kerosene price
-
కిరోసిన్ ధరల మంట
సాక్షి, జోగిపేట(అందోల్): ప్రజా పంపిణీ కిరోసిన్ లీటరుపై రూ.1 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధర ఈ నెల నుంచే అమలులోకి వస్తుంది. ఈ నెలలో లీటరుకు రూ.34, అక్టోబర్‌లో రూ.35కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. వీలైనంత వరకు కిరోసిన్ వినియోగాన్ని తగ్గించేలా ప్రభుత్వం తరచూ ఇప్పటికే కట్ చేశారు . ప్రతి నెలా 1.26 లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. ధరలు పెంచడంతో ఆహార భద్రత కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు భారం తప్పడం లేదు. 2016లో కిరోసిన్ ధర లీటర్ రూ.19 ఉండగా, 2017లో రూ.24కు చేరింది. 2018లో రూ.29కు పెంచారు. ప్రస్తుత కోటా వచ్చే సరికి ఏకంగా రూ.34లకు చేరింది. ఈ లెక్కన మూడేళ్లలో రాయితీ కిరోసిన్‌పై లీటరుకు రూ.15 పెంచినట్లయ్యింది. నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై కిరోసిన్‌ను పంపిణీ చేస్తోంది. ఇటీవల దీని వినియోగం భారీగా తగ్గింది. ప్రస్తుతం కిరోసిన్‌పై వంట చేసుకునే వారు చేతివేళ్లపై లెక్క పెట్టే సంఖ్యలోనే ఉన్నారు. గ్రామాల్లో స్నానానికి నీళ్లు వేడి చేసుకునేందుకు కొందరు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ గ్యాస్ పొయ్యిలనే వినియోగిస్తున్నారు. గతంలో కార్డుకు 15 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేసేవారు. ప్రస్తుతం లీటరుకు వచ్చింది. జిల్లాలో నెలకు 1.26 లక్షల లీటర్ల సరఫరా జిల్లాలో 3.70 లక్షల లీటర్లు కిరోసిన్ పంపిణీ చేసేవారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి కిరోసిన్ కోటాను కట్ చేయాలన్న ఉత్తర్వులు రావడంతో వారిని గుర్తించి తొలగించాం. ప్రస్తుతం ప్రతి నెలా 1.26 లక్షల లీటర్ల కిరోసిన్‌ను జిల్లాలో పంపిణీ చేస్తాం. సెప్టెంబర్‌లో రూ. 34కు, అక్టోబర్‌లో రూ.35కు పెంచి విక్రయించాలని ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. గ్యాస్ కనెక్షన్ లేని దీపం కనెక్షన్ ఉన్న 22వేల మందికి కూడా రాయితీ కిరోసిన్ సరఫరా చేస్తాం. – శ్రీకాంత్‌రెడ్డి,డీఎస్ఓ, సంగారెడ్డి -
గ్యాస్, కిరోసిన్ రేట్లు పెరగవు
-
గ్యాస్, కిరోసిన్ రేట్లు పెరగవు
* అలాంటి ప్రతిపాదనేమీ లేదు * ధరల పెంపు కథనాలను ఖండించిన కేంద్రం న్యూఢిల్లీ: వంటగ్యాస్, కిరోసిన్ ధరలను పెంచే యోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 250, లీటర్ కిరోసిన్‌పై 4 రూపాయలు పెంచడానికి చమురు శాఖ కసరత్తు చేస్తోందన్న కథనాలను పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదనలేవీ లేవని తోసిపుచ్చారు. చమురు ఉత్పత్తుల రేట్లు పెంచాలని కిరీట్ పారిఖ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు చమురు శాఖ ఓ నోట్ సిద్ధం చేసిందని, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) అనుమతి కోసం ప్రయత్నిస్తోందని మీడియా కథనాలు వెలువడటంతో కేంద్ర మంత్రి స్పందించారు. గ్యాస్, కిరోసిన్ ధరలు పెంచే యోచన కానీ, డీజిల్ ధరల విధానాన్ని మార్చే ప్రతిపాదన కానీ పెట్రోలియం శాఖ వద్ద లేదని స్పష్టం చేశారు. చమురు ఉత్పత్తుల ధరలు పెంచి రూ. 72 వేల కోట్ల సబ్సిడీని తగ్గించుకోవాలని పారిఖ్ కమిటీ గత అక్టోబర్‌లో నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. రేట్లను పెంచకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో చమురు సంస్థలు దాదాపు రూ. 1.07 లక్షల కోట్ల మేర నష్టాలను మూటగట్టుకుంటాయని, దీన్ని కేంద్రమే భరించాల్సి వస్తుందని కమిటీ తన నివేదికలో హెచ్చరించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సబ్సిడీ భాగం పెరగడంతో మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన దాదాపు వందకుపైగా ఉద్యోగులు తమ ఎల్పీజీ సబ్సిడీ మొత్తాలను వదులుకున్నారని పెట్రోలియం మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. -
సిలిం‘డర్’..
-
ఇక నెలనెలా నెత్తిన ‘బండ’
-
ఇక నెలనెలా నెత్తిన ‘బండ’
గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచే యోచనలో కేంద్రం సిలిండర్‌కు రూ.5, కిరోసిన్ లీటర్‌కు 50-100 పైసల పెంపు! రూ.80 వేల కోట్ల సబ్సిడీ భారం తొలగింపుపై దృష్టి న్యూఢిల్లీ: డీజిల్ తర్వాత ఇప్పుడు ఎల్పీజీ, కిరోసిన్‌ల వంతు. డీజిల్ మాదిరిగానే వంటగ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్ ధరలను స్వల్ప మోతాదుల్లో ప్రతినెలా పెంచే దిశలో కేంద్రం కసరత్తు కొనసాగిస్తోంది. తద్వారా కాలక్రమంలో ఈ రెండు ఇంధనాలకు సంబంధించిన రూ.80 వేల కోట్ల సబ్సిడీ భారాన్ని పూర్తిగా తొలగించుకోవాలని భావిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.5 చొప్పున, కిరోసిన్ ధరను లీటర్‌కు 50 పైసల నుంచి రూపారుు చొప్పున ప్రతినెలా పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. డీజిల్ ధరను ప్రతినెలా 50 పైసల చొప్పున పెంచాలని గత యూపీఏ ప్రభుత్వం 2013 జనవరిలో నిర్ణరుుంచింది. అప్పటినుంచి ఓ రెండుసార్లు మినహా క్రమం తప్పకుండానే డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. దీంతో డీజిల్‌పై సబ్సిడీ భారం లీటర్‌కు కేవలం రూ.1.62కు తగ్గిపోరుుంది. యూపీఏ ప్రభుత్వ నిర్ణయూన్ని కొత్త ప్రభుత్వం సైతం కొనసాగిస్తుండటంతో ఈ భారం కూడా తొలగిపోయే సూచనలు కన్పిస్తున్నారుు. డీజిల్ పద్దతిలోనే ఎల్పీజీ, కిరోసిన్ ధరలను క్రమంగా పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్టు తాజా పరిణామాలపై అవగాహన కలిగిన వర్గాల సమాచారం. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై ప్రస్తుతం రూ.432.71 సబ్సిడీ కొనసాగుతుండగా.. నెలకు రూ.5 పెంపుతో సబ్సిడీ భారం పూర్తిగా తొలగిపోవాలంటే ఏడేళ్లు పట్టవచ్చని అంచనా. ఒకవేళ ప్రభుత్వం కనుక సానుకూలంగా ఉంటే నెలకు రూ.10 చొప్పున పెంచాలనే అభిప్రాయంతోనూ ఇంధన శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కిరోసిన్‌పై ప్రస్తుతం లీటర్‌కు రూ.32.87 చొప్పున సబ్సిడీ ఉంది. నెలకు రూపారుు చొప్పున పెంచుతూ వెళితే సబ్సిడీ భారాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు రెండున్నరేళ్లకు పైగానే పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్‌లపై ఇచ్చే సబ్సిడీ రూ.1,15,548 కోట్లుగా అంచనా. ఇందులో ఎల్పీజీ వాటా రూ.50,324 కోట్లు కాగా, కిరోసిన్ వాటా రూ.29,488 కోట్లుగా ఉంది. బడ్జెట్ నుంచి నేరుగా చేసే నగదు కేటారుుంపులు, ఓఎన్జీసీ వంటి ప్రభుత్వ సంస్థల విరాళాలతో సబ్సిడీ మొత్తాన్ని పూరిస్తారు. -
ఇంటి బడ్జెట్‌ను పెంచనున్న మోడీ ప్రభుత్వం
ఢిల్లీ: రైలు చార్జీలు పెంచిన ఎన్డిఏ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇంటి బడ్జెట్‌ను పెంచనుంది. ఈ విషయంలో కేంద్రం పేదలను కూడా వదిలి పెట్టడంలేదు. మధ్యతరగతి, ధనిక వర్గాలు వారు ఉపయోగించే వంట గ్యాస్ ధరలతోపాటు పేదలు ఉపయోగించే కిరోసిన్ ధరను కూడా పెంచే యోచనలో కేంద్రం ఉంది. కిరోసిన్, గ్యాస్ ధరలు పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వంట గ్యాస్‌కు సిలిండర్‌పై 5 రూపాయలు, కిరోసిన్‌పై లీటర్‌కు ఒక రూపాయి పెరిగే అవకాశం ఉంది. దీంతో అన్ని వర్గాల ఇంటి బడ్జెట్ పెరిగిపోతుంది.