ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా’(bob)లో స్కాం కలకలం రేపింది. పలు బ్రాంచీలలో పనిచేస్తున్న ఉద్యోగులే కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లకు సంబంధం లేని మొబైల్ నంబర్‌లతో లింక్ చేసి, వాటి సాయంతో బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ‘బాబ్ వరల్డ్’ లో లాగిన్ అయ్యారు. అనంతరం, ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ ఏడాది జులైలో అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా పలు నివేదికల్ని వెలుగులోకి తెచ్చింది. తాజాగా, జరిపిన బ్యాంక్ ఇంట్రర్నల్ ఆడిట్‌లో కుంభకోణం జరిగింది నిజమేనని తేలింది. ఆర్‌బీఐ సైతం చర్యలకు ఉపక్రమించింది.
అసలేం జరిగింది?
బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ఇతర బ్యాంకింగ్ యాప్‌ల మాదిరిగానే, కస్టమర్‌లకు లోన్ సదుపాయం, సేవింగ్స్, పెట్టుబడులు, పేమెంట్స్, బస్, హోటళ్ల బుకింగ్ వంటి వివిధ డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తుంది. దీన్ని ఆసరగా చేసుకుని బ్యాంక్ ఉద్యోగులే తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన బ్యాంక్ ఉద్యోగులు
నివేదిక ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులే కస్టమర్లకు తెలియకుండా ఫోన్ నెంబర్లు లేని అకౌంట్లను గుర్తించారు. కస్టమర్ల ఫోన్ నెంబర్ల స్థానంలో బ్యాంక్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల నెంబర్లను జత చేశారు. దీంతో బ్యాంక్ అసలైన ఖాతాదారులకు తెలియకుండా వారి మొబైల్ యాప్స్‌లలో లాగిన్ అయ్యారు. అకౌంట్‌లలో ఉన్న నిధుల్ని కాజేశారు. ఈ వ్యవహారంలో కస్టమర్లు భారీ ఎత్తున నష్టపోయారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖండించింది. ఆ తర్వాత వరుస ఫిర్యాదులతో ఆర్‌బీఐ సైతం అప్రమత్తమైంది. బీవోబీలో అంతర్గత విచారణ చేపట్టడంతో తీగ లాగడంతో డొంకంతా కదలడంతో స్కాం జరిగినట్లు తేలింది.
ఉద్యోగుల సస్పెండ్
ఈ స్కామ్‌లో సంబంధం ఉన్న 60 మంది ఉద్యోగులకు సస్పెన్షన్ విధించింది. దీంట్లో గుజరాత్ వడోదరా, భోపాల్, బరోడా, రాజస్థాన్ నుంచి విధులు నిర్వహిస్తున్న 11 మంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఉన్నారు. వీరందరిని ఆర్‌బీఐ సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో నిజాలు వెలుగులోకి వస్తే వారి శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం.
రంగంలోకి ఆర్‌బీఐ
బ్యాంక్ ఉద్యోగులు చేసిన మోసంతో ఆర్‌బీఐ యాప్‌లోని లోపాల్ని సరిదిద్దుతుంది. కొత్త కస్టమర్లు యాప్‌లో లాగిన్ అవ్వకుండా నిషేధించింది. యాప్‌లోని సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాతనే కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు నెట్ బ్యాంక్‌లో లాగిన్ అయ్యే అవకాశం కలగనుంది.
చదవండి👉 మెక్రోసాఫ్ట్ శాలరీ లీక్, ఏడాది జీతం కోసం..మనమైతే జీవితాంతం కష్టపడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment