
చమురు కంపెనీలు ఎల్‌పీజీ వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు సంస్థలు ఎల్‌పీజీ సిలిండర్ ధరను సవరిస్తాయి. అందులో భాగంగా కొత్త ధరలు నేడు విడుదలయ్యాయి.
జూలైలో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను రూ .30 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా మూడో నెల. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
వాణిజ్య సిలిండర్ల తాజా రేట్లు
దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1676గా ఉండగా నేటి నుంచి రూ.1646కు చేరింది. కోల్‌కతాలో రూ.1756, ముంబైలో రూ.1598, చెన్నైలో కమర్షియల్ ఎల్‌పీజీ ధర రూ.1809.50లకు ఎగిసింది. కాగా డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.803లుగా ఉంది.