న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ కింద వంట గ్యాస్ సిలిండర్లపై రాయితీని మరో రూ.100 పెంచాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. దీంతో ఒక్కో సిలిండర్‌పై మొత్తం రాయితీకి రూ. 300కు చేరుకుంది. ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచి్చన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా 12 రాయితీ సిలిండర్లు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ (14.2 కిలోలు)పై రూ.200 చొప్పున కేంద్రం రాయితీ ఇస్తోంది.
ఈ రాయితీని మరో రూ.100 పెంచినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 9.6 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలియజేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రస్తుతం ఒక్కో సిలిండర్ కోసం రూ.703 ఖర్చు చేస్తున్నారు. ఇకపై రూ.603 చొప్పున వెచి్చంచాల్సి ఉంటుంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తాము అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఉజ్వల యోజన లబి్ధదారులకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మరో రూ.100 పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment