వరంగల్, న్యూస్‌లైన్
వంట గ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చారుు. చమురు సంస్థలు ఒక్కసారిగా తమ ప్రతాపం చూపించారుు. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.66.50 వడ్డించారుు. ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ) ప్రారంభమైనప్పటి నుంచి మధ్యలో ఒకటి, రెండు నెలలు తప్ప... ప్రతి నెలా సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. డీబీటీ అమలు ప్రారంభంలో రూ.854.50 ఉన్న సిలిండర్ మార్కెట్ ధర ప్రస్తుతం రూ.1104.50కు పెరిగింది. తగ్గినట్టే తగ్గిన వంట గ్యాస్ ధర.. ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.
ఆధార్ గజిబిజి
ఆధార్ అనుసంధానం నేపథ్యంలో గ్యాస్ ధర గజిబిజిగా మారింది. ఆధార్‌తో లింక్ చేసుకున్నవారి ఖాతాలో ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు ఇస్తున్న సబ్సిడీ రూ.21.50 జమచేయకపోవడం... ఆధార్‌తో లింక్ కానివారికి అవి జమ అవుతుండడంతో ధరల్లో వ్యత్యాసం నెలకొంది. ఆధార్ అనుసంధామైన వారికి ఒక్కో సిలిండర్‌కు రూ. 88 చొప్పున ... ఆధార్ అనుసంధానం కాని వారికి రూ.66.50 భారం పడుతోంది.
ఆధార్ అనుసంధానమైతే...
జిల్లాలో మొత్తం 5,48,997 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా... ఆధార్‌తో అనుసంధానమైన వారు 3,10,660 మంది ఉన్నా రు. ఈ లెక్కన ఒక్కో సిలిండర్‌పై చమురు సంస్థలు తాజాగా వడ్డించిన మొత్తం రూ. 2,06,58,890. ప్రభుత్వం ఎగ్గొడుతున్న సబ్సి డీ సుమారు రూ.66,79,190. అంటే అదనపు భారం పడుతున్న మొత్తం రూ.2,73,38,080.
ఆధార్ అనుసంధానం కాని వారికి...
ఆధార్‌తో లింక్ లేని వారికి ఒక్కో సిలిండర్‌పై ప్రభుత్వం తాజాగా పెంచిన రూ.66.50 మాత్రమే పడుతోంది. ఈ లెక్కన 2,38,337 మందిపై రూ.1,58,49,410.50 భారం పడుతున్నట్లు అంచనా.
తాజాలెక్కల ప్రకారం...
పెరిగిన ధర ప్రకారం ఒక్కో సిలిండర్‌కు రూ.1104.50 పలుకుతోంది. ఆధార్ ఉన్న వినియోగదారుడి ఖాతాలో ప్రభుత్వం రూ.603 జమచేస్తోంది. మిగిలిన రూ.501.50లను వినియోగదారుడు చెల్లిస్తున్నాడు. అదే.. ఆధార్ లేని వ్యక్తి రూ.482 మాత్రమే చెల్లిస్తున్నారు.
నెలలవారీగా....
సెప్టెంబర్ : ఈ నెలలో ఒక్క సిలిండర్ ధర రూ. 1,000కి చేరింది. వినియోగదారుడి ఖాతాలో ప్రభుత్వం రూ. 587 జమ చేయూల్సి ఉండగా... రూ. 534.50 మాత్రమే చేసింది. లెక్కప్రకారం వినియోగదారుడు సిలిండర్‌కు రూ.413.50 చెల్లించాలి. కానీ.. సర్కారు జమచేయకుండా ఉన్న రూ.52.50లతో కలుపుకుని మొత్తం రూ.466లను గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుడి నుంచి వసూలు చేశారుు.
అక్టోబర్ : సిలిండర్ ధర కాస్తా రూ.1,090 చేరింది. ఈ లెక్క న ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో రూ.676.5 జమచే యూలి. కానీ రూ.603 మాత్రమే జమచేసింది. ఈ మేరకు ఒక్కోసిలిండర్‌పై వినియోగదారుడికి 73.5భారం పడిం ది.
నవంబర్ : ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.52 తగ్గగా... ధర రూ.1,038కు చేరింది. ఈ లెక్కన ప్రభుత్వం రూ.624.5లను వినియోగదారుడి ఖాతాల్లో జమ చేయూలి. కానీ రూ. 551 మాత్రమే జమ చేసింది. ఈ మేరకు ఒక్కో సిలిండర్‌పై రూ.73.5 మేర భారం పడింది.
గుది‘బండ’
Published Fri, Dec 6 2013 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement