట్ రే బాన్ స్టోరీస్ విషయంలో ఏఐని వాడకపోవడంపై విమర్శలు మొదలయ్యాయి. ఇక 2020లో 86 బిలియన్ డాలర్ల ఆదాయం వెనకేసుకున్న ఫేస్బుక్.. అందులో చాలా వాటాను అడ్వర్టైజింగ్ ద్వారానే సంపాదించుకుంది. అయితే అందులో చాలా ఆదాయాన్ని తిరిగి వర్చువల్ అండ్ అగుమెంటెడ్ రియాలిటీ(AR), హార్డ్‌వేర్ డెవలపింగ్(ఓక్యూలస్ వీఆర్ హెడ్‌సెట్స్, రిస్ట్బ్యాండ్లు), ఇప్పుడు కళ్లజోడు తయారీకి ఖర్చు చేస్తోంది. ఇక మెటావర్స్(వర్చువల్ ఎన్విరాన్మెంట్) ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ఈ మధ్యే కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఫేస్బుక్ చీకటి దందా ఇదేనా? -
సినిమాను తలపించేలా.. చాయ్‌వాలా కిడ్నాప్
చండీగఢ్ : సినిమాలో మాత్రమే జరిగే కొన్ని సంఘటనలు నిజజీవితంలో కూడా జరుగుతుంటాయి. అలాంటి ఓ వింతైన సంఘటన హరియణా రాష్ట్రంలో జరిగింది. టీ అమ్ముకునే వ్యక్తిని విధి కోటీశ్వరున్ని చేసింది. డబ్బు కోసం అతన్ని కొంతమంది కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాపర్ల అతితెలివి వాళ్లను పోలీసులకు పట్టించింది. సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఛేజింగ్‌లు, తుపాకి బెదిరింపులు.. చివరకు పోలీసులు చాయ్‌వాలాను రక్షించి క్షేమంగా ఇంటికి పంపించేశారు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని మనేసర్‌కు చెందిన హర్పల్ సింగ్ అనే చాయ్‌వాలాకు అదృష్టం కలిసొచ్చింది. అతడికి ఉన్న స్థలాన్ని హర్యానా ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అతనికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిన సంగతి తెలిసిన ఇద్దరు వ్యక్తులు సింగ్‌ను వెంబడించి తుపాకితో చావబాది కిడ్నాప్ చేశారు. అతన్ని ఢిల్లీకి తరలించి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలని భావించారు. కారులో సింగ్‌ను ఎక్కించుకొని ఢిల్లీకి బయలుదేరారు. అతని కాళ్లను తాడుతో కట్టేసి, గన్ను గురిపెట్టి ఏమన్నా చేస్తే చంపుతామని బెదిరించారు. ఇక్కడ కిడ్నాపర్లు చేసిన ఓ పని వారిని పోలీసులకు పట్టుబడేలా చేసింది. సింగ్ కళ్లకు గంతలు కట్టిన వారు అది బయటకు కనిపించకుండా ఉండటానికి సన్‌గ్లాసెస్ అతని కళ్లకు పెట్టారు. కారు ఢిల్లీ-గురుగావ్ సరిహద్దు దగ్గరకు రాగానే అక్కడున్న పోలీసులకు అర్థరాత్రి సన్‌గ్లాసెస్ పెట్టుకోవటం ఏంటని అనుమానం వచ్చింది. అంతే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. కిడ్నాపర్లను మనేసర్‌కు చెందిన జన్మహన్ సింగ్, వతన్ రామ్‌గా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
సన్ గ్లాసెస్‌తో నేరస్తుల పట్టివేత..
బీజింగ్ : దేశంలో నేరాలను తగ్గించడానికి చైనా సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తోంది. సన్‌గ్లాసెస్‌తో నేరస్తులను గుర్తించేలా ఆశ్చర్యం కలిగించే వ్యవస్థను అభివృద్ధి చేసింది. అనుమానితుల ముఖ కవళికలను సన్‌గ్లాసెస్‌తో గుర్తించి వారి పూర్తి వివరాలను తెలుసుకునేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిందితులను గుర్తిస్తుంది ఇలా.. సన్‌గ్లాసెస్‌కు ఉన్న కెమెరా.. స్మార్ట్ ఫోన్ లాంటి పరికరానికి అనుసంధానమై ఉంటుంది. పోలీసులు కెమెరా ద్వారా అనుమానితుల ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలలోని వారి ముఖ కవళికలు ఆటోమేటిక్‌గా హెడ్‌క్వార్టర్స్‌లోని డేటాతో పోల్చుబడతాయి. అలా పోల్చిన తర్వాత వారి పేరు, చిరునామా, జెండర్ వంటి వివరాలు పోలీసులకు చేరుతాయి. ఒకవేళ వారు నేరస్తులయితే ఆ విషయాన్ని డేటాబేస్ పోలీసులకు తెలుపుతుంది. అంతేకాకుండా అనుమానితుల ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేస్తుంది. ఈ అద్దాలను అనుమానితుల వివరాల కోసం, నేరస్తులను గుర్తించడం కోసం పోలీసులకు అందజేశారు. జహెన్గ్యూ నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు వీటిని వినియోగిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ సాంకేతికత ద్వారా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురిని, తప్పుడు ఐడీలు కలిగిన 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనే బ్రెజిల్ ఇలాంటి కళ్లద్దాల ద్వారా నేరస్తులను గుర్తించే సాంకేతికతను తీసుకొచ్చింది. ఈ అద్దాలు ధరించిన పోలీసులు జనాల మధ్యలో తిరుగుతున్న నేరస్తులను ఇట్టే కనిపెడతారు. ఎవరిని చూస్తున్నప్పుడు అద్దాలలో రెడ్ లైట్ వెలుగుతుందో వారు నేరస్తులని తెలిసిపోతుంది. -
జోడు కుదిరింది..!
ఏటా కళ్లజోళ్ల వ్యాపారం రూ. 21 వేల కోట్లు లైఫ్ స్టైల్లో భాగమైన కళ్లద్దాలు యువత, చిన్నారుల భాగస్వామ్యమే ఎక్కువ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో కళ్లజోడు అంటే 60 ఏళ్లపైబడిన వారికి మాత్రమే అవసరమైన వస్తువు. కానీ, నేడది ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల పైబడిన వారికి కూడా నిత్యావసర వస్తువుగా మారింది. ఇంకా చెప్పాలంటే మనిషి జీవితంలో కళ్లద్దాలు భాగమై పోయాయి కూడా. ఎంతలా మారిందంటే ఏటా అక్షరాలా రూ.21 వేల కోట్ల వ్యాపారం జరిగేంతలా. కాంటాక్ట్ లెన్సులు, ఇంట్రాక్యులర్ లెన్సులు, లెన్స్ క్లీనింగ్ సొల్యూషన్స్, ఫ్రేములు, సన్ గ్లాసులు.. వంటి కళ్లజోళ్ల మార్కెట్ దేశవ్యాప్తంగా ఎంతుందనే అంశంపై ఇటీవల అసోచామ్ ఓ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.21 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని సర్వేలో తేలింది. 2015 చివరినాటికి ఇది రూ.43 వేల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సెల్‌ఫోన్, ఏటీఎం, క్రెడిట్ కార్డుల్లాగే కళ్లద్దాలు కూడా నగరవాసుల జేబుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుగా మారింది. నిజం చెప్పాలంటే కాలుష్యం విపరీతంగా ఉండే మెట్రో నగరాల్లో అయితే కళ్లద్దాలు నిత్యావసర వస్తువే. దుమ్ము, ధూళి, గాలి వంటి వాటి నుంచి కళ్లకు రక్షణ కవచంలా ఉంటుండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కళ్లద్దాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ‘‘గతంలో కంటి సమస్యలు తీవ్రమైతే తప్ప ఆసుపత్రులకు వచ్చే వారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో కళ్ల రక్షణ, నేత్రదానం వంటి వాటిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కలిగింది. దీంతో ఏ చిన్నపాటి కంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తున్నార ని’’ సరోజిని దేవీ కంటి ఆసుపత్రి కంటి వైద్యుడు రవీందర్ గౌడ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. మా ఆసుపత్రికి వచ్చే వారిలో చిన్నపిల్లలు 10-20% ఉండగా, యువత 50% ఉంటారని చెప్పారాయన. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కంటి చూపు మందగిస్తుందన్నారు. అందుకే 40 ఏళ్లు దాటి కంటి సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కళ్లద్దాలను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఏటా కళ్లద్దాల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ‘‘ఏటా రూ.2.40 లక్షల వ్యాపారం జరుగుతుండగా.. ఇందులో 40% యువత, 20% చిన్నపిల్లల కళ్లద్దాలను విక్రయిస్తున్నామని’ భైరవ్ ఆప్టికల్స్ ఎండీ కేతన్ చెప్పారు. గతం లో కళ్లద్దాల గ్లాసులను వాటి జీవితకాలంలో రెండు సార్లకు మించి మార్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఏడాదికోమారు మారుస్తున్నారు. ఇందులో యువత అయితే ఏడాదికోసారి, వృద్ధులైతే రెండు మూడేళ్లకోసారి మారుస్తున్నారని చెప్పారు. యువత, పిల్లలే ఎక్కువ..: కళ్లద్దాల వినియోగంలో యువత, చిన్నపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. కంప్యూటర్లు, టీవీల ప్రభావంతో రోజురోజుకూ కళ్లద్దాల వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు మెట్రో నగరాల్లో దుమ్ము, ధూళి వంటి కాలుష్యమూ కారణమవుతోంది. హైదరాబాద్‌లో 2,500లకు పైగానే కళ్లద్దాల దుకాణాలున్నాయి. ఇందులో 30 వేల మందికి పైగానే పనిచేస్తున్నారు. నగరంలో మొత్తం కళ్లద్దాల వ్యాపారంలో 70 శాతం కళ్లద్దాలు అమ్ముడవుతుండగా 30 శాతం కాంటాక్ట్ లెన్స్‌ల వ్యాపారముంటోంది. కాంటాక్ట్ లెన్స్‌ల వినియోగంలో 10-20% యువత ఉంటుందని కేతన్ చెప్పారు. కళ్లజోడుతో పనిలేకుండా కనుగుడ్డుపై సులువుగా అమర్చుకునేవి కాంటాక్ట్ లెన్స్‌లు. వీటిలో రోజుకు, నెలకు, ఏడాదికోమారు మార్చుకునేవీ ఉంటాయి. యువత వీటిపై మక్కువ చూపుతున్నారు. 100 మంది కస్టమర్లలో 15 మంది వీటిని కోరుతున్నారన్నారు. వీటిని వాడుతున్న కస్టమర్ సగటు వయసు 15 ఏళ్లంటే అతిశయోక్తి కాదు. జత రూ.80కే లభిస్తుండటం విశేషం. కళ్లజోళ్ల మార్కెట్‌ను విభాగాల వారీగా చూస్తే సన్‌గ్లాసులు 13%, కాంటాక్ట్ లెన్స్‌లు 4%, ఇంప్లాంటెబుల్ కాంటాక్ట్ లెన్స్ 16%, లసిక్ 5%, ఫ్రేములు 11%, కళ్లద్దాల లెన్స్‌లు 51%గా ఉంటుందన్నారాయన. లెగసీ, రెబాన్, వాక్, పోలిస్, యునెటైడ్ కలర్ బెనటన్, ఐడీ, ఫాస్ట్‌ట్రాక్ వంటి దేశ, విదేశీ బ్రాండ్లు యువతను ఎక్కువగా ఆక ర్షిస్తున్నాయి. ఊరిస్తున్న మార్కెట్... దేశంలో ఏటా కళ్లద్దాల మార్కెట్ 30%, కాంటాక్ట్ లెన్స్ మార్కెట్ 25% వృద్ధి చెందుతోందని అసోచామ్ నివేదిక పేర్కొంది. ఏటా కళ్లద్దాల వ్యాపారం రూ.8,500 కోట్లు, కాం టాక్ట్ లెన్స్‌లు రూ.700 కోట్లు, కళ్లద్దాల లెన్స్‌లు రూ.45 కోట్లు, సన్‌గ్లాసులు రూ. 2,200 కోట్లు, కళ్లద్దాల ఫ్రేములు రూ.5,200 కోట్ల మార్కెట్ జరుగుతుందని అంచనా. రేటెంతైనా ఓకే.. కళ్లద్దాల ఎంపికలో రేటెంతైనా నగరవాసులు లెక్కచేయట్లేదు. కళ్లజోడులో వాడే అద్దాన్ని రెసిలియెన్స్, పాలీకొర్బొనేట్, ట్రైవిక్స్, ప్లాస్టిక్‌తో పాటు గాజుతో తయారుచేస్తారు. వీటి ధర రూ.100 నుంచి లక్షకు పైగానే ఉం టుంది. ఇక ఫ్రేముల్లో హాఫ్, రిమ్లెస్, షెల్ వంటివి ఉన్నాయి. ఆసియా బ్రాండ్లయితే రూ. 500 నుంచి రూ. 10 వేలకు పైన, అంతర్జాతీయ బ్రాండ్లయితే రూ.4 వేల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయి. స్పోర్టీ, ఏవియేటర్, వేవ్ ఫై వెరైటీలతో సన్‌గ్లాసులు రూ.2 లక్షల వరకు లభిస్తున్నాయి. ఇందులో యూవీ ప్రొటెక్టివ్ పోలరైజ్డ్, డే అండ్ నైట్, పవర్ సన్‌గ్లాసెస్ వంటి వెరైటీలున్నాయి.