పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆదోనిలో నిరసన చేపట్టారు.
ఆదోని టౌన్, న్యూస్‌లైన్: పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆదోనిలో నిరసన చేపట్టారు. రోడ్డుపైనే వంట చేసి విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. పార్టీ నియోజకవర్గ నాయకుడు సాయిప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో మహిళా విభాగం జిల్లా నాయకురాళ్లు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి కట్టెలు, కుండలను నెత్తిన పెట్టుకొని పురవీధుల్లో ర్యాలీ చేశారు. భీమాస్ సర్కిల్ చేరుకొని రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, పట్టణ కన్వీనర్ చంద్రకాంత్‌రెడ్డి, మహిళా విభాగం నాయకురాళ్లు శ్రీదేవి, జిలేఖ మాట్లాడారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. వంటగ్యాస్‌పై పెరిగిన భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అడహక్ కమిటీ సభ్యులు ప్రసాదరావు, మునిస్వామి, అబ్దుల్ ఖాదర్, మండల కన్వీనర్ విశ్వనాథ్ గౌడ్, యువజన సంఘం నాయకులు వెంకటేశ్వరరెడ్డి, నగరూరు చంద్రశేఖర్ రెడ్డి, బుద్దారెడ్డి, సన్ని, ఫయాజ్ అహ్మద్, సాయిరామ్, చిన్న ఈరన్న, అక్బర్, మైనార్టీ నాయకులు ఎజాజ్, చాంద్‌బాషా, నజీర్ అహ్మద్, బ్రహ్మయ్య, సత్య, సుధాకర్, ఈరన్న, తిమ్మప్ప, నరసింహులు, వేణు, మునిస్వామి, పట్టణ మహిళలు ఈరమ్మ, నరసమ్మ, అన్నపూర్ణమ్మ, రేణుకా, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు.