Net Banking
-
అతిపెద్ద బ్యాంక్ ఆన్లైన్ సేవలు రెండు రోజులు బంద్!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆన్లైన్ సేవలు ఈ నెలలో రెండు వేర్వేరు తేదీల్లో కొన్ని గంటలపాటు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ మరోసారి మెయింటెనెన్స్ షెడ్యూల్ ను ప్రకటించడంతో పలు కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.(అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!)హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్లో అధికారిక ప్రకటన ప్రకారం.. బ్యాంక్ తన ప్లాట్‌ఫామ్‌లను జూన్ నెలలో రెండు వేర్వేరు తేదీలలో అప్‌గ్రేడ్ చేయనుంది. దటి షెడ్యూల్ మెయింటెనెన్స్ జూన్ 9న తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది. రెండో మెయింటెనెన్స్ జూన్ 16న ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు నాలుగు గంటల పాటు ఉంటుంది. ఈ కాలంలో పలు సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.ప్రభావితమయ్యే సేవలు ఇవే..» ఖాతా సంబంధిత సేవలు» డిపాజిట్లు» నిధుల బదిలీలు (ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్)» అకౌంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్స్» ఎక్స్టర్నల్/మర్చంట్ చెల్లింపు సేవలు» ఇన్స్టాంట్ అకౌంట్ ఓపెనింగ్» యూపీఐ చెల్లింపులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత మే 25న కూడా బ్యాంక్ నిర్వహణ కార్యకలాపాల కోసం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐతో సహా చాలా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ మెయింటెనెన్స్‌తో పాటు యూపీఐ లావాదేవీల ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్‌లోనూ బ్యాంక్ మార్పులు చేసింది. జూన్ 25 నుంచి రూ .100 కంటే తక్కువ విలువ యూపీఐ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్‌లను బ్యాంక్ కస్టమర్లకు పంపదు. అయితే రూ.100, అంతకంటే ఎక్కువ విలువ యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కొనసాగుతాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్: రేపు ఆన్లైన్ సేవలన్నీ బంద్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఈ బ్యాంక్ కస్టమర్లు మే 25వ తేదీ శనివారం తెల్లవారు జామున నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది.బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా మే 25 ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో అకౌంట్స్, డిపాజిట్లు, నిధుల బదిలీలు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, విత్ ఇన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు), ఆన్లైన్ చెల్లింపు, తదితర లావాదేవీలు అందుబాటులో ఉండవు.మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవల అంతరాయం గురించి కస్టమర్లకు ఎస్ఎంఎస్ కూడా పంపింది. పేర్కొన్న సమయంలో వినియోగదారులు డబ్బును డిపాజిట్ చేయలేరు. నిధులను బదిలీ చేయలేరు. యూపీఐ లావాదేవీలతో సహా ఎటువంటి ఆన్లైన్ చెల్లింపులు చేయలేరు. -
ఖాతాదారులకు అలెర్ట్ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్కాం కలకలం!
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా’(bob)లో స్కాం కలకలం రేపింది. పలు బ్రాంచీలలో పనిచేస్తున్న ఉద్యోగులే కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లకు సంబంధం లేని మొబైల్ నంబర్లతో లింక్ చేసి, వాటి సాయంతో బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ‘బాబ్ వరల్డ్’ లో లాగిన్ అయ్యారు. అనంతరం, ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ ఏడాది జులైలో అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా పలు నివేదికల్ని వెలుగులోకి తెచ్చింది. తాజాగా, జరిపిన బ్యాంక్ ఇంట్రర్నల్ ఆడిట్లో కుంభకోణం జరిగింది నిజమేనని తేలింది. ఆర్బీఐ సైతం చర్యలకు ఉపక్రమించింది. అసలేం జరిగింది? బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ఇతర బ్యాంకింగ్ యాప్‌ల మాదిరిగానే, కస్టమర్లకు లోన్ సదుపాయం, సేవింగ్స్, పెట్టుబడులు, పేమెంట్స్, బస్, హోటళ్ల బుకింగ్ వంటి వివిధ డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తుంది. దీన్ని ఆసరగా చేసుకుని బ్యాంక్ ఉద్యోగులే తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన బ్యాంక్ ఉద్యోగులు నివేదిక ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులే కస్టమర్లకు తెలియకుండా ఫోన్ నెంబర్లు లేని అకౌంట్లను గుర్తించారు. కస్టమర్ల ఫోన్ నెంబర్ల స్థానంలో బ్యాంక్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల నెంబర్లను జత చేశారు. దీంతో బ్యాంక్ అసలైన ఖాతాదారులకు తెలియకుండా వారి మొబైల్ యాప్స్‌లలో లాగిన్ అయ్యారు. అకౌంట్లలో ఉన్న నిధుల్ని కాజేశారు. ఈ వ్యవహారంలో కస్టమర్లు భారీ ఎత్తున నష్టపోయారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖండించింది. ఆ తర్వాత వరుస ఫిర్యాదులతో ఆర్బీఐ సైతం అప్రమత్తమైంది. బీవోబీలో అంతర్గత విచారణ చేపట్టడంతో తీగ లాగడంతో డొంకంతా కదలడంతో స్కాం జరిగినట్లు తేలింది. ఉద్యోగుల సస్పెండ్ ఈ స్కామ్‌లో సంబంధం ఉన్న 60 మంది ఉద్యోగులకు సస్పెన్షన్ విధించింది. దీంట్లో గుజరాత్ వడోదరా, భోపాల్, బరోడా, రాజస్థాన్ నుంచి విధులు నిర్వహిస్తున్న 11 మంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఉన్నారు. వీరందరిని ఆర్బీఐ సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో నిజాలు వెలుగులోకి వస్తే వారి శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం. రంగంలోకి ఆర్బీఐ బ్యాంక్ ఉద్యోగులు చేసిన మోసంతో ఆర్బీఐ యాప్‌లోని లోపాల్ని సరిదిద్దుతుంది. కొత్త కస్టమర్లు యాప్‌లో లాగిన్ అవ్వకుండా నిషేధించింది. యాప్‌లోని సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాతనే కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు నెట్ బ్యాంక్‌లో లాగిన్ అయ్యే అవకాశం కలగనుంది. చదవండి👉 మెక్రోసాఫ్ట్ శాలరీ లీక్, ఏడాది జీతం కోసం..మనమైతే జీవితాంతం కష్టపడాల్సిందే! -
ఎస్బీఐ సేవల్లో అంతరాయం.. సర్వర్ డౌనా? సైబర్ అటాకా?
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో లావాదేవీలు జరక్క ఇబ్బంది పడుతున్న ఖాతాదారులకు సోమవారం రోజు (3-4-2023) సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, యోనో యాప్ పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌ల్లో తాము చేయాల్సిన లావాదేవీలు ఆగిపోయాయని వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఖాతాదారులు ట్విటర్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్య మార్చి 31 నుంచి కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈరోజు 4వ రోజు. మార్చి 31 నుంచి ఎస్బీఐ బ్యాంక్ సైట్/ యాప్స్ పనిచేయడం లేదు. డౌన్ అయ్యాయి. సైబర్ అటాక్ జరిగిందా? లేదంటే బ్యాంకుల్లో సాధారణంగా జరిగే సర్వర్ సమస్యలా? అనే దానిపై సమాధానం చెప్పాలని, లేదంటే వినియోగదారులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ట్వీట్లలో పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్బీఐ సర్వర్ల పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా సేవల్లో తలెత్తే అంతరాయాల్ని వెలుగులోకి తెచ్చే డౌన్ డిటెక్టర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ రోజు ఉదయం 9.19 గంటల నుంచి ఎస్బీఐ సేవల్లో లోపాలు తలెత్తినట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. Second working day of the new financial year and the SBI website is down. @TheOfficialSBI @RBI pic.twitter.com/mpRVH5ESBb — Gaurav Dutta (@dgaurav7) April 3, 2023 I hope @TheOfficialSBI you have money and we are just facing a technical glitch from last 10 days. "NET BANKING IS NOT WORKING"#SBIDOWN — Harsh Patel (@hiharsh07) April 3, 2023 I hope @TheOfficialSBI you have money and we are just facing a technical glitch from last 10 days. "NET BANKING IS NOT WORKING"#SBIDOWN — Harsh Patel (@hiharsh07) April 3, 2023 -
ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్ సేవల్ని పొందండి!
SBI Whatsapp Banking Services: ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఖాతాదారులు బ్యాంక్‌కు వచ్చే అవసరం లేకుండా కొన్ని సర్వీసుల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కస్టమర్లు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఏటీఎం సెంటర్‌కు వెళ్లే అవసరం కూడా లేదని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. యువర్ బ్యాంక్ ఈజ్ నౌ ఆన్ వాట్సాప్. బ్యాంక్ బ్యాలెన్స్, మినిస్టేట్మెంట్ వాట్సాప్‌లో పొందండి అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. అంతేకాదు వాట్సాప్‌లో ఎస్బీఐ సేవలు పొందాలనుకుంటే కస్టమర్లు ఇంగ్లీష్‌లో 'హాయ్' అని టైప్ చేసి 9022690226 నెంబర్‌కు మెసేజ్ చేయాలని తెలిపింది. Your bank is now on WhatsApp. Get to know your Account Balance and view Mini Statement on the go.#WhatsAppBanking #SBI #WhatsApp #AmritMahotsav #BhimSBIPay pic.twitter.com/5lVlK68GoP — State Bank of India (@TheOfficialSBI) July 19, 2022 వాట్సాప్‌లో ఎస్బీఐ సేవలు స్టెప్1: ముందుగా మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్‌కు యాడ్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఎస్బీఐ సేవలు వాట్సాప్‌లో పొందాలంటే.. అందుకు మీరు కొన్ని పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంక్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 917208933148కు WAREG(కేపిటల్ లెటర్స్) అని టైప్ చేసి అకౌంట్ నెంబర్ ఎస్ఎంఎస్ చేయండి. స్టెప్ 2: మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 919022690226 నంబర్‌పై 'హాయ్' SBI అని టైప్ చేయండి లేదా "ప్రియమైన కస్టమర్, మీరు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం విజయవంతంగా నమోదు చేసుకున్నారు" అని వాట్సాప్‌లో మీకు వచ్చిన మెసేజ్‌కు రిప్లయి ఇవ్వండి. స్టెప్ 3: మీరు వాట్సాప్ పైన పేర్కొన్న నెంబర్‌కు రిప్లయి ఇస్తే ఇలా మెసేజ్ వస్తుంది. ప్రియమైన వినియోగదారులారా,ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం! 1. బ్యాంక్ బ్యాలెన్స్ 2. మినీ స్టేట్మెంట్ 3. వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేసుకోండి స్టెప్ 4: మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి లేదా మీ చివరి ఐదు ట్రాన్సాక్షన్లకు సంబంధించిన స్టేట్మెంట్(మినీ) పొందడానికి 1 లేదా 2 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేయాలనుకుంటే..మీరు 3 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. స్టెప్5: మీరు పైన పేర్కొన్నట్లుగా సెలక్ట్ చేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ పొందవచ్చు. మిగిలిన సంబంధ వివరాలు కావాలనుకుంటే టైప్ చేసి అడగొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌కు సైతం ఎస్బీఐ ఈ వాట్సాప్ సేవల్ని తన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అందిస్తుంది. వాట్సాప్ కనెక్ట్ పేరుతో క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అకౌంట్ డీటెయిల్స్,రివార్డ్ పాయింట్లు, బ్యాలెన్స్, కార్డ్ చెల్లింపులతో పాటు పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. త్వరలో వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందుబాటులో తెస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎస్బీఐ బ్యాంకింగ్ సేవల్ని మరింత సులభతరం కానున్నాయి. జులై1న జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ఎస్బీఐ ఛైర్మన్ శుక్రవారం దినేష్ ఖారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఎస్బీఐ పలు కొత్త సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా వాట్సాప్‌లో ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు ఉంటాయని అన్నారు. అయితే అవి ఎలాంటి సేవలనే అంశంపై స్పందించలేదు. ఇప్పటికే ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ఎస్బీఐ ఇప్పటికే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అందిస్తుంది.అకౌంట్ సమరి, రివార్డ్ పాయింట్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ వంటి వివరాల్ని వాట్సాప్‌లో పొందవచ్చు. ఒకవేళ మీరూ ఆ సేవల్ని వినియోగించుకోవాలంటే "కేపిటల్ లెటర్స్‌తో ఇంగ్లీష్‌లో(OPTIN) ఓపీటీఐఎన్ అని టైప్ చేసి 9004022022 నెంబర్‌కు మెసేజ్ చేయోచ్చు. లేదంటే 08080945040 మిస్డ్ కాల్ ఇచ్చి సైనప్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకోవచ్చు." -
ఐటీఆర్ దాఖలుతో పని పూర్తయినట్టు కాదు
ఆదాయపుపన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్ 31 తో ముగిసింది. జూలైతోనే ముగిసిన గడువును.. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. దీంతో చాలా మంది డిసెంబర్లో రిటర్నులు దాఖలు చేశారు. రిటర్నులు దాఖలుతో బాధ్యత ముగిసిందని అనుకోవద్దు. ఆ తర్వాత తమ వైపు నుంచి దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చివరి నిమిషంలో వేయడం వల్ల అందులో తప్పులు దొర్లి ఉంటే వెంటనే రివైజ్డ్ రిటర్నులు వేసుకోవాలి. ఈ వెరిఫై చేస్తేనే వేసిన రిటర్నులు చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించే కథనమే ఇది.. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఐటీఆర్ దాఖలు చేయడం ప్రాథమికంగా చేయాల్సిన పని. తర్వాత ఆ రిటర్నులను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీరే దాఖలు చేశారనడానికి నిదర్శనం ఏమిటి? అందుకనే ధ్రువీకరణ ప్రక్రియ. దాంతో ఆ రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి మీరు బాధ్యత వహిస్తున్నట్టు అవుతుంది. గతేడాది కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ తీసుకురావడం తెలిసిందే. ఎన్నో సాంకేతిక సమస్యలు వెక్కిరించడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ చివరి వారంలో హడావుడిగా రిటర్నులు వేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ పత్రం లేదా ఫామ్–5 పత్రంపై (ఆదాయపన్ను శాఖ నుంచి డౌన్లోడ్ చేసుకుని) సంతకం చేసి ఆ కాపీని పోస్ట్ ద్వారా ఆదాయపన్ను శాఖ, బెంగళూరు కార్యాలయానికి పంపించాలి. కొరియర్ ద్వారా పంపకూడదు. భౌతికంగా చేసే ధ్రువీకరణ ఇది... ఇలా కాకుండా ఆన్లైన్లో ఈ వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్‌పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫై చేసినట్టు సమాచారం కూడా వస్తుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించుకుని ఓటీపీ జనరేట్ చేసుకోవడం ద్వారా ఈవెరిఫై చేయవచ్చు. సదరు బ్యాంకులో ఖాతా ఉండి, ఖాతాకు పాన్ నంబర్ అనుసంధానించి ఉంటే సరిపోతుంది. సెక్షన్ 44ఏబీ కింద ఖాతాలను ఆడిట్ చేయాల్సి అవసరం ఉన్న వారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. తమ డిజిటల్ సిగ్నేచర్‌ను ఉపయోగించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. పన్ను రిటర్నులు వేసిన 120 రోజులకీ వెరిఫై చేయకపోతే ముందు ఈఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి సరైన కారణాన్ని తెలియజేస్తూ జరిగిన ఆలస్యానికి క్షమాపణ తెలియజేయాలి. మీ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ మన్నిస్తే.. అప్పుడు రిటర్నులు ఈ వెరిఫై చేసుకునేందుకు అవకాశం తిరిగి లభిస్తుంది. లేదంటే మీ రిటర్నులను దాఖలు చేయనట్టుగా ఐటీ శాఖ భావిస్తుంది. అప్పుడు సకాలంలో రిటర్నులు వేయనందుకు చట్టప్రకారం అన్ని చర్యలకు బాధ్యత వహించాలి. ఆలస్యపు ఫీజు, చెల్లించాల్సిన పన్ను ఉంటే ఆ మొ త్తంపై నిర్ణీత గడువు తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి. రిటర్నుల్లో తప్పులను గుర్తిస్తే..? ఐటీఆర్ దాఖలు చేశారు. ధ్రువీకరించడం కూడా ముగిసింది. కానీ ఆదాయం, మినహాయింపులను పేర్కొనడం మర్చిపోయారనుకోండి. అప్పుడు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా రిటర్నులను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందే చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా వేరొక ఫామ్ ఉండదు. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఒరిజినల్, రివైజ్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకుని, ముందు దాఖలు చేసిన మాదిరే మొదటి నుంచి ప్రక్రియ అనుసరించాలి. ఒరిజినల్ ఐటీఆర్ ఈ ఫైలింగ్ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందుగానే రివైజ్డ్ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 2020–21 సంవత్సరానికి 2021–22 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. కనుక 2021 డిసెంబర్ 31ని గడువుగా అర్థం చేసుకోవాలి. ఆలోపే ఐటీఆర్ అసెస్మెంట్ను ఆదాయపన్ను శాఖ పూర్తి చేస్తే గడువు ముగిసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమలవుతుంది. 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సవరించిన రిటర్నుల దాఖలు గడువును ఆదాయపన్ను శాఖ 2022 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ గడువులతో సంబంధం లేకుండా.. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ మెయిల్ పంపినట్టయితే గడువు ముగిసిపోయినట్టుగానే పరిగణించాలి. దాంతో రిటర్నులను సవరించుకోలేరు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేసిన తర్వాత.. 10–30 రోజుల్లోపే ఆదాయపుపన్ను శాఖ ప్రాసెస్ చేసేస్తుంది. అందుకని రిటర్నులు దాఖలు చేసిన వారు ఆ తర్వాత వారం వ్యవధిలోపే మరొక్క సారి అన్నింటినీ క్షుణంగా సరిచూసుకోవడం మంచిది. రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసుకునేందుకు సాధారణంగా డిసెంబర్ 31 గడువుగా ఉంటుంది. కనుక ఆలస్యంగా రిటర్నులు వేసే వారికి రివైజ్ చేసుకునేందుకు తగినంత వ్యవధి ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందు ఎన్ని సార్లు అయినా రివైజ్డ్ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. అవకాశం ఉంది కదా అని చాలా సార్లు రివైజ్డ్ రిటర్నులు వేశారనుకోండి.. అప్పుడు ఆదాయపన్ను శాఖ సందేహంతో మీ ఐటీఆర్‌ను స్క్రూటినీ చేయవచ్చు. రిఫండ్ సంగతిదీ.. ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు తర్వాత, ఐటీ శాఖ వాటిని ప్రాసెస్ చేసి 143 (1) ఇంటిమేషన్ ఇవ్వడం పూర్తయి, అందులో ఏ తప్పులూ లేకపోతే రిటర్నుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్టే. చివరిగా ఒకవేళ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే రిఫండ్‌కు అర్హత ఉంటుంది. రిఫండ్ స్టేటస్ ఏంటన్నది ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డుపై కనిపిస్తుంది. అదనంగా ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ చెక్ చేసుకోవచ్చు. https://tin.tin. nsdl.com/oltas/refund-status.html. ఈ లింక్‌ను ఓపెన్ చేసి పాన్ వివరాలు ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫేస్‌లెస్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత రిఫండ్లు పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 143(1) ఇంటిమేషన్ వచ్చిన 15 రోజుల్లోపే రిఫండ్ కూడా వచ్చేస్తుంది. పలు కారణాల వల్ల ఆలస్యం అయితే, బ్యాంకు ఖాతా వివరాలు (అకౌంట్ నంబర్/ఐఎఫ్ఎస్ నంబర్ తదితర) సరిగా లేకపోవడం వల్ల పెండింగ్‌లో ఉంటే అప్పుడు నూతన ఈఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. రిఫండ్లు ఆలస్యమైనా ఆందోళన చెందక్కర్లేదు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నుంచి ఆ మొత్తంపై ప్రతీ నెలా 0.5 శాతం మేర వడ్డీని ఐటీ శాఖ చెల్లిస్తుంది. ఇలా అందుకునే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఈ మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. పన్ను కోసం డిమాండ్ నోటీసు వస్తే? పన్ను రిటర్నుల్లో తప్పులు, పొరపాట్లు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ రిటర్నులను ప్రాసెస్ చేసే సమయంలో అందులోని సమాచారం మధ్య అంతరాలు, పోలికల్లేమిని గుర్తిస్తుంది. ఆ వివరాలను 143(1) ఇంటిమేషన్ నోటీసులో పేర్కొంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఐటీ శాఖ పేర్కొన్న సమాచారంతో మీరు ఏకీభవిస్తే ఆ మేరకు పన్ను చెల్లించేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏదైనా మినహాయింపును పేర్కొనడం మర్చిపోయిన కారణంగా ఆ అంతరం తలెత్తి ఉంటే? అప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయాలి. ఆదాయపన్ను శాఖ లెక్కలతో ఏకీభవించడం లేదని లేదా రిటర్నుల్లో పొరపాటు చేశానంటూ అందులో పేర్కొనాలి. పన్ను అధికారులు ఆరు నెలల్లోగా స్పందిస్తారు. నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్‌లు ఉన్నాయి. రిటర్నుల్లో సరిపోలని సమాచారం అసలు ఏంటన్న దాని ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌పై ఫిర్యాదులు ఎక్కువ: ఆర్బీఐ
ముంబై: బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం, డెబిట్‌కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులకు సంబంధించి ఎక్కువగా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తున్నారు. 2020 జూలై నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వీటిపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. పారదర్శక విధానాలు పాటించకపోవడం, ఇచ్చిన హామీలను నిలుపుకోకపోవడంపై ఖాతాదారులు ఫిర్యాదు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2020-21 వార్షిక నివేదికను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. 2020 జూలై 1 నుంచి 2021 మార్చి 31 వరకు తొమ్మిది నెలల గణాంకాలు ఇందులో ఉన్నాయి. 2020 జూలై నుంచి ఆర్బీఐ సైతం ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా (ఏప్రిల్-మార్చి) తన వార్షిక సంవత్సరాన్ని కూడా సవరించుకుంది. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006 (బీవోఎస్), ద అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018(ఓఎస్ఎన్బీఎఫ్సీ), ద అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 (ఓఎస్డీటీ) పథకాల కింద గణాంకాలను ఆర్బీఐ ఈ నివేదికలో పేర్కొంది. వీటి నుంచి ఎక్కువ.. ఈ మూడు పథకాల కింద ఫిర్యాదులు 2020 జూలై నుంచి 2021 మార్చి మధ్య కాలంలో 22 శాతం పెరిగి 3,03,107కు చేరాయి. మొత్తం ఫిర్యాదుల్లో ఏటీఎం/డెబిట్‌కార్డుల నుంచి 17.40 శాతం, మొబైల్/ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలపై 12.98 శాతం, క్రెడిట్ కార్డులపై 12.36 శాతం చొప్పన వచ్చాయి. ఓఎస్డీటీ పథకం కింద ఫండ్ ట్రాన్స్ఫర్/యూపీఐ/ బీబీపీఎస్/ భారత్ క్యూఆర్కోడ్కు సంబంధించి 51 శాతం,, మొబైల్/ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి 22.57 శాతం, తప్పుడు బెనిఫీషియరీ కారణంతో లావాదేవీ మొత్తాన్ని తిరిగి జమ చేయకపోవడంపై 8 శాతం చొప్పున ఫిర్యాదులు దాఖలయ్యాయి. (చదవండి: కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ సేవలకు అంతరాయం!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిసెంబర్ 11, 12 తేదీల్లో 5 గంటలు పాటు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. "మేము 11 డిసెంబర్ 2021న 23:30 గంటల నుంచి 12 డిసెంబర్ 04:30 గంటల(120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్ కారణంగా ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది. గత నెల నవంబర్ 27న అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ పెనాల్టీ విధించింది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/LZsuqO2B0D — State Bank of India (@TheOfficialSBI) December 10, 2021 (చదవండి: రూ.60 వేల కోట్లను దాటనున్న సాఫ్ట్వేర్ ఆదాయం!) -
నయా బ్యాం‘కింగ్’.. బ్యాంకు సేవలన్నీ డిజిటల్‌గానే..
ఆధునిక, డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ పాత్ర చెప్పలేనంత పెద్దది. అది ఫోన్‌బ్యాంకింగ్ కావొచ్చు.. నెట్ బ్యాంకింగ్ కావచ్చు. డీమోనిటైజేషన్ తర్వాత నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కరోనా వచ్చి డిజిటల్‌ను మరింత వేగవంతం చేసింది. దీంతో నేడు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా సంప్రదాయ బ్యాంకులకు.. నియో బ్యాంకులకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకుం డా పోయింది. ఈ పరిణామాలు నియో బ్యాంకుల విస్తరణకు అవకాశాలను విస్తృతం చేసిందని చెప్పుకోవాలి. నేటి యవతరానికి బ్యాంకు శాఖలు, ఏటీఎంల వద్ద ‘క్యూ’లను చూస్తే చిరాకు. లెక్కలేనన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా వారికి నచ్చదు. సమయం వృథాకాకుండా.. ఉన్న చోట నుంచే బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు వారికి నచ్చింది. పెద్దవయసులోని వారు సైతం డిజిటల్ బ్యాంకు లావాదేవీలకు అలవాటు చేసుకుంటూ ఉండడం కొత్త ధోరణికి అద్దం పడుతోంది. కొంచెం ప్రత్యేకంగా.. నియో బ్యాంకులకు ప్రత్యేకమైన నిర్వచనం ఏదీ లేదు. భౌతికంగా ఎటువంటి శాఖలను కలిగి ఉండవు. ఇప్పటికే విస్తరించి ఉన్న సంప్రదాయ బ్యాంకులతో (లైసెన్స్ కలిగిన) ఇవి భాగస్వామ్యం కుదుర్చుకుని.. బ్యాంకింగ్ సేవలను అందిస్తుంటాయి. బ్యాంకు సేవలను వినియోగదారులకు మరింత సౌకర్యంగా అందించడం వీటి ప్రత్యేకత. వీటివల్ల బ్యాంకులకూ ప్రయోజనం ఉంది. కొత్త కస్టమర్లను సంపాదించేందుకు పెద్దగా అవి శ్రమపడాల్సిన పని తప్పుతుంది. నియోబ్యాంకుల రూపంలో కొత్త కస్టమర్లు వాటికి సులభంగా వచ్చి చేరుతుంటారు. బ్యాంకులకు కొత్త కస్టమర్లను తీసుకొచ్చినందుకు.. కస్టమర్ యాక్విజిషన్ ఫీ పేరుతో నియోబ్యాంకులకు కొంత మొత్తం ముడుతుంటుంది. అంతేకాదు.. బ్యాంకు తరఫున కస్టమర్లకు అందించే ప్రతీ సేవలపైనా ఎంతో కొంత ఆదాయం నియోబ్యాంకులకు లభిస్తుంది. కస్టమర్లకు సౌకర్యం.. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల వల్ల కస్టమర్లకు కొన్ని సౌలభ్యాలున్నాయి. బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్‌లను నియోబ్యాంకులు డిజైన్ చేసుకుంటాయి. నిధుల విషయంలో ఎటువంటి అభద్రతా భావం, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే నియోబ్యాంకులు మధ్యవర్తిత్వ పాత్రే పోషిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అకౌంట్లు, డిపాజిట్లు అన్నీ కూడా సంప్రదాయ బ్యాంకులవద్దే ఉంటాయి. వీటిల్లో ఖాతాను వేగంగా ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్లోనే కేవైసీ వివరాలను పూర్తి చేయవచ్చు. ఆధార్, పాన్‌తోపాటు కొన్ని ప్రాథమిక వివరాలను ఇస్తే చాలు. పైగా ఇవన్నీ కూడా సున్నా బ్యాలన్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అంటే ఖాతాదారులు రూపాయి కూడా ఉంచాల్సిన అవసరం లేకుండానే బ్యాంకు సేవలను పొందే వెసులుబాటు ఉంది. వార్షిక నిర్వహణ చార్జీలు కూడా లేవు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల భాగస్వామ్యం కలిగిన నియో బ్యాంకులు డిపాజిట్లపై అధిక రేటును ఆఫర్ (7 శాతం వరకు) చేస్తున్నాయి. నియో బ్యాంకులు కొన్ని సేవింగ్స్ ఆధారిత సేవలకే పరిమితం అవుతుంటే.. కొన్ని రుణ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. సేవింగ్స్ ఆధారిత నియో బ్యాంకులు పెట్టుబడులు, నగదు బదిలీలు, ఫారెక్స్ చెల్లింపుల వంటి సేవలకు పరిమితమైతే.. మరో రకం రుణ కార్యకలాపాలకు పరిమితం అవుతుంటాయి. సేవింగ్స్ ఆధారితం.. సేవింగ్స్ ఖాతా సేవలకు పరిమితమయ్యే నియో బ్యాంకులు ప్రధానంగా ఆయా సేవలను డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. ఐఎంపీఎస్/నెఫ్ట్/ఆర్టీజీఎస్/యూపీఐ తదితర చెల్లింపులు, చెక్ బుక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, అకౌంట్ స్టేట్మెంట్లు, ఖాతాలకు నామినీని నమోదు చేసుకోవడం ఇత్యాది సేవలన్నీ అందిస్తాయి. సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా సంప్రదాయ బ్యాంకులు ఆఫర్ చేసే అన్ని రకాల సేవలను నియో బ్యాంకుల ద్వారా డిజిటల్‌గానే పొందొచ్చు. లావాదేవీల పూర్తి వివరాలను సైతం ఎప్పటికప్పుడు పొందొచ్చు. నియోబ్యాంకులు కో బ్రాండెడ్ డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులను సైతం బ్యాంకుల భాగస్వామ్యంతో అందిస్తున్నాయి. నగదు ఉపసంహరించుకోవాలన్నా, నగదును డిపాజిట్ చేసుకోవాలన్నా.. అప్పుడు కస్టమర్లు నియో బ్యాంకు మంజూరు చేసిన ఏటీఎం కార్డును వినియోగించుకోవచ్చు. ఏ బ్యాంకు భాగస్వామ్యంతో కార్డు ఇచ్చిందో ఆయా బ్యాంకు ఏటీఎంలో లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. నగదు జమ కోసం అవసరమైతే భాగస్వామ్య బ్యాంకు శాఖకు వెళ్లి పనిచేసుకోవచ్చు. ఏటీఎం యంత్రాల్లోనూ క్యాష్ డిపాజిట్ అవకాశం ఉంటున్న విషయం తెలిసిందే. కస్టమర్ల వినియోగానికి తగ్గట్టు.. నియోబ్యాంకు ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్ల వినియోగాన్ని ట్రాక్ చేస్తుంటాయి. వారి అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు ఫెడరల్ బ్యాంకు సహకారంతో గూగుల్ పే ‘ఎఫ్ఐ మనీ’ని ఆరంభించింది. ఇది కూడా ఒక నియోబ్యాంకే. ఇది ఒక ఆటోమేటెడ్ బోట్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసింది. దీంతో కస్టమర్ స్విగ్గీ లేదా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ప్రతీ సందర్భంలోనూ రూ.50–100 వరకు పొదుపు చేయమని సూచిస్తుంటుంది. మరో నియోబ్యాంకు ‘జూపిటర్ మనీ’ మనీ మేనేజ్మెంట్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. తమ భవిష్యత్తు లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోనే ఖాతాదారు నిర్దేశించిన మొత్తాన్ని ప్రత్యేక భాగంగా జూపిటర్ మనీ నిర్వహిస్తుంటుంది. కొన్ని నియో బ్యాంకులు అయితే వెల్త్ మేనేజ్మెంట్ (సంపద నిర్వహణ) సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. నియోక్స్ అనే నియోబ్యాంకు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో (మధ్యవర్తి ప్రమేయం లేని) ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు. ఫిన్‌టెక్ కంపెనీ కలీదో ప్లాట్‌ఫామ్‌కు చెందిన కలీదో క్యాష్.. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, ఆర్డీలు, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను సైతం అందిస్తోంది. వీటిలో కొన్ని బ్యాంకులు బీటా వెర్షన్లోనే ఉన్నాయి. అంటే ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు. బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన ఇబ్బంది లేదు. మొబైల్ ఫోన్ నుంచే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. అన్ని లావాదేవీలనూ డిజిటల్‌గానే పూర్తి చేసుకోవచ్చు. ఆఖరుకు రుణాలను కూడా డిజిటల్ వేదికగా వేగంగా తీసుకోవచ్చు. ఈ తరహా సేవలతో నియో బ్యాంకులు విస్తరించుకుంటూ వెళుతున్నాయి. ఎటువంటి భౌతిక శాఖల్లేకుండా.. ఆన్లైన్ ఆర్థిక సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లనే నియోబ్యాంకులుగా పేర్కొంటున్నారు. ఈ సంస్థల సేవలపై వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది... రుణ ఉత్పత్తులు.. కొన్ని నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులకే ఎక్కువగా పరిమితం అవుతున్నాయి. ఇవి సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణ దరఖాస్తులను చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంటాయి. ఆన్లైన్లోనే ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఫొటో ఐడీ, ఆధార్ నంబర్, ఒక సెల్ఫీ కాపీలను బ్యాంకుకు ఆన్లైన్లో సమర్పిస్తే చాలు. ఫ్రియోకు చెందిన మనీట్రాప్.. రూ.3,000 నుంచి రూ.5 లక్షల వరకు కస్టమర్ల రుణ చరిత్ర ఆధారంగా వేగంగా రుణాలను మంజూరు చేస్తోంది. నెలసరి వేతనం రూ.30,000, ఆపైన ఉన్న ఉద్యోగులకు 13 శాతం వడ్డీ రేటుపైనే మూడు నెలల నుంచి 36 నెలల కాలానికి మంజూరు చేస్తోంది. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి సేవలను ఫ్రియోపే పేరుతో అందిస్తోంది. రూ.500–3,000 వరకు క్రెడిట్‌ను స్థానిక దుకాణాల్లో కొనుగోళ్లకు వాడుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్ణీత తేదీలోపు చెల్లిస్తే చాలు. రూపాయి కూడా వడ్డీ ఉండదు. నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులను ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకుల భాగస్వామ్యంతో అందించొచ్చు. సేవింగ్స్ ఖాతా సేవలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకు నుంచే రుణ ఉత్పత్తులను ఆఫర్ చేయాలని లేదు. ఉదాహరణకు ఫ్రియో సంస్థ సేవింగ్స్ ఖాతా సేవలను ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సహకారంతో అందిస్తోంది. కానీ ఇదే ఫ్రియో తన మనీట్రాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణ ఉత్పత్తులను అందించేందుకు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీఎం ఫైనాన్స్, అపోలో ఫిన్వెస్ట్ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, ఆర్బీఎల్ బ్యాంకుతో టైఅప్ అయ్యి క్రెడిట్ కార్డులను సైతం అందిస్తోంది. సరైన క్రెడిట్ స్కోర్ లేని వారి గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా నియో బ్యాంకులు.. కస్టమర్ల మొబైల్లోని కాంటాక్ట్‌లు, గ్యాలరీ, ఇతర యాప్‌ల సమాచారం తీసుకునేందుకు అనుమతి కోరుతున్నాయి. నియంత్రణలు, ఫిర్యాదుల పరిష్కారం నియో బ్యాంకులపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉండదు. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాం కుల సాయంతోనే బ్యాంకింగ్ సేవలను ఇవి అందిస్తున్నాయని గమనించాలి. డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులను అందించే సంస్థలు భౌతికంగానూ శాఖలను కలిగి ఉండాలని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. కనుక నియోబ్యాంకులు భౌతికంగా శాఖలు కలిగిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు చేసుకుని సేవలను అందిస్తున్నాయి. కనుక నియో బ్యాంకు అందిస్తున్న డిపాజిట్, సేవింగ్స్ ఖాతా సేవల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఖాతాల్లోని కస్టమర్ల డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుంది. కాకపోతే నియోబ్యాంకు ఒప్పందం చేసుకున్న బ్యాంకు ఏదన్నది తెలుసుకోవడం మంచిది. ఫిర్యాదులను నియో బ్యాంకు లేదా ఆ బ్యాంకుతో ఒప్పందం కలిగిన సంప్రదాయ బ్యాంకుల వద్ద దాఖలు చేసుకోవచ్చు. సకాలంలో పరిష్కారం రానట్టయితే ఆర్బీఐ సాచెట్ వెబ్సైట్లోనూ నమోదు చేసుకోవచ్చు. అనుకూలమేనా..? వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్, లావాదేవీలను సైతం సౌకర్యంగా నిర్వహించుకోగల వెసులుబాటు నియో బ్యాంకుల్లో ఉంటుంది. కాకపోతే అన్నింటినీ ఒకే కోణం నుంచి చూడకూడదు. కొన్ని నియో బ్యాంకుల్లో బ్యాలన్స్ వెంటనే అప్డేట్ కావడం లేదని.. కస్టమర్ సేవలు బాగోలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కనుక ఎంపిక చేసుకున్న నియోబ్యాంకు సేవలు మెరుగ్గా లేకపోతే వాటిల్లో కొనసాగడం ఆశించిన ప్రయోజనాలను ఇవ్వదు. సైబర్ భద్రతా రిస్క్ అంతా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే కావడంతో సైబర్ భద్రతా రిస్క్ ఉంటుంది. అలాగే, ఫోన్లో వ్యక్తిగత సమాచారం పొందేందుకు అనుమతి అడుగుతున్నందున ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. మెరుగైన, సులభతరమైన బ్యాంకు సేవల కోసంనియో బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్టయితే.. ఆశించిన మేర సేవల నాణ్యత ఉందేమో పరిశీలించుకోవాలి. ఇప్పటికే సంప్రదాయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగిన వారు.. మెరుగైన సేవల కోసం రెండో ఖాతాను నియో బ్యాంకుల్లో తెరవడాన్ని పరిశీలించొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అదే విధంగా.. నియో బ్యాంకుల మాదిరే అన్ని రకాల సేవలను ఆఫర్ చేస్తున్న ఎస్బీఐ యోనో, కోటక్ 811 ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. నియో బ్యాంకులకు ఇవి మెరుగైన ప్రత్యామ్నాయంగా వారు పేర్కొంటున్నారు. పరిమితులు సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆటో డెబిట్ (ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు అనుమతి) కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం అన్ని నియో బ్యాంకుల్లోనూ లేదు. అలాగే, పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు కూడా అవకాశం లేదు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 730 టార్గెట్: రూ. 870 ఎందుకంటే: గతేడాది(2020–21)కల్లా 8.4 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ దేశీ బ్రోకింగ్ బిజినెస్‌లో నాలుగో ర్యాంకులో నిలుస్తోంది. ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్ల విషయంలో డిస్కౌంట్ బ్రోకర్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీలోనూ కంపెనీ పురోభివృద్ధి సాధిస్తోంది. కంపెనీకి గల పటిష్ట డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. క్లయింట్లకు వివిధ దశల్లో అవసరమయ్యే పెట్టుబడులు, రక్షణ, రుణాలు తదితర లైఫ్‌సైకిల్ సొల్యూషన్స్‌ను పూర్తిస్థాయిలో అందిస్తోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల పెట్టుబడుల్లో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇవి దేశీ బ్రోకింగ్ పరిశ్రమలో డిజిటల్ సేవలు, అతిపెద్ద సంస్థల కన్సాలిడేషన్‌కు దారి చూపుతున్నాయి. అతిపెద్ద కంపెనీగా ఐ–సెక్ సర్వీసులకు ఇకపై మరింత డిమాండు కనిపించే వీలుంది. కస్టమర్ల వ్యాలెట్ షేర్ల మానిటైజేషన్ తదితర డైవర్సిఫైడ్ ప్రొడక్టులతో కూడిన సేవల ద్వారా నిలకడైన ఆదాయాన్ని సాధించనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా కస్టమర్లను పొందడంలో ముందుంటోంది. వ్యయాల క్రమబద్ధీకరణతో లబ్ధి పొందనుంది. టీసీపీఎల్ ప్యాకేజింగ్ వెంచురా సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 532 టార్గెట్: రూ. 961 ఎందుకంటే: గత దశాబ్దన్నర కాలంగా కంపెనీ నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 17.7 శాతం పురోగతిని చూపుతోంది. సుమారు 6,000 లిస్టెడ్ కంపెనీలలో గత పదేళ్లుగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తున్న 105 కంపెనీలలో ఒకటిగా జాబితాలో చేరింది. మడిచే వీలున్న అట్టపెట్టెలు(ఫోల్డింగ్ కార్టన్స్), మార్పిడికి వీలయ్యే స్టాండెలోన్ పేపర్ బోర్డుల తయారీలో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. వెరసి ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో నిలకడైన, ప్రాధాన్యత కలిగిన కంపెనీగా పలు పరిశ్రమలకు చెందిన దిగ్గజ క్లయింట్ల నుంచి గుర్తింపును పొందింది. అంతర్జాతీయంగా రక్షణాత్మక ప్యాకేజింగ్ మార్కెట్ వార్షికంగా 6.7 శాతం వృద్ధితో 281 బిలియన్ డాలర్ల నుంచి 469 బిలియన్ డాలర్లకు జంప్చేయగలదని అంచనా. ఈ రంగంలో పట్టున్న కంపెనీగా టీసీపీఎల్‌కు భారీ అవకాశాలు లభించే వీలుంది. పర్యావరణ అనుకూల టెక్నాలజీస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నందున రానున్న దశాబ్ద కాలంలో కన్సాలిడేషన్ జరగనుంది. తద్వారా పోటీ తగ్గనుంది. ఈ ఏడాది రెండో తయారీ లైన్ ప్రారంభం కానుండటంతో కంపెనీ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సామర్థ్యం రెట్టింపుకానుంది. అనుబంధ సంస్థ ద్వారా చేపట్టనున్న పాలీఎథిలీన్ బ్లోన్ఫిల్మ్ తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనుంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెప్టెంబర్ 15న రెండు గంటలు పాటు తన ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. "మేము 15 సెప్టెంబర్ 2021న 00:00 గంటల నుంచి 02:00 గంటల (120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్ కారణంగా ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది.(చదవండి: పెన్షనర్లకు ఎస్బీఐ శుభవార్త!) ఇంతకు ముందు కూడా సెప్టెంబర్ 4, 5 తేదీల మధ్య మూడు గంటలపాటు అన్ని డిజిటల్ సర్వీసులకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 4వ తేదీ(ఇవాళ రాత్రి) రాత్రి 10.35 నుంచి అర్ధరాత్రి దాటాక 1గం.30ని. వరకు డిజిటల్ సర్వీసులు పని చేయవని తెలిపింది. ఈ మూడు గంటలపాటు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది. ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 లోపు తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేయాలని పేర్కొంది. ఒకవేళ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని తెలిపింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #OnlineSBI #SBI pic.twitter.com/5SXHK20Dit — State Bank of India (@TheOfficialSBI) September 14, 2021 -
హెచ్డీఎఫ్సీ మొబైల్ యాప్ క్రాష్.. కస్టమర్ల గగ్గోలు
హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ నేడు క్రాష్ అయ్యింది. దీంతో చాలా మంది అసహనానికి లోను అయ్యారు. యాప్ బగ్ గుర్తించే వరకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను రాజీవ్ బెనర్జీ కోరారు. హెచ్డీఎఫ్సీ ప్రతినిధి రాజీవ్ బెనర్జీ దీనిపై ట్విటర్ లో స్పందించారు. "మేము మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాము, ఈ సమస్యను పరిష్కరించిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాము. అప్పటి వరకు వినియోగదారులు తమ లావాదేవీల కోసం నెట్‌బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు. మీకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము, ధన్యవాదాలు" అని తెలిపారు. హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ వాడటానికి ప్రయత్నించినప్పుడు బ్యాంక్ వినియోగదారులకు స్క్రీన్‌పై ఒక మెసేజ్ ఫ్లాష్ అయినట్లు చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై ట్విటర్ వేదికగా బ్యాంక్ అధికారులకు పిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో సమస్య తలెత్తింది. కొంత మంది ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది దాని గురుంచి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. చదవండి: గల్వాన్ ఎఫెక్ట్: చైనా ఉత్పత్తులపై భారీ దెబ్బ -
స్కూల్ ఫీజులూ.. సులభ వాయిదాల్లో...
న్యూఢిల్లీ: భారీ విలువ చేసే లావాదేవీలకు చెల్లించే మొత్తాన్ని నేరుగా కస్టమర్లే ఆన్లైన్లో ఈఎంఐల (నెలవారీ వాయిదాలు) కింద మార్చుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. ఎంపిక చేసిన సేవింగ్స్ అకౌంట్స్ ఖాతాదారులు .. తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం ద్వారా బీమా ప్రీమియంలు మొదలుకుని స్కూలు ఫీజుల దాకా వివిధ రకాల చెల్లింపులను ఈఎంఐల కింద చెల్లించవచ్చని తెలిపింది. దీనితో భారీ మొత్తాన్ని సులభ వాయి దాల్లో చెల్లించుకునేందుకు వీలవు తుందని పేర్కొంది. రూ. 50,000కు పైబడి రూ. 5 లక్షల దాకా విలువ చేసే లావాదేవీలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వీటిని 3,6,9,12 నెలల కాల వ్యవధికి ఈఎంఐల కింద మార్చుకోవచ్చని, ఇందుకోసం అదనపు చార్జీలేమీ ఉండవని బ్యాంకు తెలిపింది. ’ఈఎంఐ @ ఇంటర్నెట్ బ్యాంకింగ్’ పేరిట ఈ సదుపాయం అందు బాటులో ఉంటుందని వివరించింది. ఇందు కోసం బిల్‌డెస్క్, రేజర్‌పే అనే ఆన్లైన్ పేమెంట్ గేట్వేలతో పాటు 1,000కి పైగా వ్యాపార సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంక్ వివరించింది. -
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఇక నుంచి ఎస్బీఐ వినియోగదారులు ఇంట్లో నుంచే నామినీ పేరు జత చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం ఇక నుంచి ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది.(చదవండి: అన్నదాతల కోసం మరో కేంద్ర పథకం!) మీరు బ్యాంక్ అకౌంట్‌ను నామినీ పేరును మూడు రకాలుగా జత చేయవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం లేదా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఒకవేల కనుక మీరు ఎస్బీఐ యోనో యాప్ ఇంస్టాల్ చేసుకుంటే అందులోకి లాగిన్ అయిన తర్వాత కింద ఉన్న సర్వీస్ సర్వీసెస్ సెక్షన్లోకి వెళ్లాలి. ఇప్పుడు మీకు ఆన్లైన్ నామినీ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు సులభంగానే మీ అకౌంట్‌కు నామినీ పేరు యాడ్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఏమైనా అంటే చనిపోతే అయితే అప్పుడు ఆ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులుపై నామినీకి పూర్తి అధికారం ఉంటుంది. We have a good news! Now SBI customers can register their nominee by visiting our branch or logging into https://t.co/YMhpMw26SR.#SBI #StateBankOfIndia #OnlineSBI #InternetBanking pic.twitter.com/AMvWhExDre — State Bank of India (@TheOfficialSBI) February 3, 2021 ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా: మీరు మీ యూజర్పేరు, పాస్‌వర్డ్‌తో onlinesbi.com లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత మెను నుంచి 'రిక్వెస్ట్ & ఎంక్వైరీస్' టాబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆన్లైన్ నామినేషన్ ఎంపికను ఎంచుకోండి. మీరు కొత్త నామినీని ఏ ఖాతాకు జోడించాలని అనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోండి. ఇప్పుడు 'ప్రొసీడ్' టాబ్‌పై క్లిక్ చేయండి. నామినీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఖాతాదారుడితో సంబంధిత వివరాలు నమోదు చేయండి ఇప్పుడు "సబ్మిట్" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన హై-సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. కొత్త నామినీని జోడించడానికి 'Confirm' టాబ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. -
ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ బ్లాక్ అవుతుంది..!!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లకు అలర్ట్. అంతకముందు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో మొబైల్ నెంబర్‌ను రిజిస్ట్రర్ చేసుకోని కస్టమర్లందరూ 2018 డిసెంబర్ 1 కల్లా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ తెలిపింది. ఒకవేళ తుది గడువు లోపల రిజిస్ట్రర్ చేసుకోకపోతే, నెట్ బ్యాంకింగ్ బ్లాక్ అవుతుందని ఎస్బీఐ తెలిపింది. వారు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్సస్ చేసుకోలేరని పేర్కొంది. దగ్గర్లోని బ్రాంచు ద్వారా ఈ పక్రియను వెంటనే చేపట్టుకోవాలని సూచించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 2017 జూలై 6న దీనిపై సర్క్యూలర్ జారీ చేయడంతో, ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌లు ఎస్ఎంఎస్ అలర్ట్‌ల కోసం తప్పనిసరిగా తమ కస్టమర్ల మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ ప్రక్రియ చేపట్టాలని ఆర్బీఐ ఆదేశించింది. ఒకవేళ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో మొబైల్ నెంబర్‌ను రిజిస్ట్రర్ చేసుకోకపోతే, వెంటనే యూజర్లు దాన్ని చేపట్టాలని పేర్కొంది. అంతేకాక, బ్యాంక్ వద్ద ఇప్పటికే రిజిస్ట్రర్ చేసుకున్న యూజర్లు కూడా మొబైల్ నెంబర్‌ను చెక్ చేసుకోవాలని తెలిపింది. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్‌తో మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ అయిందో లేదో చెక్ చేసుకునే ప్రక్రియ.... onlinesbi.com అనే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. లాగిన్, పాస్వర్డ్ వివరాలను నమోదు చేయాలి ఆ తర్వాత ‘మై అకౌంట్ అండ్ ప్రొఫైల్’ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి ‘ప్రొఫైల్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి పర్సనల్ డిటైల్స్/మొబైల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి ఆ తర్వాత ప్రొఫైల్ పాస్వర్డ్ నమోదు చేయాలి(ప్రొఫైల్ పాస్వర్డ్, యూజర్ పాస్వర్డ్ వేరువేరుగా ఉండాలి) ఒక్కసారి ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్(ముందే రిజిస్ట్రర్ అయి ఉంటే) డిస్ప్లే అవుతుంది. -
రారమ్మని.. కార్డు వివరాలు ఇమ్మని..!
మీరు సీరియస్‌గా బ్రౌజింగ్ చేస్తుండగానో.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో మునిగి ఉండగానో.. ‘ఆకర్షించే’లా పాప్అప్స్ వచ్చాయా? హఠాత్తుగా మీ మెయిల్ ఐడీకి గుర్తుతెలియని అడ్రస్ నుంచి ‘ఫొటోలతో’కూడిన ఈ–మెయిల్ వచ్చిందా? అలాంటి వాటిని క్లిక్ చేసే ముందు ఒక్కక్షణం ఆగండి..! అవి మిమ్మల్ని నిలువునా ముంచేసే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇది చదవండి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవల ఓ ఫిర్యాదు అందింది. ఓ యువకుడి ఖాతా నుంచి రూ.10 లక్షలు గోల్మాల్ అయ్యాయన్నది దాని సారాంశం. ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు అతగాడు ఓ అశ్లీల వెబ్సైట్లోకి లాగిన్ కావడంతో ఈ మోసం చోటు చేసుకుందని గుర్తించారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు నెట్ బ్యాంకింగ్‌కు ఉపకరించే రహస్య అంశాలను తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు అశ్లీలంతో ఎర వేస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఆ వివరాలే కీలకం.. ఓ వ్యక్తికి చెందిన సొమ్మును ఆన్లైన్లో స్వాహా చేయడానికి సైబర్ నేరగాళ్లకు అతడి క్రెడిట్/డెబిట్ కార్డు నంబర్, సీవీవీ కోడ్లతో పాటు కొన్ని వ్యక్తిగత వివరాలూ అవసరం. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. వీటన్నింటితో పాటు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) సైతం ఎంటర్ చేయాల్సిందే. ఇవి లేకుండా ఆన్లైన్లో డబ్బు కాజేయడం అసాధ్యం. సాధారణంగా ఈ వివరాల కోసం సైబర్ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ, బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేయడం, మెయిల్స్ పంపడంతో పాటు సూడో సైట్లు సృష్టించే వారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘అశ్లీలం దారి’పట్టారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. యువకులే టార్గెట్‌గా.. సైబర్ నేరగాళ్ల వల్లో ఎక్కువగా యువకులే పడుతున్నారు. వీరిని ఆకర్షించేందుకు కొన్ని అశ్లీల వెబ్సైట్లను సైతం రూపొందిస్తున్నారు. అర్ధనగ్న, నగ్న చిత్రాలతో కూడిన పాప్ అప్స్‌ను వివిధ సామాజిక నెట్వర్కింగ్ సైట్లతో పాటు వెబ్సైట్లకు లింక్ చేస్తున్నారు. వీటికి ఆకర్షితులవుతున్న యువత వీటిపై క్లిక్ చేసిన వెంటనే అవి ఓపెన్ అవుతున్నాయి. ఆ తర్వాతే అసలు ఘట్టం ప్రారంభమవుతోంది. ఆ సైట్లోకి లాగిన్ కావాలన్నా, అందులోని వీడియోలు, ఫొటోలు ఓపెన్ కావాలన్నా కొంత రుసుము చెల్లించాలని ప్రత్యేక లింకు పెడుతున్నారు. నేరుగా చేరిపోతున్న వివరాలు.. ఆయా సైట్లలోకి లాగిన్ కావడానికి, వీడియోలు–ఫొటోలు చూడటానికి కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని ఉంటోంది. దీంతో ‘కార్డుల’ వివరాలు, నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని అందులో పూరిస్తున్నారు. దీంతో ఈ వివరాలన్నీ నేరుగా సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సింది ఓటీపీ మాత్రమే. దీనికోసం సదరు వెబ్సైట్లోనే ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. ఓపక్క ఈ వివరాలతో ఆన్లైన్ లావాదేవీలు పూర్తి చేసి.. ఓటీపీ వచ్చేలా ఆప్షన్ ఎంచుకుని వేచి చూస్తున్నారు. ఆ యువకుడు వెబ్సైట్లో ఏర్పాటు చేసిన లింకులో దీన్ని పొందుపరిచిన వెంటనే లావాదేవీ పూర్తి చేసి ఆన్లైన్లో డబ్బు స్వాహా చేస్తున్నారు. ఈ వివరాలను వినియోగించి వారు తేలిగ్గా ఖాతాలు ఖాళీ చేయడమో, ఆన్లైన్ షాపింగ్ చేసి ‘కార్డు’లకు చిల్లు పెట్టడమో చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉంటుండటంతో వారి పూర్తి వివరాలు తెలుసుకోవడం అసాధ్యంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులను నమ్మదగ్గ సైట్లలోనే చేయాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదు. అలాంటి వాళ్లకు మీ వివరాలు తెలిస్తే కచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. ఇలాంటి నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. నిందితులు చిక్కడం, నగదు రికవరీ అంత కష్టం. అప్రమత్తతతోనే సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. – సైబర్ క్రైమ్ అధికారులు -
‘క్యాష్‌లెస్’ కాస్త ఖరీదే!!
డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న సమస్యలు • కార్డులు, వాలెట్లు, నెట్ బ్యాంకింగ్‌కు చార్జీలు • కార్డులపై చెల్లింపులకు ఏకంగా 2 శాతంపైనే • వాలెట్లో డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే తంటా • నెట్ సహా అన్ని లావాదేవీల్లో వైఫల్యాలు • ట్రాన్సాక్షన్ పూర్తి కాదు.. ఖాతాలో డబ్బులేమో మాయం • ఎక్కడికి వెళ్లాయో అర్థమవ్వదు;ఎవరినీ సంప్రదించాలో తెలీదు • కొత్త మాధ్యమాలకు కరవైన నిబంధనలు • సామాజిక మాధ్యమాలను ఆశ్రయించాలంటున్న నిపుణులు నిజం!! ఇది డిజిటల్ యుగం. మీడియా నుంచి ఆర్థిక లావాదేవీల దాకా అన్నీ డిజిటల్ మయమే. అందుకే ప్రభుత్వం కూడా చలామణిలో ఉన్న కరెన్సీని ఒక్కసారిగా రద్దు చేసి డిజిటల్ లావాదేవీల ప్రచారం మొదలుపెట్టింది. కరెన్సీ పెద్దగా అందుబాటులో లేదు కనక జనం కూడా విధిలేక డిజిటల్ లావాదేవీల వైపు అడుగులేస్తున్నారు. కాకపోతే ఇంకా చాలామందికి మొబైల్ వాలెట్లు వాడేదెలా? దానికి చార్జీలేమైనా అవుతాయా? ఇంటర్ నెట్లో బ్యాంకింగ్ లావాదేవీలు ఎలా చేయాలి? ఒకవేళ మధ్యలో ఫెయిలైతే పరిస్థితేంటి? కార్డుల ద్వారా ఎవరికైనా చెల్లింపులు చేయొచ్చా? చార్జీలేమైనా భరించాల్సి ఉంటుందా? ఇలాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... మొబైల్లోనే ఉంటుంది మీ వాలెట్... సుజన ఆన్లైన్లో మొబైల్ ఫోన్ కొంటూ... మొబైల్ వాలెట్‌తో చెల్లించింది. లావాదేవీ పూర్తయినట్లు వాలెట్ ప్రొవైడర్ నుంచి సుజనకు మెయిల్ వచ్చింది. ఆన్లైన్ రిటైలర్ మాత్రం తనకు పేమెంట్ అందలేదన్నాడు. కాబట్టి ఫోన్ పంపలేదు. ఒక వారం గడిచింది. అయినా సుజన డబ్బులు ఆమె ఖాతాలోకి రాలేదు. ఎవరికి చెప్పాలన్నది ఆమెకు తెలియలేదు. ఏం చేయాలంటే..! పేటీఎం సహా చాలా వాలెట్లు ఫిర్యాదులు తీసుకోవటానికి ఫోన్ నెంబరేమీ ఇవ్వటం లేదు. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మెయిల్ పంపటానికి మాత్రం అవకాశం ఇస్తున్నాయి. అంటే... మనం గట్టిగా ఎవరినీ అడగటానికి లేదు. మెయిల్ ఇవ్వటం... సమాధానం వచ్చేదాకా చూడటం.... అంతే చేయగలిగింది. అయితే చాలా వరకూ మెయిళ్లకు ఈ సంస్థలు స్పందించి లావాదేవీల్ని పరిష్కరిస్తున్నాయి. ‘‘లావాదేవీలు నిర్వహించే మాధ్యమాన్ని బట్టి లావాదేవీ సెటిల్మెంట్ ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సాక్షన్లు ఫెయిలవుతాయి. ఇలాంటపుడు ఆ లావాదేవీ మొత్తం తిరిగి మనకు చేరడానికి కొన్ని సెకన్ల నుంచి ఏడు పనిదినాల సమయం పట్టొచ్చు. ఇంకా ఎక్కువ సమయం పడితే.. అపుడు ఆ డబ్బులు పూల్ అకౌంట్లో ఉంటాయి. వాలెట్స్/ బ్యాంకులు.. పేమెంట్ నెట్వర్క్ ప్రొవైడర్‌తో కలిసి ఈ అకౌంట్లను నిర్వహిస్తాయి’’ అని పేయూ ఇండి యా సర్వీస్ డెలివరీ హెడ్ హరి వేలాయుధన్ చెప్పారు. వాలెట్లు ఎలా వాడాలి? పేటీఎం, మొబిక్విక్, ఆక్సిజన్, ఫోన్‌పే, స్వైపే... ఇలా రకరకాల మొబైల్ వాలెట్లు అందుబాటులో ఉన్నాయి. దేని ప్రయోజనాలు దానివి. దేని నష్టాలు దానివి. ఎందుకంటే అన్ని వాలెట్లూ అన్ని లావాదేవీలకూ వాడలేం. ఉదాహరణకు మనం ఒక దుకాణంలో పేటీఎం ద్వారా చెల్లించాలని భావిస్తే... సదరు దుకాణదారుడు కూడా పేటీఎం వాడుతుండాలి. తను వేరే వాలెట్ వాడితే కుదరదు. వీటిని వాడాలనుకున్న వారు మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మన వివరాలతో రిజిస్టర్ చేసుకుని... మనకున్న ఆన్లైన్ బ్యాంకు ఖాతా నుంచో, లేకపోతే క్రెడిట్/డెబిట్ కార్డు నుంచో దీన్లో డబ్బులు వేయాలి. అప్పటి నుంచి వాడటం మొదలుపెట్టొచ్చు. చార్జీలెలా ఉంటాయంటే... వాలెట్లలో ఉన్న ప్రస్తుతం చాలా వాలెట్లు మనం లావాదేవీలు చేసేటపుడు ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. కాకపోతే వాలెట్లో డబ్బులు వేసేటపుడు మన బ్యాంకులు మాత్రం లావాదేవీ చార్జీ తీసుకుంటున్నాయి. ఒకవేళ మనం వాలెట్లో ఉన్న డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేసుకోవాలన్నా ఇవి 1–4 శాతం మధ్య చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గమనించి వాడాల్సి ఉంటుంది. మీ బ్యాంకంతా... ఇంటర్నెట్లోనే రాజేష్ తన బ్యాంకు ఖాతా నుంచి మొబైల్ వాలెట్‌కు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు వెళ్లింది. కానీ వాలెట్లో జమ కాలేదు. ఎందుకిలా? బ్యాంకును ఫోన్లో సంప్రదించాడు. ‘‘సర్! ఇది రెండంచెల వ్యవస్థ. రెండింటి మధ్య పేమెంట్ గేట్‌వే ఉంటుంది. ఇది బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకొని.. దాన్ని వాలెట్లో జమ చేస్తుంది. గేట్‌వేకు చేరక ముందే లావాదేవీ ఫెయిలయి ఉండొచ్చు. సర్వర్ పనిచేయకపోవడం, నెట్వర్క్ సమస్యలు ఉండొచ్చు. గేట్‌వే కంపెనీలు బ్యాంకులతో రోజూ లావాదేవీలను సెటిల్ చేస్తాయి. ఇది జరిగి మీ ఖాతాలోకి డబ్బులు రావటానికి 1–2 పనిదినాలు పట్టొచ్చు’’ అని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వివరించాడు. ఒకవేళ పేమెంట్ గేట్‌వే డబ్బుల్ని తీసుకున్నాక లావాదేవీ ఫెయిలైతే ఆ డబ్బులు వాలెట్‌కు చేరుతాయి. అదీ కథ. ‘‘నిజమే! వాలెట్ నుంచి బ్యాంక్‌కు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసేటపుడు ఎక్కువ సమస్యలొస్తున్నాయి’’ అని పేటీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ దీపక్ అబాట్ చెప్పారు. ‘‘బ్యాంకుల్లో రద్దీ వల్ల రిఫండ్ ఆలస్యం కావొచ్చు. మేం వాటికి రెఫరెన్స్ నంబర్‌ను పంపిస్తాం. బ్యాంకులో జరిగే ప్రక్రియతో మాకెలాంటి సంబంధం ఉండదు. మా దగ్గరకొచ్చిన కస్టమర్లకు ఏం చేయాలో సూచనలు మాత్రమే ఇవ్వగలం’’ అని వివరించారాయన. నెట్‌బ్యాంకింగ్ చేసేదెలా? ఇంటర్ నెట్ బ్యాంకింగ్ చేయడానికి మీకు మొదట బ్యాంకు ఖాతా ఉండాలి. తరవాత బ్యాంకు బ్రాంచిలో సంప్రదిస్తే వారు చిన్న దరఖాస్తు తీసుకుని నెట్‌బ్యాంకింగ్ ఐడీ ఇస్తారు. పాస్‌వర్డ్‌ను పోస్ట్‌లో పంపిస్తారు. ఈ ఐడీ, పాస్వర్డ్ సాయంతో నెట్‌బ్యాంకింగ్ లావాదేవీలు చేయొచ్చు. ఈ నెట్‌బ్యాంకింగ్ ద్వారా బిల్లులు చెల్లించటంతో పాటు, ఇతరుల బ్యాంకు ఖాతాలకు, మొబైల్ వాలెట్లకు డబ్బులు బదిలీ చేయొచ్చు. ఇపుడు ప్రతి బ్యాంకూ మొబైల్ యాప్‌లు తెచ్చింది. మొబైల్ యాప్ ద్వారానే నెట్‌బ్యాంకింగ్ లావాదేవీలన్నీ జరుపుకోవచ్చు. వాలెట్లతో పోలిస్తే వీటికి భద్రత ఎక్కువ. చార్జీలూ తక్కువ. చార్జీలూ ఉంటాయి... ఇతరుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయాలంటే వారిని మీ పేయీలుగా జత చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక... ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్)తో పాటు నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు బదిలీ చేయొచ్చు. ప్రతి లావాదేవీకీ కొంత చార్జీ ఉంటుంది. ఇది రూ.2–5 మధ్య ఉంటుంది. ఎక్కువ మొత్తాలకైతే ఆర్టీజీఎస్, తక్కువ మొత్తాలకైతే నెఫ్ట్, తక్షణం (సెకన్లలో) డబ్బు బదిలీ కావాలంటే ఐఎంపీఎస్ వాడాలి. ఐఎంపీఎస్‌కు కాస్త ఎక్కువగా రూ.5 వరకూ చార్జీలవుతాయి. కార్డు వాడొచ్చు... కానీ చార్జీలుంటాయ్ సౌమ్య ఓ షాపులో సరుకులు కొని డెబిట్ కార్డుతో చెల్లించబోయింది. స్వైప్ చేశాక.. కాసేపటికి ట్రాన్సాక్షన్ తిరస్కరణకు గురైనట్లు అక్కడ మెసేజీ కనిపించింది. కానీ మొబైల్‌కు మాత్రం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాంకును సంప్రదిస్తే... ఆ డబ్బులు తిరిగి వస్తాయని, కంగారు పడొద్దని చెప్పారు. కంగారు సంగతి సరే! ముందు దుకాణదారుకు చెల్లించటానికి డబ్బులుండాలి కదా!! అనుకుంది. స్నేహితుల సాయంతో పని పూర్తిచేసింది. కార్డులు వాడటమెలా? నిజానికి ప్రభుత్వమిపుడు కరెన్సీని తగ్గించి డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తోంది. నెట్‌బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ల వంటివి కాస్త ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవారికే కాగా... అందరికీ చేతనైనది కార్డుల వాడకమే. ఎందుకంటే దేశంలో చాలా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయి. వారికి డెబిట్ కార్డులూ ఉన్నాయి. కొందరికైతే క్రెడిట్ కార్డులుంటాయి. షాపుల్లో చెల్లింపులకు కార్డులు వాడొచ్చు. ఇంటర్నెట్లో కూడా ఈ కార్డుల ద్వారా లావాదేవీలు జరపొచ్చు. ఈ కార్డుల వాడకానికి కావాల్సిన పిన్ నంబరును బ్యాంకులే ఇస్తాయి. చార్జీలతో జాగ్రత్త! డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... డిజిటల్ లావాదేవీలు జరిపేవారిపై చార్జీలను కూడా బాదుతుండటం గమనార్హం. కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించే ప్రతి వ్యాపారీ... చివరికి అలా స్వీకరించిన డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు తీసుకునేటపుడు బ్యాంకులు 2 నుంచి 4 శాతం చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ తామెందుకు భరించాలని భావిస్తున్న వ్యాపారులు.... ఆ చార్జీల్ని కూడా కస్టమర్లపైనే వేస్తున్నారు. వీటిని భరించటమెందుకని భావిస్తున్న కస్టమర్లు... కార్డు బదులు నగదు ఇవ్వటానికే మొగ్గు చూపుతున్నారు. ఇదంతా ఒక గొలుసు వ్యవస్థ. ఇటీవలే పెట్రోలు బంకులు ఈ విషయంపై సమ్మె చేశాయి. తమను కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేయొద్దని చెబుతూ... తమ వద్ద నుంచి మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. సమ్మె చేస్తామన్నారు. కార్డులు తీసుకోకూడదని కూడా ఒక దశలో నిర్ణయించారు. చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకుని కొంత గడువు అడగటంతో వెనక్కి తగ్గారు. నిజానికిది ఒక్క పెట్రోలు బంకుల సమస్య మాత్రమే కాదు. కార్డుల్ని స్వీకరించే వారందరి సమస్య. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఎలాంటి లావాదేవీలూ లేని లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డులు జారీ చేస్తున్నాయి. కానీ తమకు చార్జీలవుతున్నాయి కాబట్టి వ్యాపారులు ఈ కార్డుదారుల నుంచి కూడా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది 4 శాతం వరకూ ఉండటంతో కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. మనలో ఆ సత్తా ఉందా? వాలెట్లెలా వాడాలి? కార్డులెలా వాడాలి? నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలి? చార్జీలెంత? అనే విషయాలన్నీ పక్కనబెడితే... ఆసలు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించే వ్యవస్థ మన దగ్గర ఉందా? అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే డిజిటల్ లావాదేవీల్లో ఫెయిలవటం సాధారణంగా మారిపోయింది. ఇక మోసగాళ్ల సంగతి సరేసరి. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే ఖాతాలో డబ్బులు మాయం. పైపెచ్చు కొత్తగా వస్తున్న డిజిటల్ మాధ్యమాలకు సరైన నిబంధనలు కూడా లేవు. ఉదాహరణకు డబ్బులు తీసుకెళ్లడానికి ఏటీఎంకు వెళతాం. అక్కడ డబ్బులు రావు. కానీ డబ్బులు కట్ అయినట్లు మన మొబైల్‌కి మేసేజ్ మాత్రం వస్తుంది. తర్వాత మళ్లీ మన ఖాతాలో ఆ డబ్బులు జమవుతాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. సమస్య పరిష్కారానికి ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. ఏటీఎంలో డబ్బులు రాకుండా, మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే.. ఈ విషయాన్ని బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన ఏడు పనిదినాల్లో బ్యాంకులు ఆ సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే అవి రోజుకు రూ.100 జరిమానా భరించాలి. కానీ వాలెట్స్, యూపీఐ వంటి కొత్త పేమెంట్ చెల్లింపు మాధ్యమాలకు వచ్చేసరికి ఇలాంటి నిబంధనలు లేవు. లావాదేవీలకు, ఉద్యోగుల సంఖ్యకు పొంతన లేదు.. ‘‘పెద్ద నోట్ల రద్దు తరవాత లావాదేవీల పరిమాణం 10 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం 1.5–2 రెట్లే పెరిగింది. అందుకే ఫెయిలైన లావాదేవీల పరిష్కారానికి కొన్ని సంస్థలు ఎక్కువ రోజుల సమయం తీసుకోవచ్చు’ అని మొబిక్విక్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆకాశ్ గుప్తా చెప్పారు. వాలెట్ సంస్థలు వారి సిబ్బందిని వేగంగానే పెంచుకుంటున్నాయని తెలియజేశారు. ‘నవంబర్‌కు ముందు మొబిక్విక్లో 160 మంది ఉద్యోగులు ఉన్నారు. మార్చి చివరి నాటికి వీరి సంఖ్య 1,000కి చేరొచ్చు’ అని తెలిపారు. సోషల్ మీడియాను వాడేసుకోవచ్చు... లావాదేవీ ఫెయిలయ్యాక రెండు నుంచి ఏడు రోజుల్లోగా రిఫండ్ రాకపోతే.. వెంటనే వాలెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. మీకు వచ్చిన రెస్పాన్స్ సంతృప్తికరంగా లేకపోతే ఇంకా గట్టిగా ప్రయత్నించండి. ప్రతి వాలెట్ సంస్థ వాటి వెబ్సైట్లో సమస్య పరిష్కారపు నిబంధనలను పొందుపరిచే ఉంటుంది. అక్కడ సంబంధిత అధికారుల వివరాలు ఉంటాయి. వారిని సంప్రదించాలి. ‘‘చిట్టచివరిగా గ్రీవెన్స్ అధికారి వద్ద సమస్య కచ్చితంగా పరిష్కారమవ్వాలి. అక్కడా కాకపోతే మీరు ఆర్బీఐ గ్రీవెన్స్ సెల్‌ను సంప్రదించొచ్చు’ అని ఫ్రీచార్జ్ అధికార ప్రతినిధి చెప్పారు. సమస్యను బ్యాంక్ లేదా వాలెట్ సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తే త్వరగా పరిష్కారం కావచ్చని చిల్లర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చెప్పారు. ‘సంస్థలు వారి సోషల్ మీడియా ఇమేజ్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మీ సమస్య ఏడు రోజులు దాటినా కూడా తీరకపోతే.. అప్పుడు మీరు ఆయా సంస్థల సోషల్ మీడియా పేజ్‌లను వాడుకోండి’ అని సూచించారు. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
దశలవారీగా నగదురహితం
-
దశలవారీగా నగదురహితం
- ముందు పట్టణాల్లో,తర్వాత గ్రామాల్లో - 60 శాతం లక్ష్య సాధనకు కృషి - ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ నివేదిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒకేసారి నగదురహితం సాధ్యం కాదని, దాన్ని దశలవారీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదించింది. నగదురహిత లావాదేవీలపై ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ 10 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నగదు రూపం లో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలన్నిం టినీ ముందుగా నగదురహితంగా మార్చాలని సూచిం చింది. ‘‘సమాజాన్ని నగదురహితం చేయడం ఒకే సారి సాధ్యం కాదు. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అమలు చేసి, దశలవారీగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తే సరైన ఫలితముంటుంది. భారీ స్థాయి లో నగదు లావాదేవీలు జరిగేది పట్టణ ప్రాంతాల్లోనే గనుక అక్కడే ముందుగా అమలు చేస్తే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు’’ అని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగా ణలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేం దుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయడం తెలిసిందే. పలు దఫాల సమావేశాల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు కమిటీ నివేదిక అందజేసింది. అందులోని ముఖ్యాంశాలు... 60 శాతం నగదురహితం లక్ష్యం ► నెట్ బ్యాంకింగ్, కార్డులు, మొబైల్ సేవలతో పాటు చెక్కులను ఉపయోగించాలి. అధిక విలువ కలిగిన లావాదేవీలపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించాలి. దీంతో 60 శాతం మొత్తం లెక్కలోకి, పన్నుల పరిధిలోకి వస్తుంది. ► ప్రధానంగా పట్టణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలి... ► నగదురహిత లావాదేవీలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు డిజిటల్ అక్షరాస్యత పట్టణాల్లో ఉన్నందున అమలు సులభం. గ్రామాల్లో జరిగే లావాదేవీలు తక్కువే. ► పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు ఎక్కువగా సాగితే ఉన్న నగదును గ్రామీణ ప్రాంతాలకు తరలించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా అందరికీ బ్యాంకు ఖాతాలుండేలా చూడాలి. వారందరికీ రూపే కార్డులిచ్చి పని చేసేలా చూడాలి. ప్రభుత్వం, బ్యాంకర్లు రూపే కార్డులను ప్రోత్సహించాలి. ► బ్యాంకు ఖాతాలున్న ప్రతిఒక్కరికీ రూపే కార్డులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి ► డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి ► చౌకధర దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలను అమలు చేయాలి ► మార్కెట్ యార్డుల్లో రైతుల ఉత్పత్తులకు చేసే చెల్లింపులను బ్యాంక్ ఖాతాల్లోనే జమచేయాలి ► వంట గ్యాస్ సిలిండర్‌కు చెల్లింపులు నగదు రహితంగానే జరిగేలా చూడాలి ► ముందుగా ప్రభుత్వ లావాదేవీల్లో నగదురహిత విధానాన్ని అమల్లోకి తేవాలి ► రూ.500కు మించి ప్రభుత్వం చేసే, ప్రభుత్వానికి చేసే చెల్లింపులన్నీ డిజిటల్ పద్ధతిలో జరగాలి ►ఆన్లైన్లో విద్యుత్, మంచినీటి బిల్లుల చెల్లింపులపై సర్వీస్ చార్జీలను తొలగించాలి ►80 శాతం వరకు ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదురహితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి ► ప్రైవేట్ రంగంలోనూ అధిక విలువ కలిగిన లావాదేవీలు నగదురహితంగా జరిపేలా ప్రోత్సహించాలి ► రూ.5,000కు మించిన కొనుగోళ్లు.. రూ.1,000కి మించిన చెల్లింపులు నగదురహితంగా జరిగేలా చూడాలి ► నగదురహిత లావాదేవీల అమలు, పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి ► ఆన్లైన్, మొబైల్ సేవల్లో మోసాలు, అన్యాయాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి -
ఫోన్‌తో క్యాష్‌లెస్ లావాదేవీలు ఇలా..
-
డిజిటల్ మనీతో జాగ్రత్తలు ఇవీ..
నగదు రహిత లావాదేవీలతో లాభాలు ఎన్ని ఉన్నా.. సైబర్ ప్రపంచం తీరుతెన్నులపై అవగాహన లేకుంటే మాత్రం నష్టపోక తప్పదు. అందుకే నగదు రహిత లావాదేవీలు జరిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ► క్రెడిట్, డెబిట్ కార్డుల పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్)ను గోప్యంగా ఉంచుకోవాలి. దానిని తరచుగా మార్చుకుంటూ ఉండాలి. ► నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇంటిపేర్లను పాస్‌వర్డ్‌లుగా వాడుతూంటారు. అలా కాకుండా.. ప్రతి పాస్‌వర్డ్‌లో కొన్ని అక్షరాలు, ఒకట్రెండు అంకెలు, ప్రత్యేక సంకేతాలు ఉండేలా రూపొందించుకోవాలి. పాస్వర్డ్ ఎనిమిది అక్షరాలకు తక్కువ కాకుండా ఉంటే మంచిది. ► వేర్వేరు అకౌంట్లకు వేర్వేరు యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు వాడాలి. వాటిని ఎక్కడైనా రాసిపెట్టుకోవడం కూడా మంచిది కాదు. బదులుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండే పాస్వర్డ్ మేనేజర్లను వాడటం మేలు. వీటిలో మీ యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌లను నిక్షిప్తం చేసినా.. అవి ఎన్‌స్క్రిప్ట్ అవుతారుు కాబట్టి ఇతరులు తెలుసుకునే అవకాశం తక్కువ. ► ఇటీవల చాలా చోట్ల ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అలాంటి బహిరంగ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలను చేయకపోవడమే మేలు. ► స్మార్ట్ఫోన్లలో అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ నుంచి కొన్ని వివరాలు తీసుకునేందుకు అప్లికేషన్ తయారీదారులు అనుమతులు కోరతారు. ఏయే వివరాలు కోరుతున్నారో గమనించడం అవసరం. ► స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లలో లేటెస్ట్ యాంటీ వైరస్, మాల్వేర్, స్పైవేర్ సాఫ్ట్వేర్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ► మీకు పరిచయం లేని వ్యక్తుల నుంచి ప్రలోభాలు ఎర చూపుతూ వచ్చే మెయిళ్లను, అటాచ్మెంట్లను ఓపెన్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ► ఏ బ్యాంకు, ఆర్థిక సంస్థ మెయిళ్లు, ఫోన్ కాల్స్ ద్వారా మీ వివరాలు కోరదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తే సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయాలి. -
క్యాష్‌లెస్ లావాదేవీలు ఇలా..
మొబైల్ వాలెట్లు జేబులో ఉన్న పర్సు మొబైల్ ఫోన్లోకి మారితే దాన్ని మొబైల్ వ్యాలెట్ అనవచ్చు. సొమ్మును బ్యాంకు ఖాతా నుంచి డిజిటల్ రూపంలో మొబైల్ అప్లికేషన్లోకి బదలారుుంచుకుని వాడుకునేందుకు వీలు కల్పించే సౌకర్యం ఇది. క్రెడిట్ కార్డులతో కూడా మొబైల్ వాలెట్లలో డిజిటల్ నగదు చేర్చుకోవచ్చు. పేటీఎం, ఫ్రీచార్జ్, మొబీక్విక్ వంటివి మొబైల్ వ్యాలెట్లలో కొన్ని. మీరు ఉపయోగించే మొబైల్ వ్యాలెట్ ఆధారంగా మీకు అందే సేవలు ఉంటారుు. ప్లాస్టిక్ మనీ క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలను ప్లాస్టిక్ నగదు లావాదేవీలుగా పరిగణిస్తారు. బ్యాంకులు, కొన్ని ఇతర సంస్థలు ఈ కార్డులు జారీ చేస్తారుు. ఆన్‌లైన్‌లోనూ వీటిని తీసుకోవచ్చు, రీచార్జ్ చేసుకో వచ్చు కూడా. పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) యంత్రాలు ఉన్న చోట్ల వీటిని స్వైప్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ మొబైల్ వ్యాలెట్ల అవసరం లేకుండా నేరుగా ఇంటర్నెట్లో ఆయా బ్యాంకు ఖాతాల ద్వారా అన్ని రకాల సేవలు పొందేందుకు వీలు కల్పించేది నెట్ బ్యాంకింగ్. కంప్యూటర్ల ద్వారా, స్మార్ట్ఫోన్ల ద్వారా కూడా నెట్ బ్యాంకింగ్ నిర్వహించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు (సొంత ఖాతా లేదా ఇతరుల ఖాతా దేనికై నా సరే) నగదు బదిలీ చేయవచ్చు. ఇందుకు మూ డు పద్ధతులున్నారుు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స ట్రాన్సఫర్ (నెఫ్ట్ - అధిక మొత్తాల బది లీకి) వీటిల్లో ఒకటి. రెండోది రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్ - తక్కువ మొత్తాల బదిలీకి), మూడోది ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్ - తక్షణ బదిలీ కోసం). ఈ మూడు పద్ధతుల ద్వారా నగదు బదలారుుంపులకు అయ్యే ఖర్చు ఐదు రూపాయల నుంచి రూ. 55 వరకూ ఉంటుంది. -
నగదు రహితంగా లావాదేవీలు
► పెట్టుబడి నిధిని గ్రూపు సభ్యులు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు ►డీఆర్డీఏ పీడీ ఎం.ఎస్.మురళి ఒంగోలు సెంట్రల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రూపు సభ్యుల, ఇతర లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరగాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఎంఎస్.మురళి అన్నారు. స్థానిక టెక్నికల్ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్లో గురువారం ఇంటర్నెట్ సాధీలకు, గ్రామ సంఘాలకు నగదు రహిత లావాదేవీలపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ గ్రూపు సభ్యులు తమ రోజువారీ కార్యకలాపాలకు మొబైల్ బ్యాకింగ్, నెట్ బ్యాంకింగ్, రూపే డెబిట్ కార్డు స్వైపింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్నారు. గ్రూపు బ్యాంకు ఖాతాలో ఉన్న పెట్టుబడి నిధిని సభ్యులు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి మార్చుకుని వాడుకోవచ్చన్నారు. అరుుతే మళ్లీ తిరిగి ఖాతాకు నగదు జమచేయాలని చెప్పారు. గ్రూపుల్లో రూ.30 వేల వరకు జమరుు ఉంటాయన్నారు. ఒక్కొక్కరూ రూ.3 వేల వరకు నగదును తమ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకుని వాడుకోవచ్చని తెలిపారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల వినియోగదారులకు రూపే డెబిట్ కార్డులను అందజేశారన్నారు. రూపే డెబిట్‌కార్డు ద్వారా కూడా తమ నగదు లావాదేవీలు నిర్వహించుకోవాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేసే పెన్షన్ కూడా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని చెప్పారు. శిక్షణ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎన్.పోలప్ప, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ నరశింహారావు, జెడ్పీ సీఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.