నగదు బదిలీలో మోసం!
పెదకళ్లేపల్లి(మోపిదేవి): నిత్యావసర సరుకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీల వల్ల లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని గుమ్మడి నాగేశ్వరావు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పెదకళ్లేపల్లి షాపు నెంబర్ 22లో ఈ నెలలో తీసుకున్న రేషన్ సరుకులకు ఈ–పోస్ మిషన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపినట్లు తెలి పారు. డీలర్ ఎకౌంట్లో నగదు పడలేదని చెప్పి సరుకులు ఇవ్వలేదని చెప్పారు.
స్థానిక ఇండియన్ బ్యాంకుకు వెళ్లి పరి శీలించగా తన ఎకౌంట్ నుంచి నగదు బదిలీ అయినట్లు వస్తుందని వాపోయారు. ఇదే గ్రామానికి చెందిన చవాకుల వనజాక్షమ్మ 35 కిలోల బియ్యం, అర కిలో పంచదార తీసుకోగా రూపే కార్డు నుంచి రూ. 150 డీలర్ ఎకౌంట్‌కు జమ అయినట్లు తెలిపింది. రూపే కార్డుల బడ్వాడాపై అధికారులకే అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు నష్ట పోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను అధికారులు పరిష్కరించి లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.