హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఈ బ్యాంక్ కస్టమర్లు మే 25వ తేదీ శనివారం తెల్లవారు జామున నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది.
బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా మే 25 ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో అకౌంట్స్, డిపాజిట్లు, నిధుల బదిలీలు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, విత్ ఇన్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్లు), ఆన్లైన్ చెల్లింపు, తదితర లావాదేవీలు అందుబాటులో ఉండవు.
మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవల అంతరాయం గురించి కస్టమర్లకు ఎస్ఎంఎస్ కూడా పంపింది. పేర్కొన్న సమయంలో వినియోగదారులు డబ్బును డిపాజిట్ చేయలేరు. నిధులను బదిలీ చేయలేరు. యూపీఐ లావాదేవీలతో సహా ఎటువంటి ఆన్‌లైన్ చెల్లింపులు చేయలేరు.
Comments
Please login to add a commentAdd a comment