ప్రేమ్జీ ఇన్వెస్ట్ నుంచి లెన్స్కార్ట్కు నిధులు
న్యూఢిల్లీ: రూ.400 కోట్లు సేకరించిన మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే లెన్స్‌కార్ట్ మరోసారి నిధులు సేకరించింది. ఈ సారి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ నుంచి నిధులను రాబట్టింది. అయితే ఎంత మొత్తం అన్నది బయటకు వెల్లడించలేదు. లెన్స్‌కార్ట్ ఆన్‌లైన్ విభాగంలో కళ్లద్దాల స్టోర్స్‌ను నిర్వహించే ప్రముఖ సంస్థ. ఆఫ్‌లైన్ విభాగంలోనూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో స్టోర్స్‌ను నిర్వహిస్తోంది.
తాజా నిధుల సేకరణ ఆన్‌లైన్ ఐవేర్ మార్కెట్లో వృద్ధికి సహకరిస్తుందని లెన్స్‌కార్ట సీఈవో, వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్ ఢిల్లీలో తెలిపారు. రిటైల్ విభాగంలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు ఎంతో అనుభవం ఉందని, ఫ్యాబ్ ఇం డియా తదితర కంపెన్లీలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అనుభవం తమకు ఉపకరిస్తుందన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విభాగంలో మరింత వృద్ధిపై దృష్టి పెడతామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.400కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రూ.500కోట్లకు చేరుకుంటామన్నారు.