మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: వంటగ్యాస్‌ను కొనుగోలు చేయాలంటేనే విని యోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సబ్సిడీ లే కుండా వంటగ్యాస్ సిలిండర్‌కు ఇక నుంచి రూ.1060 చె ల్లిస్తే నగదు బదిలీ కింద ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.625 వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమచేస్తుం దని అధికారులు ఊదరగొట్టారు. తీరా బ్యాంకుకు వెళ్లి సబ్సిడీ జమకాకపోవడం చూసి దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ఈనెల 1వ తేదీ నుంచి జిల్లాలో గ్యాస్ సిలిండర్ కు నగదు బదిలీ పథకం అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇప్పటికే ఆధార్‌కార్డులు జత చేసి ఇచ్చిన వినియోగదారులు సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద బుక్ చేసుకున్న 24 గంట ల్లోపు సబ్సిడీ మొత్తాన్ని రూ.625 బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని కూడా చెప్పారు. జిల్లాలో 4,32,713 మంది వినియోగదారులు హెచ్‌పీ, భారత్, ఇండే న్ గ్యాస్‌ను వాడుతున్నారు. ఇప్పటివరకు 15,210 మంది వినియోగదారులు గ్యాస్ కోసం బుక్‌చేసుకుని సిలిండర్లు తీసుకుని ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క వినియోగదారునికి కూడా బ్యాంకు ఖాతాలో సబ్సిడీ మొత్తం జమకాలేదు.
జిల్లాలో గ్యాస్ వినియోగదారులు
1,73,512 మంది హెచ్‌పీ గ్యాస్ వినియోగదారుల్లో 9238 మంది ఆధార్ కార్డులు సమర్పించారు. వీరిలో 4500 మంది గ్యాస్ కోసం బుక్ చేసుకుని రూ.1060 నగదు చెల్లించి సిలిండర్లు తీసుకున్నా సబ్సిడీ మొత్తం మాత్రం ఇవ్వలేదు.
1,40,164 మంది భారత్ గ్యాస్ వినియోగదారులు ఉండగా వీరిలో ఇప్పటివరకు 16,427 మంది ఆధార్ కార్డుకు సంబంధించిన ధ్రువపత్రాలను ఏజెన్సీల నిర్వాహకులకు ఇచ్చారు. వీరిలో 9,560 మంది గ్యాస్‌కోసం బుక్ చేసుకుని సిలిండర్లు తీసుకున్నా ఒక్కరికి కూడా నగదు బదిలీ పథకం వర్తించలేదు.
జిల్లాలో 1,19,037 మంది ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటివరకు 4,226 మంది ఆధార్ కార్డులు ఇచ్చారు. వీరిలో 1,150 మంది గ్యాస్ కోసం బుకింగ్ చేసుకుని గ్యాస్ తీసుకున్నా ఏ ఒక్కరికి కూడా సబ్సిడీ మొత్తం వారి బ్యాంక్ ఖాతాల్లో జమకాలేదు.
వినియోగదారుల్లో అయోమయం
నగదు బదిలీ పథకం అమలు గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీ మొత్తం ఎప్పుడొస్తుందోనని వినియోగదారులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. నగదు బదిలీ పథకం కింద ప్రభుత్వ సబ్సిడీ అటుంచింతే జిల్లాలో ఉన్న 4,32,713 మంది గ్యాస్ వినియోగదారులపై రూ.3.36కోట్ల భారం పడనుంది.
ఏడాదికి తొమ్మిది సిలిండర్ల వరకు సబ్సిడీ ఇస్తామని ఆ తర్వాత వినియోగదారుడు ఎన్ని సిలిండర్లు వాడినా సబ్సిడీ వర్తించదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చి ఐదు రోజులు గడిచినా ఏ ఒక్క వినియోగదారునికి కూడా సబ్సిడీ మొత్తం అకౌంట్‌లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీలను అడిగితే తమకు ఏమాత్రం సంబంధం లేదని ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.
నవ్వులపాలు!
Published Wed, Nov 6 2013 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement