టెక్ ఏజ్‌లో కొత్త ఆవిష్కరణలకు మస్త్ స్కోప్ ఉంటుండగా.. కంపెనీలే వాటిని ఎక్కువగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్ మొట్టమొదటి స్మార్ట్ కళ్లజోడును రిలీజ్ చేసింది. ‘రే బాన్ స్టోరీస్’ పేరుతో వీటి అమ్మకాలను మొదలుపెట్టగా.. ప్రారంభ ధర 299 డాలర్లు(దాదాపు 22 వేల రూపాయలు)గా ఉంది.
రే బాన్ స్టోరీస్ స్మార్ట్ కళ్లజోడు.. మొత్తం 20 రకాల కళ్లజోడులు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్‌బుక్. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనెడా, ఐర్లాండ్, ఇటలీ, యూకేలో వీటి అమ్మకం మొదలైంది. ఆన్‌లైన్‌తో ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఫేస్‌బుక్ స్మార్ట్ కళ్లద్దాలను అమ్ముతున్నారు.
ఫీచర్స్
స్మార్ట్ కళ్లజోడు.. రే-బాన్ బ్రాండ్‌తో కలిసి తయారు చేయించింది ఫేస్‌బుక్. 5ఎంపీ కెమెరా ఫొటోల కోసం, 30 సెకన్ల వీడియోల్ని రికార్డు చేసేలా ఫీచర్స్ ఉన్నాయి. క్యాప‍్చరింగ్ బటన్‌తో పాటు ఫేస్‌బుక్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్ ద్వారా టచ్ చేయకుండానే ఫొటోలు, వీడియోలు తీయొచ్చు. కాల్స్ మాట్లాడొచ్చు. అయితే దొంగచాటుగా ఫొటోలు తీయడం మాత్రం కుదరదు సుమి. ఎందుకంటే దీంట్లో ఇన్‌బిల్ట్‌గా వచ్చే ఎల్‌ఈడీ లైట్ సెటప్.. క్యాప్చర్ కొట్టగానే ఫ్లాష్ ఇస్తుంది. వాయిస్ కమాండ్‌ను, ఆడియోను రికార్డు చేసేలా మూడు చిన్న మైక్రోఫోన్‌లు ఉంటాయి. ఫోన్‌లోని వీడియోలను సైతం వీక్షించేలా కనెక్ట్‌చేసుకోవచ్చు. అలాగే వీటి ద్వారా తీసే వీడియోలను(షార్ట్) స్మార్ట్ ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. అయితే, పేరుకే స్మార్ట్ కళ్లజోడు అయినప్పటికీ.. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ సపోర్ట్ లేకపోవడం లోటుగా భావిస్తున్నారు.
ఆదాయమంతా అటువైపే..
ఫేషియల్ రికగ్నిషన్ లాంటి ఏఐ టూల్స్‌తో వివాదాల్లో నిలుస్తున్న ఫేస్‌బుక్.. తాజా ప్రొడక్ట్ రే బాన్ స్టోరీస్ విషయంలో ఏఐని వాడకపోవడంపై విమర్శలు మొదలయ్యాయి. ఇక 2020లో 86 బిలియన్ డాలర్ల ఆదాయం వెనకేసుకున్న ఫేస్‌బుక్.. అందులో చాలా వాటాను అడ్వర్‌టైజింగ్ ద్వారానే సంపాదించుకుంది. అయితే అందులో చాలా ఆదాయాన్ని తిరిగి వర్చువల్ అండ్ అగుమెంటెడ్ రియాలిటీ(AR), హార్డ్‌వేర్ డెవలపింగ్(ఓక్యూలస్ వీఆర్ హెడ్‌సెట్స్, రిస్ట్‌బ్యాండ్‌లు), ఇప్పుడు కళ్లజోడు తయారీకి ఖర్చు చేస్తోంది. ఇక మెటావర్స్(వర్చువల్ ఎన్విరాన్‌మెంట్) ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ఈ మధ్యే కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: ఫేస్‌బుక్ చీకటి దందా ఇదేనా?
Comments
Please login to add a commentAdd a comment