పండుగల సందర్భంగా పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ ఏర్పడింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణించిన అమ్మకాలు నవంబర్‌లో తిరిగి పుంజుకున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల (ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) గణాంకాల ప్రకారం పెట్రోల్ విక్రయాలు నవంబర్‌లో 8.3 శాతం పెరిగి 3.1 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.86 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 5.9 శాతం పెరిగి 7.2 మిలియన్ టన్నులకు చేరాయి.
వర్షాల సీజన్‌లో వాహనాల కదలికలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ క్షీణిస్తుంటుంది. అదే కాలంలో వ్యవసాయ రంగం నుంచి డీజిల్ డిమాండ్ తగ్గుతుంది. ఇక అక్టోబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే.. నవంబర్‌లో 4.7 శాతం అధికంగా 2.96 మిలియన్ టన్నులు మేర పెట్రోల్ విక్రయాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. పెట్రోలియం ఇంధన విక్రయాల్లో 40 శాతం వాటా డీజిల్ రూపంలోనే ఉంటుంది. వాణిజ్య వాహనాలు, వ్యవసాయ రంగంలో వినియోగించే పనిముట్లకు డీజిల్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా రవాణా రంగమే 70 శాతం డీజిల్‌ను వినియోగిస్తుంటుంది.
ఇదీ చదవండి: ఇక ఉబర్‌లో ‘శికారా’ల బుకింగ్!
విమానాల ఇంధనం
జెట్ ఫ్యూయల్ (విమానాల ఇంధనం/ఏటీఎఫ్) అమ్మకాలు 3.6 శాతం పెరిగి 6,50,900 టన్నులుగా ఉన్నాయి. ఏటీఎఫ్ డిమాండ్ కరోనా పూర్వపు స్థాయిని దాటిపోయింది. వంటగ్యాస్ (ఎల్‌పీజీ) అమ్మకాలు 7.3 శాతం పెరిగాయి. 2.76 మిలియన్ టన్నులుగా నమోదైంది. అంతకుముందు నెల అక్టోబర్‌లో 2.76 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment