
నీటితో వంటగ్యాస్!
ఎస్‌ఈఆర్‌ఐ ఉత్పాదన
సాక్షి, బెంగళూరు : నీరు, నూనె ప్రధాన ముడిపదార్థాలుగా వంటగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి అనువైన యంత్రాన్ని బెంగళూరులోని ప్రముఖ పరిశోధన సంస్థ స్కాలైన్ ఎనర్సీ రీసెర్‌చ ఇనిస్టిట్యూట్ (ఎస్‌ఈఆర్‌ఐ) కనుగొనింది. హైడ్రో డిసైడర్‌గా వ్యవహరించే ఈ యంత్రం వివరాలను ఆ సంస్థ చైర్మన్ రాజా విజయ్‌కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ యంత్రంలో వంట గ్యాస్ ఉత్పత్తి అయ్యేందుకు నీరు, సూర్యరశ్మి (శక్తి జనకం), నూనె (ఆర్గానిక్ కార్బన్ దాత), పెల్లాడియం, ప్లాటినమ్ (సూపర్ క్యాటలిస్ట్ - ఉత్ప్రేరికాలు) అవసరం. తొలుత పెల్లాడియం, ప్లాటినమ్ కోటింగ్ గల నికెల్ పాత్రలోకి మూడు లీటర్ల నీరు, 500 గ్రాముల నూనెను పంపిస్తారు. అంతకు ముందు ఈ పాత్ర సూర్యరశ్మి ద్వారా వేడెక్కి ఉంటుంది. పాత్రలోకి వెళ్లిన ద్రావణాల్లో తొలుత నీరు నెసెంట్ హైడ్రోజన్, అటామిక్ ఆక్సిజన్‌గా విడిపోతుంది.
ఈ రెండు వాయువుల్లో అటామిక్ ఆక్సిజన్ నూనెలోని పదార్థాల బంధానాలను విడగొట్టి కర్బన వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ఇవి నెసెంట్ హైడ్రోజన్‌తో కలిసి సుమారు 15 కిలోల బరువైన హైడ్రోకార్బన్ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉత్పత్తైన ఆర్గానిక్ పెట్రోలియం వాయువు(ఓపీజీ)లను ప్రత్యేక కంటైనర్‌లో నిల్వ చేస్తారు. రసాయనికంగా ఎల్‌పీజీకు ఓపీజీకు ఎలాంటి తేడా ఉండదు. అంతేకాక ఓపీజీ ద్వారా ఎక్కువ వేడి ఉంటుంది. ప్రస్తుత హైడ్రో డిసెండర్ ధర రూ. 75 వేలుగా ఉందని, ఉత్పత్తి మొదలైన తర్వాత రూ. 35 వేల నుంచి రూ. 40 వేలకు ధర తగ్గవచ్చునని ఈ సందర్భంగా విజయ్‌కుమార్ తెలిపారు.