సన్ గ్లాసెస్‌తో చైనా పోలీసు అధికారిణి
బీజింగ్ : దేశంలో నేరాలను తగ్గించడానికి చైనా సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తోంది. సన్‌గ్లాసెస్‌తో నేరస్తులను గుర్తించేలా ఆశ్చర్యం కలిగించే వ్యవస్థను అభివృద్ధి చేసింది. అనుమానితుల ముఖ కవళికలను సన్‌గ్లాసెస్‌తో గుర్తించి వారి పూర్తి వివరాలను తెలుసుకునేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నిందితులను గుర్తిస్తుంది ఇలా..
సన్‌గ్లాసెస్‌కు ఉన్న కెమెరా.. స్మార్ట్ ఫోన్ లాంటి పరికరానికి అనుసంధానమై ఉంటుంది. పోలీసులు కెమెరా ద్వారా అనుమానితుల ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలలోని వారి ముఖ కవళికలు ఆటోమేటిక్‌గా హెడ్‌క్వార్టర్స్‌లోని డేటాతో పోల్చుబడతాయి. అలా పోల్చిన తర్వాత వారి పేరు, చిరునామా, జెండర్ వంటి వివరాలు పోలీసులకు చేరుతాయి. ఒకవేళ వారు నేరస్తులయితే ఆ విషయాన్ని డేటాబేస్ పోలీసులకు తెలుపుతుంది.
అంతేకాకుండా అనుమానితుల ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేస్తుంది. ఈ అద్దాలను అనుమానితుల వివరాల కోసం, నేరస్తులను గుర్తించడం కోసం పోలీసులకు అందజేశారు. జహెన్‌గ్యూ నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు వీటిని వినియోగిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ సాంకేతికత ద్వారా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురిని, తప్పుడు ఐడీలు కలిగిన 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనే బ్రెజిల్ ఇలాంటి కళ్లద్దాల ద్వారా నేరస్తులను గుర్తించే సాంకేతికతను తీసుకొచ్చింది. ఈ అద్దాలు ధరించిన పోలీసులు జనాల మధ్యలో తిరుగుతున్న నేరస్తులను ఇట్టే కనిపెడతారు. ఎవరిని చూస్తున్నప్పుడు అద్దాలలో రెడ్ లైట్ వెలుగుతుందో వారు నేరస్తులని తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment