రైతులపై మధ్యంతర బడ్జెట్ వరాల జల్లు కురిపించింది. పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
చిన్న రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని చెప్పారు. ఈ పథకం కోసం 76 వేల కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. మూడు వాయిదాల్లో డబ్బు లబ్ధిదారులకు చేరుతుందన్నారు.