నగదు రహితంగా లావాదేవీలు
► పెట్టుబడి నిధిని గ్రూపు సభ్యులు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు
►డీఆర్‌డీఏ పీడీ ఎం.ఎస్.మురళి
ఒంగోలు సెంట్రల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రూపు సభ్యుల, ఇతర లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరగాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఎంఎస్.మురళి అన్నారు. స్థానిక టెక్నికల్ అండ్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో గురువారం ఇంటర్నెట్ సాధీలకు, గ్రామ సంఘాలకు నగదు రహిత లావాదేవీలపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ గ్రూపు సభ్యులు తమ రోజువారీ కార్యకలాపాలకు మొబైల్ బ్యాకింగ్, నెట్ బ్యాంకింగ్, రూపే డెబిట్ కార్డు స్వైపింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్నారు. గ్రూపు బ్యాంకు ఖాతాలో ఉన్న పెట్టుబడి నిధిని సభ్యులు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి మార్చుకుని వాడుకోవచ్చన్నారు. అరుుతే మళ్లీ తిరిగి ఖాతాకు నగదు జమచేయాలని చెప్పారు. గ్రూపుల్లో రూ.30 వేల వరకు జమరుు ఉంటాయన్నారు.
ఒక్కొక్కరూ రూ.3 వేల వరకు నగదును తమ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకుని వాడుకోవచ్చని తెలిపారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల వినియోగదారులకు రూపే డెబిట్ కార్డులను అందజేశారన్నారు. రూపే డెబిట్‌కార్డు ద్వారా కూడా తమ నగదు లావాదేవీలు నిర్వహించుకోవాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేసే పెన్షన్ కూడా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని చెప్పారు. శిక్షణ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎన్.పోలప్ప, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ నరశింహారావు, జెడ్పీ సీఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.