సంఘటనాస్థలంలో రెస్క్యూ సిబ్బంది
హిమాచల్ ప్రదేశ్: రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరికొంత మంది బిల్డింగ్‌లో చిక్కుకుపోయారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండీ ప్రాంతంలోని నెర్ చౌక్‌లో జరిగింది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎల్‌పీజీ సిలిండర్ అకస్మాత్తుగా పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండీ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment