ఇంటి బడ్జెట్ను పెంచనున్న మోడీ ప్రభుత్వం
ఢిల్లీ: రైలు చార్జీలు పెంచిన ఎన్డిఏ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇంటి బడ్జెట్ను పెంచనుంది. ఈ విషయంలో కేంద్రం పేదలను కూడా వదిలి పెట్టడంలేదు. మధ్యతరగతి, ధనిక వర్గాలు వారు ఉపయోగించే వంట గ్యాస్ ధరలతోపాటు పేదలు ఉపయోగించే కిరోసిన్ ధరను కూడా పెంచే యోచనలో కేంద్రం ఉంది.
కిరోసిన్, గ్యాస్ ధరలు పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వంట గ్యాస్కు సిలిండర్‌పై 5 రూపాయలు, కిరోసిన్‌పై లీటర్కు ఒక రూపాయి పెరిగే అవకాశం ఉంది. దీంతో అన్ని వర్గాల ఇంటి బడ్జెట్ పెరిగిపోతుంది.