సాక్షి ప్రతినిధి, కాకినాడ : కొత్త సంవత్సరం సందర్భంగా గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉపశమనం కల్పిం చింది. సిలిండర్ల ధర తగ్గిస్తూ సోమవారం సాయంత్రం నిర్ణయం తీసుకోవడంతో జిల్లా ప్రజలపై సుమారు రూ. 7 కోట్లకుపైగా సిలిండర్ల భారం తగ్గనుంది. గృహ వినియోగదారుల కన్నా వాణిజ్య వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూర్చింది. గృహ వినియోగదారుల సిలిండర్లపై రూ. 5.90 తగ్గించగా, వాణిజ్య వినియోగ సిలిండర్లపై రూ. 120 తగ్గించింది.
జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు 12 లక్షల 96 వేల 869 ఉన్నాయి. దాదాపు ప్రతి 20 రోజులకోసారి సిలిండర్‌ను విడిపించుకుంటున్నారు. ఈ లెక్కన నెలవారీగా చూస్తే ఒక్క గృహ వినియోగదారులకు రూ. కోటి వరకు ఆదా కానుంది. ఇక వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు 2 లక్షల 92 వేల 871 ఉన్నాయి. తాజాగా సిలిండర్‌పై తగ్గించిన రూ.120తో వాణిజ్య వినియోగదారులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ప్రతినెలా రూ.6 కోట్ల వరకు వారికి భారం తగ్గనుంది. మొత్తంగా జిల్లా ప్రజలపై రూ.7 కోట్లకు పైగా భారం తగ్గనుండడంతో ఇది నూతన వత్సర కానుకగా ప్రజలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment